ప్ర‌జ‌ల‌పై విద్యుత్ భారాలు లేకుండా చూడాలి. పేద‌ల‌కు ఆంక్ష‌లు లేకుండా క‌నెక్ష‌లు ఇవ్వాలి. ఎస్సీ, ఎస్టీ బ‌కాయిలు ప్ర‌భుత్వ‌మే చెల్లించాలి.

    విద్యుత్‌ పంపిణీ సంస్థలు 2016-17కి సంబంధించి  ఆదాయము, వ్యయముల‌పై సమర్పించిన నివేదికలో ప్రతిపాదించిన టారిఫ్‌పై విద్యుత్‌ రెగ్యులేటరీ కమీషన్‌ బహిరంగ విచారణలో  సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యు సిహెచ్‌.బాబూరావు  ప‌లు అంశాలు అధికారులు తీసుకెళ్ళారు. విద్యుత్‌ వినియోగదారులపై 783 కోట్ల రూపాయ భారాన్ని మోపే ప్రతిపాదనల‌ను ఉపసంహరించుకోవాలి. గృహవినియోగదారులు, చిరువ్యాపారులు, స్థానిక సంస్థలు, రైల్వేట్రాక్షన్‌, కుటీరపరిశ్రమల‌పై ఈ భారం పడుతోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా అంతిమంగా ప్రజలే వీటిని మోయాల్సి వస్తుంది. అంతర్జాతీయంగా సహజవాయువు, బొగ్గు ఇతర ఇందన వనరులు తగ్గుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఛార్జీల పెంపు అన్యాయం. ఢల్లీిలో 50శాతం విద్యుత్‌ చార్జీలు తగ్గించిన విధంగానే రాష్ట్రంలోనూ ఛార్జీలు తగ్గించాలి.  గతంలో తెలుగుదేశం ప్రభుత్వం విద్యుత్‌ చార్జీను పెంచి ప్రజల‌ నిరసనను ఎదుర్కొన్నప్పటికీ గుణపాఠం నేర్చుకోకుండా మళ్ళీ ఛార్జీల పెంపును ప్రతిపాదించడం శోచనీయం. ఎన్నికల హామీల‌కు భిన్నంగా  టిడిపి వ్యవహరిస్తున్నది. నెల‌కు 200యూనిట్లుకు పైగా విద్యుత్‌ వినియోగించే గృహవి నియోగదారులపై 2015-16 సంవ్సతరం వినియోగం ఆధారంగా కేటగిరీల‌ను నిర్ణయించి భారం మోపడం అసమంజసం. కేటగిరీపై కొత్తప్రతిపాదనను రద్దు చేసి , గతంలో వున్న కేటగిరినే కొనసాగించాలి. కనీస ఛార్జీలు, కస్టమర్‌ ఛార్జీలు,రీ-కనెక్షన్‌ చార్జీలు తదితర రూపాల‌లో పేదప్రజల‌పై పడుతున్న భారాల‌ను తగ్గించాలి. .ప్ర‌భుత్వం మ‌రియు విద్యుత్‌ సంస్ధలు  పేద,మధ్యతరగతి ప్రజల‌ యెడల‌ కఠినంగానూ, బడా కంపెనీలు, ప్రైవేట్‌ విద్యుత్‌ కంపెనీల ఎడల  ఉదారంగా వ్యవహరించడం అన్యాయం. లోపబూయిష్టమయిన విద్యుత్‌ ఒప్పందాలు పి.పి.ఏ.ల‌ను రద్దు చేయాలి. మిగులు విద్యుత్‌ను తక్కువ ధరకు అమ్మి, అధిక ధరకు బయట నుండి విద్యుత్‌ కొనుగోలు చేయడం వల‌న 170 కోట్ల రూపాయలు ప్రజపై భారం పడుతోంది.  సాంప్రదేయతేర విద్యుత్‌ను ప్రోత్సహించాల‌నే పేరుతో సోలార్‌, పవన, బయోమాస్‌ ఉత్పతి సంస్ధల నుండి అత్యధిక ధరకు విద్యుత్‌ కొనుగోలు చేయడం, ప్రపంచ వ్యాప్తంగా విద్యుత్ ధరలు తగ్గుతున్న నేపద్యంలో ప్రైవేట్‌ సంస్ధల‌తో దీర్ఘకాలిక ఒప్పందాలు  చేసుకోవడం ఆక్షేపనీయం. ఒప్పందాల  కాపరిమితి పూర్తయినప్పటికీ ల్యాంకో-కొండపల్లి, జి.వి.కె.-జేగూరుపాడు,స్పెక్ట్రం కంపెనీల‌కు ఇప్పటికీ చెల్లింపు చేయడం, ఒప్పందా ల  రద్దు పునరుద్దరణ, నిబంధనల‌ను మార్పుపై తగు నిర్ణయం తీసుకోకపోవడం బాధ్యతా రాహిత్యం. సకాలంలో విద్యుత్‌ ఉత్పాదన చేయని ప్రైవేట్‌ విద్యుత్‌ కంపెనీల‌పై నిబంధన ప్రకారం చర్య‌లు తీసుకోకపోవడం, ఫెనాల్టీలు వసూలు చేయకుండా ప్రభుత్వం బడా కంపెనీల‌తో కుమ్మక్కవడం అక్రమం. ఏకపక్షంగా చేసుకున్న ఒప్పందాల‌ను రద్దు చేసి బహిరంగ మార్కెట్‌లో చౌకగా విద్యుత్‌ కొనుగోలు చేయాలి. రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు, కార్పొరేట్‌ సంస్ధ యాజమాన్యంలోని ప్రైవేట్‌ విద్యుత్‌కంపెనీల‌ దోపిడీకి అడ్డుకట్ట వేయాలి. ఇందనపు ధరలు తగ్గుతున్న నేపథ్యంలో 3శాతం వేరియబుల్‌ కాస్ట్‌ అధికంగా ప్రతిపాధించడం ప్రజా వ్యతిరేకం. దీన్ని ఉపసంహరించాలి. కేంద్రప్రభుత్వం బొగ్గు, సహజ యువును అవసరమైనంత కేటాయించాలి. ధరులు తగ్గించాలి. తగు ప్రోత్సాహాలు అందించాలి. రాష్ట్రఫ్రభుత్వం విద్యుత్‌ సబ్సిడీలు పెంచాలి. ప్రభుత్వ శాఖలు విద్యుత్‌ బకాయిు, ఎస్సీ,ఎస్టీ రుణబకాయిు, వివిధ ప్రభుత్వ కార్యక్రమాకు వినియోగించిన విద్యుత్‌ బకాయిలు ప్రభుత్వం చెల్లించాలి. విద్యుత్‌ వినియోగదారుల పిర్యాదుల‌పై పంపిణీ సంస్థలు, ట్రాన్స్‌కో సత్వరం స్పందించాలి. విద్యుత్‌ ప్రమాదాల‌లో మరణించిన కుటుంబాల‌కు 5ల‌క్షలు, గాయపడిన వారికి 2ల‌క్షలు నష్టపరిహారం చెల్లించాలి.హైఓల్టేజీతో దెబ్బతిన్న విద్యుత్‌ పరిరకాల‌కు తగు నష్టపరిహారం వినియోగదారుల‌కు చెల్లించాలి. నిరుపేదల‌కు వివిధ పోరంబోకు స్థలాలో నివసిస్తున్న వారికి ఆంక్షలు లేకుండా విద్యుత్‌ కనెక్షలు తక్షణమే ఇవ్వాలి.