నిబంధనవళి

నిబంధన-1

పార్టీపేరు

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

నిబంధన - 2

ఆశయము

భారత కార్మికవర్గ విప్లవాగ్రదళం భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు). కార్మికవర్గ నియంతృత్వ రాజ్యాంగ యంత్ర స్థాపన ద్వారా సోషలిజాన్ని, కమ్యూనిజాన్నీ సాధించడం దాని లక్ష్యం. మానవుని మానవుడు దోచుకునే పద్ధతి నుండి పూర్తి విముక్తిని సాధించుకోవడానికై, శ్రామిక ప్రజా బాహుళ్యానికి సరైన మార్గాన్ని జూపే మార్క్సిజం-లెనినిజం యొక్క తత్వశాస్త్రమూ, సూత్రములే యీ పార్టీ కార్యాచరణకు మార్గదర్శకంగా ఉన్నాయి. శ్రామికవర్గ అంతర్జాతీయతా పతాకాన్ని పార్టీ దృఢంగా చేబూని నిలుస్తుంది.

 

నిబంధన - 3

జెండా

పార్టీ జెండా ఎర్రజెండా, దీని నిలువు వెడల్పు కంటే 11/2 రెట్లు వుంటుంది. జెండా మధ్యలో క్రాస్‌గా వున్న తెల్లి సుత్తి, కొడవలి ఉంటాయి.

 

నిబంధన-4

సభ్యత్వం

1. భారతదేశంలో నివసిస్తూ 18 ఏండ్ల వయస్సు దాటి,  పార్టీ కార్యక్రమాన్ని నిబంధనావళిని అంగీకరించి, పార్టీ సంస్థలలో ఏదో ఒక దానిలో పని చేయడానికి అంగీకరించి, పార్టీ సభ్యత్వ రుసుమును (నిర్ణయించిన రుసుమునూ, లెవీని) క్రమంగా చెల్లిస్తానని ఒప్పుకొని, పార్టీ నియమాలను అమలు జరపడానికి అంగీకరించిన ఏ వ్యక్తియైనా పార్టీ సభ్యత్వమునకు అర్హుడవుతాడు.

2. (అ) వ్యక్తిగతంగా దరఖాస్తులు పెట్టిన  కొత్త సభ్యులను ఇద్దరు పార్టీ సభ్యులు సిఫార్సు చేసినచో పార్టీలోకి తీసుకొంటారు. సిఫార్సు చేసే పార్టీ సభ్యులు ఆ దరఖాస్తుదారును గూర్చి స్వయంగా తమకు తెలిసిందంతా పూర్తి బాధ్యతతో దరఖాస్తును విచారించి పార్టీ శాఖకు గానీ, యూనిట్ కి  గాని తెలియజేయాలి. దరఖాస్తుదారుని పార్టీలోకి తీసుకోదలిస్తే పార్టీ శాఖ ఆ మేరకు తన పై కమిటీకి సిఫార్సు చేయాలి. అన్ని సిఫార్సులపైనా ఆ పై కమిటీ  నిర్ణయం తీసుకుంటుంది.

(ఆ) కేంద్ర కమిటీ స్థాయి వరకూ పార్టీ శాఖకు పైనున్న అన్ని పార్టీ కమిటీలు నేరుగా కొత్త సభ్యులను పార్టీలోకి తీసుకోగల అధికారాన్ని కలిగి ఉంటాయి.

3. (అ) పార్టీ సభ్యత్వం కొరకై పెట్టుకొన్న దరఖాస్తులన్నింటినీ, దరఖాస్తు గురించి సిఫార్సు చేసిన నెలరోజులలోగా, అందుకు సంబంధించిన కమిటీల ముందు వుంచాలి.

(ఆ) దరఖాస్తుదారుని పార్టీలో చేర్చుకొంటే అతడు లేక ఆమె చేరిన రోజు నుండి ఒక ఏడాది పాటు క్యాండిడేటు సభ్యుడుగా లేక సభ్యురాలిగా ఎంచబడతారు.

4. స్థానిక, జిల్లా లేక రాష్ట్ర స్థాయిలో వున్న యితర పార్టీల నాయకులు పార్టీలో చేరదలచుకుంటే అటువంటి వారికి సభ్యత్వాన్ని యిచ్చే ముందు ఆయా స్థాయి కమిటీ ఆమోదించడమేగాక అందుకు పై మెట్టునున్న కమిటీ ఆమోదం కూడా పొందడం అవసరం. ప్రత్యేకమైన సందర్భాలలో యీ తరహా సభ్యులను పూర్తి స్థాయి పార్టీ సభ్యత్వానికి కేంద్ర కమిటీ లేదా రాష్ట్ర కమిటీ  అనుమతించవచ్చు. ఎన్నడైనా రాష్ట్ర కమిటీ యీ తరహా సభ్యులను అనుమతించదలిస్తే ముందుగా కేంద్ర కమిటీ అంగీకారాన్ని పొందాలి.

5. పార్టీ నుండి తొలగించిన సభ్యులను తిరిగి చేర్చుకోవాలంటే అతని తొలగింపును ధృవపరచిన పార్టీ కమిటీ గాని లేదా అంతకు పై కమిటీ గాని ఆ విషయాన్ని నిర్ణయించవలసి వుంటుంది.

6. ఎన్నుకోవడం, ఎన్నిక కావడం, ఏ ప్రతిపాదన మీదనైనా ఓటు చేయడం మినహా మిగతా అన్ని విషయాల్లోనూ పార్టీ సభ్యులకు వుండేహక్కులు, విధులు క్యాండిడేటు సభ్యులకు కూడా వుంటాయి.

