బిజెపివి విచ్ఛిన్నరాజకీయాలు..

సోమవారం సిపిఎం నేత హరికిషన్‌సింగ్‌ సూర్జీత్‌ 7వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మోడీి అధికారంలోకి వచ్చాక బిజెపి ప్రజల్ని కుల, మత ప్రాతిపదికన విడగొట్టి పబ్బం గడుపుకొంటుందనీ ఆయన విమర్శించారు. అలాగే ప్రభుత్వాలు అనుసరిస్తున్న సరళీకరణ, ప్రపంచీకరణ ఆర్థికవిధానాల ఫలితంగా పేద,ధనిక వర్గాల మధ్య అంతరం రోజురోజుకి పెరిగి పోతుందన్నారు.భారత్‌లో సుమారు 90 శాతం కుటుంబాలు నెలకు కేవలం పది వేలు మాత్రమే సంపాది స్తున్నాయని, అదే సమయంలో ఒక వంద కుటుంబాల ఆదాయం దేశ జిడిపిలో సగానికి పైగా ఉంటుందనీ ఆయన తెలిపారు. 
సూర్జీత్‌ శత జయంతి సంవత్సరం సందర్భాన్ని పురస్కరించుకుని మాదకద్రవ్యాలకు బానిసలైన వారిని దాన్నుంచి బయటపడేసేందుకు డి-అడిక్షన్‌ సెంటర్స్‌ ఏర్పాటు , స్వాతంత్ర పోరాటం గురించి చైతన్య కార్యక్రమాల నిర్వహణ తదితర అంతర్జాతీయ సెమినార్లను నిర్వహిస్తున్నట్లు ఏచూరి ప్రకటించారు.