
పార్లమెంటు తొలివిడత బడ్జెట్ సమావేశాలు మరో మూడు పనిదినాల్లో ముగియనున్న నేపథ్యంలో కీలక బిల్లులకు ఆమోదంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రజావేగుల రక్షణ(సవరణ) బిల్లు-2015, కాందిశీకుల ఆస్తుల(సవరణ, ఆమోదం) బిల్లు-2016వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. అలాగే లోక్‌సభ ఆమోదించిన ఆధార్ బిల్లుకు రాజ్యసభలో, ఎగువసభ ఆమోదముద్ర వేసిన రియల్ ఎస్టేట్ బిల్లుకు లోక్‌సభలో అంగీకారం పొందాల్సి ఉంది. వీటితోపాటు మరికొన్ని చర్చనీయాంశాలు దిగువసభలో ఆమోదం పొందాల్సి ఉంది. మరోవైపు ఏప్రిల్ 20 నుంచి పార్లమెంటు రెండో విడత సమావేశాలు ప్రారంభం కానున్నాయి.