7. క్యాండిడేటు సభ్యులను చేర్చుకోమని సిఫార్సు చేసిన శాఖగాని, చేర్చుకొన్న కమిటీ గాని వారిని ఏదో ఒక శాఖలో లేదా యూనిట్ లో చేర్చి వారికి పార్టీ కార్యక్రమం, నిబంధనావళి, ప్రస్తుత పార్టీ విధానాలకు సంబంధించి ప్రాథమిక పరిజ్ఞానాన్ని కలుగచేసేందుకు తగు ఏర్పాటు చేసి వారి అభివృద్ధిని గమనించుతూ వుండాలి.

8. క్యాండిడేటు  పూర్తయిన పిమ్మట ఆ క్యాండిడేటు సభ్యుని పూర్తి సభ్యునిగా తీసుకొనడానికి అర్హత సంపాదించాడా లేదా అనేది అందుకు సంబంధించిన పార్టీ శాఖ లేక కమిటీ చర్చించాలి. క్యాండిడేటు సభ్యుడు అనర్హుడుగా కనపడితే అతని లేక ఆమె క్యాండిడేట్ సభ్యత్వాన్ని పార్టీ శాఖ గాని, పార్టీ కమిటీ గాని రద్దు చేస్తుంది. పూర్తి స్థాయి పార్టీ సభ్యత్వాన్ని ఇచ్చిన సందర్భాలలో దానిని గూర్చిన నివేదికను ఆ పార్టీ శాఖ లేక పార్టీ కమిఈ పై కమిటీకి రెగ్యులర్‌గా పంపాలి.

9. ఆ నివేదికను పరిశీలించిన మీదట పై కమిటీ ఈ నివేదికను పంపిన శాఖతోగాని, కమిటీ తోగాని సంప్రదించి మార్చనూవచ్చు. లేదా సవరించనూ వచ్చు. క్యాండిడేటు సభ్యులుగానూ, క్యాండిడేట్ సభ్యులను పూర్తి సభ్యులుగానూ చేర్చుకొనేటప్పుడు జిల్లా, రాష్ట్ర కమిటీలు పర్యవేక్షణాధికారాలను కలిగి వుంటాయి. ఈ సందర్భంలో క్రింది కమిీలు చేసిన నిర్ణయాలను సవరించడానికి, నిరాకరించడానికి అవి హక్కును కలిగి వుాంయి.

10. పార్టీ సభ్యులెవరైనా తన సభ్యత్వాన్ని ఒక యూనిట్ నుండి మరో యూనిట్ కు బదిలీ చేసుకోవచ్చు. అట్లు బదిలీ చేసుకోవడానికి తాను వున్న యూనిట్ అనుమతిని పొందాలి. తాను కొత్తగా చేరగోరే యూనిట్ ఏ కమిటీ అధికార పరిమితి కింద వుంటున్నదో ఆ పై కమిటీకి తన యూనిట్ ద్వారా దరఖాస్తును పంపుకోవాలి.

 

నిబంధన - 5

పార్టీ ప్రమాణ పత్రం

పార్టీలో జేరే ప్రతి వ్యక్తి పార్టీ ప్రమాణ పత్రంపై సంతకం పెట్టాలి. ఆ ప్రమాణ పత్రం యిలా వుంటుంది.

            ''పార్టీ లక్ష్యాలను, ఆశయాలను నేను ఆమోదిస్తున్నాను. పార్టీ నిబంధనావళికి కట్టుబడి వుండానికి, పార్టీ నిర్ణయాలను విధేయతతో అమలు జరపడానికి నేను అంగీకరిస్తున్నాను. ''కమ్యూనిజం ఆశయాలకు అనుగుణంగా జీవించడానికి కృషి చేస్తాను. ఎల్లవేళలా స్వప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలను, ప్రజల ప్రయోజనాలను మిన్నగా ఎంచుకుంటూ కార్మికవర్గానికి, శ్రామిక ప్రజానీకానికి, దేశానికి నిస్వార్ధంగా సేవ చేస్తాను.''

 

నిబంధన-6

పార్టీ సభ్యత్వ రికార్డులు

పార్టీ సభ్యత్వ రికార్డులన్నినీ జిల్లా కమిటీ పర్యవేక్షణలో వుంచాలి.

 

నిబంధన-7

పార్టీ సభ్యత్వాన్ని సరిచూడటం

1. పార్టీ సభ్యుడు ఏ పార్టీ సంస్థకు చెందుతాడో ఆ పార్టీ సంస్థ ప్రతి సంవత్సరం పార్టీ సభ్యత్వాన్ని సరి చూస్తుంది. ఏ పార్టీ సభ్యుడైనా వరుసగా, సకారణం లేకుండా పార్టీ జీవితంలోగాని, కార్యకలాపాలలోగాని పాల్గొనకపోయినా, పార్టీ బాకీలు చెల్లించక పోయినా పార్టీ సభ్యత్వం నుండి మినహాయింపబడతాడు.

2. ఒక శాఖగాని, పార్టీ కమిటీ గాని సరిజూచిన పార్టీ సభ్యత్వ నివేదికను ధృవపరచడానికి, నమోదు చేయడానికి పై కమిటీకి  పంపాలి.

3. పార్టీ సభ్యత్వాన్ని పునరుద్ధరించనప్పుడు దానిపై విజ్ఞప్తి చేసుకొనే హక్కు వున్నది.

