
జాతీయ వస్తు సేవల పన్ను(జిఎస్‌టి), బాంక్రప్టసి అండ్ ఇన్‌సాల్వెన్సీ బిల్లు రెండవ దశ బడ్జెట్ సమావేశాలలో ఆమోదం పొందుతాయనే ఆశాభావన్ని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ వ్యక్తం చేశారు. ఈ సమావేశాలు ఏప్రిల్ 20న ప్రారంభం కానున్నాయి. జిఎస్‌టి బిల్లు ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొంది రాజ్యసభలో ఆమోదం పొందేందుకు సిద్ధంగా ఉన్నది. రాజ్యసభలో కూడా ఆమోదం పొందిన తరువాత అక్టోబరు 1 నుంచి అమలులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఇక్కడ జరిగిన అడ్వాన్సింగ్ ఆసియా కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ పై విషయాలు తెలిపారు.