పోరాటాలకు సిద్దం..పి మధు

ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా , ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆగస్ట్ 1వతేదీ నుండి 14వతేదీ వరకు దేశ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు తెలిపారు. విజయవాడ సిపిఎం పార్టీ కార్యలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో మధు మాట్లాడారు. రాష్ట్రంలో సంక్షేమం అరకొర ఉందని , చిరుద్యోగులు , కార్మికుల హక్కులపైదాడి ఈ కాలంలో బాగా పెరిగిపోయిందని, పాలనలో ఏకపక్షం తెలుగుదేశం పార్టీ వ్యవహారిస్తుందని మధు అన్నారు.

అందని రుణమాఫీ..
సంక్షేమ పథకాలు అరకొరగా అమలు జరుగుతందని దానికి రైతు రుణమాఫీ ప్రత్యేక్ష ఉదాహారణ అని అన్నారు. కౌలు రుణామాఫీ ఇప్పటివరకు అమలు అయిన పరిస్ధితి రాష్ట్రంలో కనిపించడం లేదన్నారు. 82లక్షల మంది కి ఉద్దేశించిన రుణమాఫీ 4వవంతుకు మాత్రమే పరిమితం అయ్యిదని, డ్వాక్ర మహిళలకు రుణ మాఫీ కూడా అందని పరిస్థితి.. చేనేత రుణమాఫీ గురిచి ఇప్పటివరకు ఊసేలుదు.

సంక్షోభంలో వ్యవసాయరంగం :

వ్యవసాయరంగంలో పరిస్థితులు ఆశాజనకంగా లేవు. గడిచిన సంవత్సరం ఒకవైపు తుఫాను, మరోవైపు కరువుల మూలంగా రైతులు ఎక్కువగా నష్టపోయారు. వరి, మొక్కజొన్న, శనగ, పొగాకు లాంటి పంటలకు కనీసధరలు లేకుండా పోయాయి. గత ఏడాది చెరుకు తోలిన రైతులకు ఇప్పటికీ ఫ్యాక్టరీలు డబ్బుచెల్లించలేదు.
రైతాంగ రుణభారం అంతకంతకు పెరుగుతోంది. రాష్ట్రస్థాయి బ్యాంకర్లు ఇచ్చిన లెక్కల ప్రకారం 2013మార్చి 31నాటికి రూ. 50,343కోట్లు రైతులు రుణాలు చెల్లించాల్సివున్నది. 2014లో ఇది రూ.59,105కోట్లకు చేరింది. ఈ సంవత్సరం అంటే 2015 మార్చి 31నాటికి ఇది రూ.65,356కోట్లకు పెరిగింది. ఇదంతా రైతులు బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాలు మాత్రమే.ఇవి కాకుండా స్థానిక వడ్డీవ్యాపారులు, ఎరువులు, పురుగుమందులు లాంటి వ్యాపారస్థుల దగ్గర రైతులు పొందిన రుణాలు అదనంగా వున్నాయి. దేశంలోని రైతుల వ్యవసాయ రుణాలలో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో వున్నదని నేషనల్‌ శ్యాంపిల్‌ సర్వే పేర్కొన్నది. అనేక ఆంక్షలతో రాష్ట్రప్రభుత్వం కేవలం రూ.7వేల కోట్ల రుణాలు మాత్రమే మాఫీ చేసింది. గత ఏడాది కరువు, తుఫాన్‌లకు నష్టపోయిన రైతులకు రూ.800కోట్ల రుపాయలు ఇన్‌పుట్‌ సబ్సిడీని ప్రభుత్వం ఇంకా చెల్లించలేదు.
పరపతి సమస్య ముఖ్యంగా కౌలురైతులకు ఈ సంవత్సరం తీవ్రంగా వున్నది. గత ఏడాది రూ.41,976కోట్లు పంటలకు రుణం లక్ష్యంగా ప్రకటిస్తే అందులో కేవలం రూ.29,658కోట్లు మాత్రమే ఇచ్చారు. అలాగే పాడి, గొర్రెల పెంపకం తదితర అనుబంధ రుణాలుకూడా ప్రకటించిన లక్ష్యంలో 49%మాత్రమే ఇచ్చారు. ఈ ఏడాది రూ.50,979కోట్లు పంట రుణాలు ఇస్తామని లక్ష్యాన్ని ప్రకటించారు. రాష్ట్రంలో సుమారు 20లక్షలమంది కౌలుదార్లుండగా ఈ ఏడాది 3.39లక్షలమంది కౌలుదార్లకు పంట రుణాలు ఇస్తామని ప్రకటించారు. మిగిలిన వారి పరిస్ధితి ఇప్పటికి ప్రశ్నర్ధకంగా ఉంది. రాజధానిప్రాంతంలో ఎన్యూమరేషన్‌లో అసలు కౌలుదార్ల గుర్తింపునే విస్మరించారు. రుణమాఫీలో జె.ఎల్‌.జి గ్రూపులు, రైతుమిత్ర గ్రూపులను విస్మరించారు.