 

నిబంధన-8

పార్టీ సభ్యత్వం నుండి రాజీనామా

1. పార్టీ నుండి రాజీనామా యివ్వదలచుకొన్న పార్టీ సభ్యుడు తాను ఏ పార్టీ శాఖకు లేక పార్టీ కమిటీకి  చెందుతాడో దానికి తన రాజీనామాను అందజేయాలి. దానిని ఆ యూనిట్  అంగీకరించి సభ్యత్వం జాబితానుండి అతని లేక ఆమె పేరును కొట్టి వేయవచ్చును. ఆ విషయాన్ని తనపై కమిటీకి  నివేదించాలి. రాజీనామా గనుక రాజకీయ కారణాలపైనైతే దానిని యూనిట్  అంగీకరించకుండా నిరాకరించి అతనిని లేక ఆమెను బహిష్కరించవచ్చు.

2. రాజీనామా చేస్తున్న సభ్యుడు పార్టీ నుండి బహిష్కరించడానికి అవసరమయ్యేంతి తీవ్రంగా పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించి వున్నాడనే అభియోగానికి గురయ్యే పక్షంలో, అభియోగం గట్టిదైనప్పుడు అతని రాజీనామాను పార్టీనుండి బహిష్కరణగా పరిగణించి ఆ విధంగా చర్యను తీసుకోవచ్చు.

3. అలాంటి  రాజీనామాలను బహిష్కరణగా పరిగణించి చర్య తీసుకొన్నప్పుడు వెనువెంటనే ఆ విషయాన్ని పైకమిటీకి  తెలియజేసి దాని ధృవీకరణను పొందవలసి వుంటుంది.

 

నిబంధన - 9

సభ్యత్వ రుసుం

1. క్యాండిడేటు సభ్యులతో సహా ప్రతిపార్టీ సభ్యుడూ ఏడాదికి రెండు రూపాయలు పార్టీ సభ్యత్వ రుసుం క్రింద చెల్లించాలి. ఈ వార్షిక పార్టీ రుసుమును పార్టీలోకి తీసుకొన్నప్పుడూ, అటు తర్వాత ప్రతి ఏడాది మార్చి నెలాఖరులోగా తన సభ్యత్వమున్న శాఖ కార్యదర్శికిగాని, యూనిట్ కార్యదర్శికిగాని చెల్లించాలి. ఆ గడువులోగా రుసుం చెల్లించకపోతే అతని లేక ఆమె పేరు పార్టీ సభ్యుల జాబితానుండి తొలగించబడుతుంది. ఈ గడువును పరిస్థితులను బట్టి, అవసరమనుకుంటే కేంద్ర కమిటీ పొడిగించవచ్చు.

2. పార్టీ శాఖలుగాని, పార్టీ యూనిట్లుగాని పార్టీ సభ్యులనుండి వసూలు చేసే పార్టీ సభ్యత్వ రుసుమునంతా ఆయా పార్టీ కమిటీ లద్వారా కేంద్ర కమిటీ వద్ద జమకట్టాలి.

 

నిబంధన 10

పార్టీలెవీ

ప్రతి పార్టీ సభ్యుడూ ప్రతినెలా కేంద్రకమిటీ నిర్ణయించినట్లుగా పార్టీ లెవీని చెల్లించాలి. వార్షికాదాయం, లేక దఫదఫాలుగా వచ్చే ఆదాయం గలవారు ఆ రుతువు ప్రారంభంలోగాని, పావు సంవత్సరం ప్రారంభంలోగాని, నిర్ణీత శాతం ప్రకారం చెల్లించాలి. సభ్యుడు గనుక తాను చెల్లించవలసిన తేదీనుండి మూడు నెలలలోగా తన లెవీని చెల్లించకపోయినచో అతనిపేరు పార్టీ సభ్యుల జాబితానుండి తొలగించబడుతుంది.

 

నిబంధన-11

పార్టీ సభ్యుల బాధ్యతలు

1. పార్టీ సభ్యుల బాధ్యతలు ఈ క్రింది విధంగా వుంటాయి.

(అ) తాము సభ్యులుగా వున్న పార్టీ సంస్థ కార్యకలాపాల్లో క్రమబద్ధంగా పాల్గొంటూ, పార్టీ విధానాన్ని, నిర్ణయాలను, ఆదేశాలను విశ్వాసంతో నెరవేర్చాలి.

(ఆ) మార్క్సిజం-లెనినిజంను అధ్యయనం చేస్తూ తమ అవగాహనను పెంపొందించుకునేందుకు కృషి చేయాలి.

(ఇ) పార్టీ పత్రికలను, పార్టీ ప్రచురణలను చదవాలి. వాటిని  బలపర్చుతూ ప్రచారం చేయాలి.

(ఈ) పార్టీ నిబంధనావళిని, పార్టీ క్రమశిక్షణను పాించాలి. కమ్యూనిజం మహత్తరాశయాలకు అనుగుణంగా, శ్రామికవర్గ అంతర్జాతీయతను పాటిస్తూ వ్యవహరించాలి.

(ఉ) పార్టీ ప్రయోజనాలను, ప్రజల ప్రయోజనాలను స్వప్రయోజనాల కన్నా మిన్నగా పాటించాలి.

(ఊ) గాఢ విశ్వాసంతో ప్రజానీకానికి సేవచేయాలి. వారితో తమ సంబంధాలను అదేపనిగా పెంపొందించుకుంటూ వుండాలి. ప్రజల నుండి నేర్చుకొంటూ వారి అభిప్రాయాలను, కోర్కెలను పార్టీకి తెలుపుతూ వుండాలి. మినహాయింపులను పొందితేతప్ప ప్రతి పార్టీ సభ్యుడూ పార్టీ నాయకత్వాన ఏదో ఒక ప్రజాసంఘంలో పనిచేస్తూ వుండాలి.

