
పనామా పత్రాల్లోని వివరాల్ని అంతర్జాతీయ పరిశోధక జర్నలిస్టుల కన్సార్టియం(ఐసీఐజే) మరోసారి పెద్దమొత్తంలో విడుదల చేసింది. ఈసారి భారత్‌కు చెందిన 2000 వివరాల్ని బయటపెట్టింది. అందులో 1046 మంది వ్యక్తులకు సంబంధించిన లింకులు, 828 అడ్రసులు, 42 మధ్యవర్తి సంస్థల పేర్లు ఉన్నాయి. నెవడా, హాంగ్‌కాంగ్, బ్రిటీష్ వర్జీన్ ఐల్యాండ్‌వంటి 21 దేశాల్లో నల్ల కుబేరులు అక్రమంగా డబ్బు దాచుకున్నట్టు తెలుస్తున్నది. భారత్‌తోపాటు పలు దేశీయులకు చెందిన 2,14,000 రహస్య కంపెనీల వివరాలను
కన్సార్టియం ఇప్పుడు వెల్లడించింది