చిరుద్యోగులపైదాడి : 
అంగన్‌వాడి ఉద్యోగుల వేతనాలు పెంచుతానని శాసనసభలో ప్రకటన చేసి 3నెలలు అయినా అతిగతి లేదు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు 9నెలలుగా వేతానాలు లేవు. మెనూ తాలుకూ 450కోట్ల రూపాయలు బకాయిలు వున్నారు. కనీస బిల్లులు కూడా చెల్లించడం లేదు. ఆషా వర్కర్స్‌ రూ.2వేలు వేతనం హామీ ఊసే లేదు. మున్సిపల్‌ కార్మికుల కనీసవేతనాలు తదితర సమస్యలు అపరిష్కృతంగానే వున్నాయి. ఈ రంగాలు సమ్మె సైరన్ మోగించేదుంకు సిద్దంగా ఉన్నాయి. న్యాయమైన కోర్కెలు అడుగుతుంటే ముందుస్తు అరెస్టులు, కేసులు లాంటివి ప్రయోగిస్తున్నారు. యానిమేటర్లు, అంగన్‌వాడీ కార్మికుల ఆందోళనల సందర్భంగా ఇదే జరిగింది. మహానాడులో ఆందోళనలు సహించేది లేదని తీర్మాణం చేశారంటే పరిస్ధితి ఏ విధంగా ఉండడడోతుందో అర్ధం అవుతుంది. వేతనాల విషయంపై ప్లకార్డులు ప్రదర్శించినందుకు నెల్లూరు జిల్లాలో 15మంది అంగన్‌వాడీ ఉద్యోగులను ఉద్యోగాల నుండి తొలగించింది.

కార్మికుల న్యాయమైన హక్కులు తీర్చాలంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగులేదని ఒక పక్క చెప్తు, మరొకవైపు పారిశ్రామికవేత్తలకు రూ. 2060కోట్ల సబ్సిడీ బకాయిలు (సుమారు 2009 సం॥రం నుండి) ఈ కాలంలోనే ఆఘ మేఘాలమీద ఇచ్చేసింది.
పెట్రోల్‌, డీజిల్‌మీద 4%వ్యాట్‌ (అదనంగా పెంచింది) పెంచడం, రిస్ట్రేషన్‌ ఛార్జీలు, ఇసుక మైనింగ్‌, ఎక్సైజ్‌, భూములరేట్లు, లాంటి వాటిని ప్రభుత్వం ఆర్థికవనరులు సమకూర్చుకోవడానికి మార్గాలుగా ఎంపిక జేసుకున్నది. 
కేంద్ర ప్రభుత్వం విభజనసందర్భంగా ప్రకటించిన ప్రత్యేకహోదాగానీ, వెనకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీలుగానీ ఇవ్వలేదు. ఈ కాలంలో బడ్జెట్‌లోటు రూ.22వేల కోట్లకు చేరింది. కేంద్రప్రభుత్వం రాజధానికోసం ఇస్తానన్న నిధులు ఇవ్వలేదు. తుఫాను సహాయకచర్యలకోసం ఇస్తానన్నదీ ఇవ్వలేదు. చివరకు రాయలసీమ కరువుకు సైతం కేంద్రం మొండిచెయ్యే చూపింది. స్థానికసంస్థల్లో అన్ని సేవలకు ఖర్చు ఎంతైతే అంత వినియోగదారుల నుండి వసూలుచేయాలన్న ఆదేశాలు ప్రజలమీద పెద్దఎత్తున భారాలు మోపేవిగా వున్నాయి. స్మార్ట్‌సిటీల నిర్మాణం పేరుతో అన్ని సేవలకు అయిన ఖర్చులన్నీ ప్రజలే భరించాలన్నది ఎత్తుగడగా పాములు కదుపుతుంది. కేంద్ర పథకాలలో నిధుల కుదింపుద్వారా రాష్ట్రంపై అదనపు భారం పడనుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపడంలేదు.

వ్యాపారమయం గా విద్యా, వైద్యరంగాలు ..
రాష్ట్రంలో విద్య వైద్య రంగాలు వ్యాపార మయం అయ్యాయి. పురుపాలక మంత్రిగా ఉన్న నారాయణ గారి కాలేజ్ లు విజయవాడలో అనుమతులు లేకుండా నడుస్తున్నాయి. ఒక్కో విధ్యార్ధి నుండి 30 వేల నుండి 70 వేల వరకు ఫీజులు వసుళ్లు చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తు విధ్యార్ధి సంఘాల నాయకులను అరెస్టు చేయడం దారుణం. విద్యావ్యాపారీకరణకు వ్యతిరేకంగా విద్యాపరిరక్షణ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీకి వి. కృష్ణయ్య చైర్మెన్ గా ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే విద్యావ్యాపారీ కరణ కు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించనుంది.
వైద్యరంగంలో కూడా ఒకకమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సిహెచ్ నర్సింగరావు చైర్మెన్ గా ఉంటారు. ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత వైద్యరంగం మరింత వ్యాపార మయం అయ్యింది. ప్రభుత్వం పూర్తిగా ప్రభుత్వం వైద్య రంగాన్ని విస్మరించింది. దీనితో పాటు మెడికల్ కాలేజ్ లలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం కూడా ఈ కమిటీ పనిచేస్తుంది.