(ఎ) పార్టీలో ఒకరిపట్ల మరొకరు కామ్రేడ్స్‌ మధ్యవుండవలసిన స్నేహసంబంధాలను పెంపొందించుకుంటూ సుహృద్భావాన్ని నికరంగా అభివృద్ధి చేసుకోవాలి.

(ఏ) ఒకరికొకరు తోడ్పడాలనే దృష్టితోనూ, వ్యష్టీ, సమిష్టి కార్యవిధానాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న దృష్టితోనూ విమర్శన-ఆత్మ విమర్శన అలవర్చుకోవాలి.

(ఐ) దాపరికం లేకుండా చిత్తశుద్ధితో వ్యవహరించుతూ పార్టీ పట్ల సత్యమార్గంలో సంచరించాలి. పార్టీ పట్ల విశ్వాసంతో వుండాలి. దానికి ఎప్పుడూ ద్రోహం చేయరాదు.

(ఒ) పార్టీ ఐక్యతనూ, సంఘిత శక్తినీ సదా కాపాడుతూ కార్మిక వర్గానికీ, దేశానికీ శత్రువులైనవారిపట్ల అప్రమత్తతతో వ్యవహరించాలి.

(ఓ) పార్టీకి, కార్మికవర్గానికి, దేశానికి శత్రువులైనవారి దాడుల నుండి పార్టీ లక్ష్యాలను కాపాడుతూ ఎల్లప్పుడూ పార్టీని సమర్ధించాలి.

2. పైన ఉదహరించిన బాధ్యతలన్నింనీ పార్టీ సభ్యులు పూర్తి చేసేటట్లు వారి విధుల నిర్వహణలో సర్వవిధాల తోడ్పడడం పార్టీ సంస్థల కర్తవ్యం.

 

నిబంధన-12

పార్టీ సభ్యుల హక్కులు

1. పార్టీ సభ్యుల హక్కులు ఈ విధంగా వుాంయి.

(అ) పార్టీ సంస్థలను, పార్టీ కమిటీలను ఎన్నుకునేందుకు, వాటికి ఎన్నికయ్యేందుకు,

(ఆ) పార్టీ విధానాన్ని, పార్టీ నిర్ణయాలను రూపొందించడంలో తోడ్పడానికి గానూ చర్చలలో స్వేచ్ఛగా పాల్గొనడానికి,

(ఇ) పార్టీ సభ్యుడు తాను పార్టీలో నిర్వహించే పనిని గురించి సూచనలు చేయడానికి,

(ఈ) పార్టీ సమావేశాల్లో పార్టీ కమిటీలను గురించి, పార్టీ కార్యకర్తలను గురించి విమర్శలు చేయడానికి,

(ఉ) తనపై క్రమశిక్షణా చర్యను గైకొనుటకు పార్టీ యూనిట్ లో చర్చ జరుగుతున్నప్పుడు తన యూనిట్ లో స్వయంగా హాజరై తన వాదనను చెప్పుకునేందుకు హక్కుంది,

(ఊ) ఏదైనా ఒక పార్టీ కమిటీ నిర్ణయంతో ఏ పార్టీ సభ్యుడైనా విభేదించినప్పుడు తన అభిప్రాయాన్ని తన పై కమిటీకి  తెలియపర్చు హక్కు గలదు. ఆ అభిప్రాయ భేదం రాజకీయ భేదాభిప్రాయమైనప్పుడు కేంద్ర కమిటీ  వరకూ పై కమిటీలకు తెలియజేయవచ్చు. అయితే అటువిం సందర్భాలన్నింలోనూ పార్టీ సభ్యుడు పార్టీ నిర్ణయాలను అమలు జరుపుతూ వుండాలి. భేదాభిప్రాయాలను ఆచరణ అనేపరీక్ష ద్వారానూ, సౌహార్ద్రపూరితమైన చర్చల ద్వారానూ పరిష్కారం చేసుకోవడానికి కృషిచేయాలి,

(ఎ) కేంద్రకమిటీతోసహా ఏ పై కమిటీకైనాసరే ఏ స్టెట్మెంటునైనా, ఏ విజ్ఞాపననైనా, ఏ ఫిర్యాదునైనా పంపుకునేందుకు ప్రతిసభ్యునికి హక్కు వుంటుంది.

2. పార్టీ సభ్యులకు గల ఈహక్కులన్నీ అమలుజరిగేటట్టు చూడడం పార్టీ సంస్థల, పార్టీ కార్యకర్తల విధి.

 

నిబంధన-13

కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రాలు

1. కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రాల మీద పార్టీ నిర్మాణ స్వరూపం ఆధారపడి వుంటుంది. ఆ సూత్రాలననుసరించి పార్టీ అంతరంగిక జీవితం కొనసాగుతుంది. కేంద్రీకృత ప్రజాస్వామ్యం సంపూర్ణమైన ఆంతరంగిక ప్రజాస్వామ్యం మీద ఆధారపడిన నాయకత్వమూ, కేంద్రీకృత నాయకత్వ సలహా సంప్రదింపులపై ప్రజాస్వామ్యం నిర్వహించడమూను.

పార్టీ నిర్మాణ స్వరూపంలో అనుసరించవలసిన కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రాలు ఇలా వుంటాయి.

(అ) పై నుండి క్రిందవరకూ పార్టీ నాయకత్వ సంస్థలన్నీ ఎన్నిక కావాలి.

