మాకినేని బసవ పున్నయ్య స్పూర్తితో నేటి యువతరం సమాజ అభ్యున్నతికి కృషి చేయాలి

అమరజీవి కామ్రేడ్‌ మాకినేని బసవ పున్నయ్య స్పూర్తితో నేటి యువతరం సమాజ అభ్యున్నతికి కృషి చేయాని సిపియం జిల్లా కార్యదర్శి పాశం రామారావు పిలుపు నిచ్చారు.
నేడు 2/7 బ్రాడీపేట సిపియం కార్యాయంలో బసవపున్నయ్య 103వ జయంతి సందర్భంగా నగర కార్యదర్శి కె.నళినికాంత్‌ అధ్యక్షతన సభను ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా పార్టీ సీనియర్‌ నాయకులు కె.రామిరెడ్డి బసవపున్నయ్య చిత్రపటానికి పూమాల‌వేసి నివాళుర్పించారు.
ఈ సందర్బంగా జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ కామ్రేడ్‌ బసవపున్నయ్య తన జీవితాంతం కష్టజీవు సమస్యల‌ పరిష్కారానికి కృషి చేశారు. కమ్యూనిస్టు ఉద్యమంలో అతివాద, మితవాద విచ్ఛిన్నకర ఉధ్యమాల‌కు వ్యతిరేకంగా పోరాడారన్నారు. సిపియం పార్టీ ఏర్పడిన తరువాత పార్టీ కార్యక్రమాన్ని ఎత్తుగడ పంధాను రూపక్పన చేయడంలో తనవంతు పాత్ర నిర్వహించారన్నారు. సోవియట్‌ యూనియన్‌లో సోషలిస్టు వ్యవస్థ వెనుకడుగు వేసినప్పుడు సైద్ధాంతిక నిబద్ధతతో పార్టీ శ్రేణును నిబెట్టడంలో కీల‌క పాత్ర పోషించారు. రాజ్యసభ సభ్యునిగా వుండి పార్లమెంట్‌లో ప్రజ వాణిని వినిపించారని, సైద్ధాంతిక అంశాను సైతం సాధారణ ప్రజకు అర్ధమయ్యే రీతిలో ఆయన ఉపన్యశించేవారన్నారు. ఆశయాను, ల‌క్ష్యాల‌ను ముందుకు తీసుకెళ్ళడమే నిజమైన నివాళి అన్నారు.