భారత్‌-పాక్ చర్చలపై సందిగ్ధత..

పంజాబ్లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య చర్చలపై సందిగ్ధం ఏర్పడింది. ఇరు దేశాల మధ్య విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలు జనవరి 14,15న ఇస్లామాబాద్‌లో జరగాల్సి ఉంది. అయితే పఠాన్‌కోట్‌లో దాడి జరిపిన ఉగ్రవాదుల మూలాలు పాక్‌లోనే ఉన్నాయని ఇప్పటికే భారత నిఘావర్గాలు ప్రాథమిక నిర్ధారణకు వచ్చాయి. పాక్ అధికార వర్గాలు ఉగ్రవాదంపై స్పష్టమైన వైఖరి పాటించకుండా ఓ వైపు చర్చలు అంటూ స్నేహహస్తం అందిస్తూనే.. మరో వైపు ఉగ్రమూకలకు సహకరిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో భారత, పాక్‌ విదేశాంగ కార్యదర్శుల చర్చలు నిలిపివేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు సమాచారం.