(ఆ) అధిక సంఖ్యాకుల ఆమోదం పొందిన నిర్ణయాలను అల్పసంఖ్యాకులు అమలు జరపాలి. పై పార్టీ కమిటీలు చేసిన నిర్ణయాలను, ఆదేశాలను క్రింది పార్టీ యూనిట్లు అమలు జరపాలి. సమిష్టి అభిప్రాయానికి ప్రతివ్యక్తి లోబడి పనిచేయాలి. అన్ని పార్టీయూనిట్లూ పార్టీ మహాసభ, కేంద్రకమిటీ చేసిన నిర్ణయాలను ఆదేశాలను అమలుజరపాలి.

(ఇ) పై కమిటీలన్నీ తనకు క్రింద వున్న పార్టీ యూనిట్లకు వెంటనే నిర్ణీత వ్యవధుల్లో తమ కార్యకలాపాలను గురించి రిపోర్టు పంపాలి. అలాగే క్రింది కమిటీలన్నీ వెంటనే తమకు పై నున్న కమిటీలకు తమ కార్యకలాపాలను గురించి రిపోర్టులు పంపాలి.

(ఈ) పార్టీ కమిటీలు - ముఖ్యంగా నాయకత్వ కమిటీలు, దిగువ పార్టీ సంస్థలు - సాధారణ సభ్యులు వెలిబుచ్చే అభిప్రాయాలకు, విమర్శలకు చెవొగ్గాలి.

(ఉ) వ్యక్తిగత బాధ్యత, సమిష్టి నిర్ణయాలు, తనిఖీ అనే సూత్రాలపై ఆధారపడి అన్ని పార్టీ కమిటీలూ పనిచేయాలి.

(ఊ) అంతర్జాతీయ వ్యవహారాలకు, అఖిలభారత స్వభావం కలిగిన వ్యవహారాలకు లేదా ఒకికన్నా హెచ్చు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలకు లేదా మొత్తం దేశానికంతటికి  ఒకే మాదిరి నిర్ణయాలు చేయవలసిన సమస్యలకు సంబంధించిన విషయాల మీద అఖిలభారత యూనిట్లే నిర్ణయాలను తీసుకుంటాయి. రాష్ట్ర, జిల్లా స్వభావం గల సమస్యల మీద అందుకు సంబంధించిన పార్టీ యూనిట్లే సాధారణంగా నిర్ణయాలు చేస్తాయి. కాని అలాంటి నిర్ణయాలు ఏ పరిస్థితుల్లో కూడా తమ కంటే పై కమిటీలు చేసిన నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉండరాదు. ఏ రాష్ట్రానికైనా సంబంధించిన ఒక ప్రధాన సమస్యపైన కేంద్ర పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకోవలసి వచ్చినప్పుడు, అందుకు సంబంధించిన రాష్ట్ర పార్టీ యూనిట్ తో సంప్రదించిన మీదనే చేయవలసి వుంటుంది. అలాగే రాష్ట్ర కమిటీ, జిల్లాలకు సంబంధించిన ప్రధాన సమస్యపై వాటిని  సంప్రదించిన పిదపనే నిర్ణయాలను చేయాలి.

(ఎ) అఖిలభారత స్థాయిలో పార్టీ విధానానికి సంబంధించిన విషయాల మీద, అందులోనూ మొట్టమొదిసారిగా పార్టీ దృక్పధాన్ని వెల్లడించవలసి వచ్చిన సందర్భంలో, అలాంటి పార్టీ విధానాన్ని ప్రకించే హక్కు కేంద్ర నాయకత్వానికి మాత్రమేవుంటుంది. అయితే కేంద్ర నాయకత్వం పరిశీలన కోసం దిగువ కమిటీలు సకాలంలో తమ అభిప్రాయాలను, సూచనలను పంపవచ్చు. అలా పంపాలి కూడా.

2. మొత్తం పార్టీ సభ్యులు సంపాదించిన అనుభవం మీద, ప్రజా ఉద్యమాల అనుభవం మీద ఆధారపడి పార్టీ ఆంతరంగిక జీవితంలో ఈక్రింది కేంద్రీకృత ప్రజాస్వామిక సూత్రాలను మార్గదర్శకంగా అనుసరించాలి.

(అ) పార్టీకి, దాని విధానానికి, పనికి సంబంధించిన అన్ని విషయాలపై పార్టీ యూనిట్లోపల స్వేచ్చగా, నిర్మొహమాటంగా చర్చలు జరగాలి.

(ఆ) పార్టీ విధానాలను ప్రచారం చేసి, వాటిని  అమలు జరపటంలో పార్టీ సభ్యులందరూ బాగా పొల్గొనేలా నిరంతర కృషి జరపాలి. వారు పార్టీ పనిలోనూ, పార్టీ జీవితంలోనూ మరింత శక్తిమంతంగానూ, ఉపయోగకరంగానూ పని చేసే విధంగా వారి సిద్ధాంత రాజకీయ స్థాయి పెంచేందుకూ, వారి సాధారణ విజ్ఞాన స్థాయిని అభివృద్ది పరిచేందుకూ, నిరంతరం కృషి చేయాలి.

(ఇ) పార్టీ కమిటిలో  తీవ్రమైన విభేదాలు తల ఎత్తినప్పుడు ఒక అంగీకారానికి రావడానికి అన్ని విధాలుగా ప్రయత్నించాలి. అది సాధ్యం కాని పక్షంలో పార్టీ అవసరాల, ప్రజా ఉద్యమాల అవసరాల దృష్ట్యా వెనువెంటనే ఒక నిర్ణయం చేయవలసిన అవసరం వుంటే తప్ప, మరికొన్ని చర్చల ద్వారా ఆ విభేదాలను పరిష్కరించుకొనే దృష్టితో నిర్ణయాన్ని తీసుకోవడాన్ని వాయిదా వేయాలి.

