ప్రభుత్వాలదే భాద్యత:AIKS

ప్రభుత్వ విధానల వల్లే రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆలిండియా కిసాన్‌ సభ (ఎఐకెఎస్‌) అభిప్రాయపడింది. అఖిల భారత చెరకు రైతుల సంఘం తొలి మహాసభ తమిళనాడులోని ముధురై పట్టణంలో ఆదివారం ప్రారంభమైంది.  ఈ సందర్భంగా విజ్జూక్రిష్ణన్‌ మాట్లాడుతూ ప్రపం చంలో బ్రెజిల్‌ తర్వాత చెరకు ఉత్పత్తిలో ఇండియాదే రెండో స్థానమ న్నారు. చక్కెర వినియోగంలోనూ అదేస్థానంలో ఉన్నామన్నారు. అధికారంలోకి వస్తే చెరకు ఉత్పత్తి ఖర్చుకు 50 శాతం కలిపి ధర నిర్ణయిస్తామన్న మోడీ ప్రభుత్వం హామీని నిలబెట్టుకోవడంలో విఫల మైందన్నారు. పెరిగిన ఎరువుల ధరలు, ప్రభుత్వ విధానల వల్లే రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమ స్యలపై పంటల వారిగా రైతులను సమీకరించి రాబోయే రోజుల్లో ఉద్య మాలు చేపట్టాలని రైతు సంఘాలకు పిలుపునిచ్చారు.