భారీగా పెరగనున్న ఎంపీల జీతాలు..

లోక్‌సభ, రాజ్యసభ ఎంపీల జీతభత్యాలు భారీగా పెరగనున్నాయి. ప్రస్తుతం వచ్చే జీతం, అలవెన్సులు డబుల్ కానున్నాయి. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాశాఖ ప్రతిపాదనలు చేసింది. ఓ ఎంపీ నెల జీతం రూ. 50 వేలు. ఇకపై ఇది రూ. లక్ష కానుంది. అదేవిధంగా నియోజకవర్గ నెల భత్యం రూ. 45 వేలు. ఇకపై ఇది రూ. 90 వేలు కానుంది. ఈ ప్రతిపాదనలకు ఆర్థిక మంత్రిత్వశాఖ ఆమెదం లభిస్తే ఓ ఎంపీ నెల జీతభత్యం రూ. 2.8 లక్షలుగా ఉండనుంది. ఈ ప్రతిపాదనలు వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఆమోదం పొందనున్నట్లు సమాచారం. ఎంపీల జీతభత్యాల సవరణ చివరిసారిగా 2010లో జరిగింది.