(ఈ) పై నుంచి క్రింది వరకూ అన్ని స్థాయిలలోనూ విమర్శననూ, ఆత్మవిమర్శననూ ప్రోత్సహించాలి. ముఖ్యంగా క్రింది నుండి విమర్శలు రావడానికి ప్రోత్సాహం ఇవ్వాలి.

(ఉ) నిరంకుశ పోకడలు పెరగకుండా అన్ని స్థాయిల్లోనూ ఎడతెగని పోరాటం జరగాలి.

(ఊ) పార్టీలో ఏ రూపంలోనూ ముఠాతత్వంగాని, ముఠాలు గట్టడం గాని సహించరాదు.

(ఎ) సౌహార్ధ్ర సంబంధాలను, పరస్పర సహాయ భావాన్ని పెంపొందించడం ద్వారా పార్టీలో ఆత్మీయతను బలపరచుకోవాలి. కామ్రేడ్స్‌ పట్ల సానుభూతితో వ్యవహరించుతూ వారి తప్పులను సరిదిద్దాలి. పార్టీ సభ్యులనూ, వారి పనిని పరిశీలించేటప్పుడు చెదురుమదురుగా జరిగిన తప్పులను, ఘటనలను బట్టిగాక పార్టీ సేవలో వారి మొత్తం కృషిని దృష్టిలోకి తీసుకొని పరిశీలన జరపాలి.

 

నిబంధన - 14

అఖిలభారత పార్టీ మహాసభ

1. దేశం అంతికీ ఉన్నతోన్నతమైన పార్టీ నాయకత్వ సంస్థ అఖిల భారత పార్టీ మహాసభ.

(అ) సాధారణంగా పార్టీ మహాసభను మూడేండ్ల కొకసారి కేంద్రకమిటీఏర్పాటు చేయాలి.

(ఆ) తాను అవసరమని భావించే పక్షంలో కేంద్ర కమిటీ  ప్రత్యేక పార్టీ మహాసభను తనకిష్టమొచ్చినప్పుడు జరపవచ్చు లేదా మొత్తం పార్టీ సభ్యత్వంలో మూడవ వంతుకు తగ్గని ప్రాతినిధ్యం గల రెండు లేక అంతకన్న ఎక్కువ రాష్ట్ర పార్టీ సంస్థలు డిమాండ్‌ చేసినప్పుడు కూడా పార్టీ ప్రత్యేక మహాసభను జరపాలి.

(ఇ) కేంద్ర కమిటీ ప్రత్యేకంగా అందుకోసమే సమావేశమైనప్పుడే ప్రత్యేక పార్టీ మహాసభను లేదా మామూలుగా పార్టీ మహాసభను గాని జరిపే తేదీని, స్థలాన్ని నిర్ణయం చేయవలసి వుంటుంది.

(ఈ) మామూలుగా జరిగే పార్టీ మహాసభకు రాష్ట్ర పార్టీ మహాసభల్లో ఎన్నికైన వారూ అఖిల భారత పార్టీ కేంద్రం అధీనంలో వున్న పార్టీ యూనిట్ల సమావేశాల్లో ఎన్నికైన వారూ ప్రతినిధులుగా వుంటారు.

(ఉ) ఆయా రాష్ట్రాలలో వున్న మొత్తం పార్టీ నాయకత్వాన నడిచే ప్రజా ఉద్యమాల బలమూ, ప్రజా సంఘాల బలమూ, పార్టీకున్న రాజకీయ ప్రాబల్యమూ ప్రాతిపదికపై మామూలుగా జరిగే మహాసభకు ప్రతినిధుల సంఖ్యను కేంద్ర కమిటీ నిర్ణయిస్తుంది. ఇదే ప్రాతిపదికపై ప్రత్యేక మహాసభకు ప్రతినిధుల సంఖ్యనూ, ఆ ప్రతినిధుల నెన్నుకొనే పద్ధతినీ కూడా కేంద్ర కమిటీయే నిర్ణయిస్తుంది.

(ఊ) అది ప్రత్యేక పార్టీ మహాసభ అయినా, మామూలు పార్టీ మహాసభ అయినా కేంద్ర కమిటీసభ్యులు అందులో పూర్తి సభ్యులుగా పాల్గొనే హక్కును కలిగి వుంటారు.

2. మామూలుగా జరిగే పార్టీ మహాసభ విధులూ, అధికారాలూ ఈ క్రింది విధంగా వుాంయి.

(అ) కేంద్ర కమిటీ సమర్పించే రాజకీయ నిర్మాణ నివేదికలను చర్చించి దానిపై చర్య తీసుకోవడం.

(ఆ) పార్టీ కార్యక్రమాన్ని, నిబంధనావళిని సవరించడం లేదా మార్పు చేయడం.

(ఇ) ప్రస్తుత పరిస్థితిపై పార్టీ విధానాన్ని నిర్ణయించడం

(ఈ) రహస్య బ్యాలేట్ ద్వారా కేంద్ర కమిటీని ఎన్నుకోవడం.

3. ప్రతినిధుల అర్హతలను పరిశీలించి, పార్టీ కాంగ్రెస్‌కు నివేదించే అర్హతల కమిటీని ఎన్నుకొంటుంది.

4. మహాసభ కార్యక్రమాన్ని నడిపేందుకు ఒక అధ్యక్ష వర్గాన్ని ఎన్నుకొంటుంది.

