
ఆత్మహత్యకు పాల్పడిన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థి రోహిత్ వేముల కుటుంబం బౌద్ధమతం స్వీకరించనున్నట్లు బాబాసాహెబ్ అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ బుధవారం తెలిపారు. గురువారం భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ 125వ జయంతి సందర్భంగా రోహిత్ తల్లి, సోదరుడు బౌద్ధ బిక్షువుల సమక్షంలో దీక్ష స్వీకరిస్తారని పేర్కొన్నారు.