
పశ్చిమబెంగాల్‌లో త్వరలో జరగనున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటేసే పరిస్థితి కల్పించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాంఏచూరి విన్నవించారు. బెంగాల్ సీపీఐ(ఎం) నేత నీలోత్పల్‌బసుతో కలిసి ఢిల్లీలోని ఎన్నికల కమిషన్ కార్యాలయంలో సీఈసీ నసీంజైదీని ఏచూరి బుధవారం కలిశారు. గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఓటర్లు స్వచ్ఛందంగా ఓటుహక్కు వినియోగించుకునే వాతావరణం సృష్టించాలని విన్నవించారు.