 

నిబంధన - 15

కేంద్రకమిటీ

1. (అ) కేంద్ర కమిటీ సభ్యులను పార్టీ మహాసభ ఎన్నుకోవాలి. కేంద్ర కమిటీలో ఎంతమంది సభ్యులు వుండాలో పార్టీ మహాసభ నిర్ణయిస్తుంది.

(ఆ) రద్దవుతున్న కేంద్ర కమిటీ నూతన కమిటీలో వుండవలసిన సభ్యుల జాబితాను మహాసభ ముందు వుంచుతుంది.

(ఇ) ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగి, కార్మికవర్గ విప్లవాత్మక దృక్పథంలో గాఢ విశ్వాసం కలిగి, మార్క్సిజం-లెనినిజం బాగా అధ్యయనం చేసిన సమర్థులైన నాయకులతో కేంద్ర కమిటీకి అభ్యర్థుల జాబితాను తయారు చేయాలి.

(ఈ) అలా ప్రతిపాదించిన జాబితాలో ఏ పేరుకైనా అభ్యంతరం చెప్పానికి, మరో కొత్తపేరును గాని, పేర్లను గాని ప్రతిపాదించానికి మహాసభకు చెందిన ఏ ప్రతినిధికైనా అధికారం వుంటుంది. అయితే ముందుగా వారి అంగీకారాన్ని పొందాలి.

(ఉ) ప్రతిపాదిత వ్యక్తులలో ఎవరికైనా తమ పేరును ఉపసంహరించుకోవానికి హక్కున్నది.

(ఊ) అలా ప్రతిపాదించిన పేర్ల జాబితాకు ప్రతినిధులు అదనంగా ప్రతిపాదించిన పేర్లను జత చేసి యీ జాబితాపై మహాసభలో ఓటింగు జరుగుతుంది. దానిపై సింగిల్‌ డిస్ట్రిబ్యూటర్‌ ఓటింగ్‌ (ఎన్నిక కావలసిన అభ్యర్థుల సంఖ్య ఎంత వుంటే అన్ని ఓట్లు ప్రతి ప్రతినిధికి వుంటాయి) పద్ధతి మీద రహస్య బ్యాలేట్ ద్వారా ఎన్నిక జరుగుతుంది.

2. పార్టీ అఖిల భారత మహాసభకూ, మహాసభకూ మధ్యకాలంలో పార్టీ అత్యున్నతాధికార సంస్థగా కేంద్ర కమిటీ వుంటుంది.

3. నిబంధనావళిని అమలు జరపడానికి, పార్టీ మహాసభలో ఆమోదించిన రాజకీయ విధానాన్ని, నిర్ణయాలను అమలు జరపానికి కేంద్ర కమిటీ బాధ్యత వహించుతుంది.

4. పార్టీ మొత్తానికి కేంద్ర కమిటీ ప్రాతినిధ్యం వహించుతుంది. పార్టీ మొత్తం పనిని నడిపించడానికి కూడా అది బాధ్యత వహించుతుంది. పార్టీని ఎదుర్కొనే ఏ సమస్యపైన అయినా పూర్తి అధికారంతో నిర్ణయాలను తీసుకొనే హక్కు కేంద్ర కమిటీకి వుంటుంది.

5. కేంద్ర కమిటీ తన సభ్యులలో నుండి ప్రధాన కార్యదర్శితో సహా ఒక పొలిట్ బ్యూరోను ఎన్నుకొంటుంది. పొలిట్ బ్యూరోలో ఎంతమంది సభ్యులు వుండాలో కేంద్ర కమిటీ నిర్ణయిస్తుంది. కేంద్ర కమిటీ రెండు సమావేశాల మధ్య దాని పనిని పొలిట్ బ్యూరో కొనసాగిస్తుంది. కేంద్ర కమిటీ రెండు సమావేశాల మధ్య రాజకీయ నిర్మాణ నిర్ణయాలను తీసుకొనే హక్కును పొలీట్ బ్యూరో కలిగి వుంటుంది.

6. రాష్ట్రకమిటీ కార్యదర్శుల ఎన్నిక, రాష్ట్ర పార్టీ పత్రికల సంపాదకుల ఎన్నిక కేంద్ర కమిటీ ఆమోదాన్ని పొందాలి.

7. (అ) తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యం, దుష్ప్రవర్తన లేదా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు - ఈ నేరాలకు గాను కేంద్ర కమిటీ తన సభ్యులలో ఎవరినైనా కమిటీ నుండి తొలగించవచ్చు. అలా తొలగించానికి కమిటీ సభ్యులలో మూడింట రెండు వంతుల మంది హాజరై అందుకు ఓటు చేయవలసి వుంటుంది. ఏ సందర్భంలో అయినప్పటికీ మొత్తం కేంద్ర కమిటీ సభ్యులలో సగానికంటే ఎక్కువ మంది మాత్రమే అలా తొలగించడానికి హక్కు కలిగి వుాంరు.

(ఆ) కమిటీ లో ఏర్పడే ఖాళీని మొత్తం సభ్యులలో మామూలు మెజారిటీతో భర్తీ చేయవచ్చు.

(ఇ) కేంద్ర కమిటీలో ఒక సభ్యుడుగాని లేదా కొంతమంది సభ్యులుగాని అరెస్టు అయిన పక్షంలో వారి స్థానంలో అందుకు ప్రత్యామ్నాయంగా సభ్యులను కో-ఆప్టు చేసుకోవచ్చు. అలా కో-ఆప్టు చేసుకొన్న సభ్యులు అంతకుముందున్న సభ్యుల వలెనే పూర్తి హక్కులను కలిగి వుంటారు. అయితే అరెస్టు అయిన సభ్యులు విడుదలై తమ విధులను నిర్వహించడం ప్రారంభించగానే కో-ఆప్టు అయిన సభ్యులు తమ స్థానాలను ఖాళీ చేయవలసి వుంటుంది.

