ప్రభుత్వ కళాశాలలను ప్రభుత్వాలే భ్రష్టు పట్టించాయని పీడీఎఫ్ ఫ్లోర్ లీడర్ వి బాలసు బ్రహ్మణ్యం విమర్శించారు. శాసనమండలిలో సోమవారం ఉన్నత విద్యపై జరిగిన లఘు చర్చలో బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ డిగ్రీ కళాశాలలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉందని, విద్యార్థులు మాత్రం తక్కువగా ఉన్నారని తెలిపారు. ప్రైవేట్ కళాశాలల్లో 81.1శాతం, ఎయిడెడ్లో 8.8 శాతం, ప్రభుత్వ కళాశాలల్లో 10.9 శాతం మంది చదువుతున్నారన్నారు. వివిధ దేశాల్లోని ఉన్నత విద్యా విధానాలను ప్రభుత్వం అధ్యయనం చేస్తున్నా, అలా పేరొందిన యూనివర్సిటీలు మనదేశంలో ఎందుకు లేవో ఆలోచించాలని సూచించారు.