
ఆంధ్రప్రదేశ్ ఇండిస్టియల్ ఇన్‌ఫ్రాస్టక్చర్ కార్పొరేషన్-ఎమార్ కేసును ఫిబ్రవరి, 2012లో ఈ ట్రైమెక్స్ కంపెనీ అధినేతపై నమోదైంది. అయితే రెండు నెలల తర్వాత మధు కోర్టు ముందు హాజరయ్యారు. అనూహ్యంగా అప్పుడే బెయిలూ లభించింది. ఈ కేసు పూర్తి వివరాల్లోకెళ్తే లగ్జరీ భవంతి అమ్మకపు లావాదేవీల్లో రూ.138 కోట్లు మధు తండ్రి రాజేంద్ర ప్రసాద్‌కు అందినట్లు తెలుస్తోంది. ఆ డబ్డును దుబారులోని మధుకు పంపినట్లు ఛార్జిషీటులో పేర్కొన్నారు. అంతేగాక ఈ వ్యవహారంపై ఏప్రిల్9, 2013లో ఇచ్చిన వివరణను మోసాక్ ఫోన్సెకాకు అదే రోజున పంపినట్లు స్పష్టమైంది.