8. రెండు కేంద్ర కమిటీ సమావేశాల మధ్యకాలం మామూలుగా మూడు మాసాలకు మించరాదు. మొత్తం సభ్యులలో మూడింట ఒక వంతు ఎప్పుడు కోరితే అప్పుడు సమావేశం జరపాలి.

9. కేంద్ర కమిటీ రాజకీయ నిర్మాణ సమస్యలను, ప్రజా ఉద్యమాలకు సంబంధించిన సమస్యలను చర్చించి నిర్ణయాలు చేయాలి. రాష్ట్ర కమిటీలకు, ప్రజా సంస్థలో అఖిల భారత పార్టీ ఫ్రాక్షన్‌లకు సలహాలిస్తూ వుండాలి.

10. పార్టీ సొమ్ముకు కేంద్ర కమిటీ బాధ్యత వహిస్తుంది. ఏడాదికొకసారి పొలిటీ బ్యూరో సమర్పించే ఆదాయ-వ్యయ పట్టికను అంగీకరించుతుంది.

11. పార్టీ మహాసభ జరిగినప్పుడల్లా కేంద్ర కమిటీ తన రాజకీయ, నిర్మాణ నివేదికను ఆ మహాసభకు సమర్పించాలి.

12. పార్టీ విప్లవ నాయకత్వాన్ని బలపర్చే ఉద్దేశంతోనూ రాష్ట్ర, జిల్లా సంస్థలపై అజమాయిషీ వుంచానికి గాను కేంద్ర కమిటీ తన ప్రతినిధులనూ, ఆర్గనైజర్లనూ పంపుతుంది. వీరు ప్రతి దఫా కేంద్రకమిటీ,  పొలిటీ బ్యూరోలు గావించే ప్రత్యేక ఆదేశాలననుసరించి పని చేయవలసి వుంటుంది.

13. కేంద్ర కమిీ అవసరమని తలచినప్పుడు కేంద్ర కమిటీ విస్తృత సమావేశాన్ని గాని, ప్లీనంనుగాని, కాన్ఫరెన్సును గాని పిలవవచ్చును. ఇటువంటి  సమావేశాలకు ప్రతినిధులు ఏ ప్రాతిపదికపై హాజరు కావాలి. వారెలా ఎన్నికకావాలి అన్న విషయాలను కేంద్ర కమిటీయే నిర్ణయిస్తుంది.

అత్యవసర కాలాలలో గాని లేదా పెద్ద ఎత్తున అరెస్టులు జరిగినప్పుడు గాని కేంద్ర, రాష్ట్ర, జిల్లా కమిటీలు దృఢమైన చిన్న సంస్థలుగా నిర్మాణమవుతాయి. కేంద్ర కమిటీని  అలా పునర్నిర్మించుటకు బైట మిగిలి వున్న పొలిట్ బ్యూరో సభ్యులు పేర్ల జాబితాను తయారు చేస్తారు. లోపల, బయట వున్న కేంద్ర కమిటీ సభ్యులు ఆ పేర్లను ఆమోదించాలి. రాష్ట్ర, జిల్లా కమిటీల పునర్నిర్మాణమునకు గాను పేర్లను ఆయా కమిటీలకు చెంది అరెస్టు కాకుండా వున్న వారు తయారు చేస్తారు. వాటిని వాటిపై కమిటీలు ఆమోదించాలి. అవి తమ విద్యుక్త ధర్మాలనూ, బాధ్యతలనూ నెరవేర్చానికిగాను అవసరమనుకున్న ఉపసంఘాలను ఏర్పరచవచ్చును. పునర్నిర్మితమైన కేంద్ర కమిటీ పార్టీ సంస్థల సంరక్షణార్థం కొత్త నిబంధనలను తయారు చేయుటకు అధికారం కలిగి యున్నది. అయితే, పరిస్థితి మామూలు స్థితికి వచ్చినప్పుడు ఎన్నికైన కమిటీలు పునరుద్ధరించబడతాయి.

 

నిబంధన-16

రాష్ట్ర జిల్లా పార్టీ సంస్థలు

1. రాష్ట్రంలో లేదా జిల్లాలో ఆయా రాష్ట్ర, జిల్లా మహాసభయే అత్యున్నతమైన పార్టీ సంస్థ. ఆ మహాసభల్లో రాష్ట్ర కమిటీని లేదా జిల్లా కమిటీని  ఎన్నుకుంటారు.

2. (అ) రాష్ట్ర లేదా జిల్లా పార్టీ కమిటీల నిర్మాణ స్వరూపం, వాటిహక్కులూ, విధులూ అఖిల భారత స్థాయిని, పైన నిర్ణయించిన నిబంధనలను పోలి వుంటాయి.

అయితే వాటివిధులు రాష్ట్రానికి లేదా జిల్లా సమస్యలకే పరిమితమై వుాంయి.

(ఆ) ఆయా రాష్ట్రం లేదా జిల్లా కమిటీలు కార్యదర్శితో సహా ఒక కార్యదర్శి వర్గాన్ని ఎన్నుకొంటాయి. కాని పై కమిటీ అనుమతించే పక్షంలో రాష్ట్ర లేక జిల్లా కమిటీ  కార్యదర్శివర్గం అనేది లేకుండా వుండవచ్చు.

(ఇ) ఏ పార్టీ సభ్యుడైనా క్రమశిక్షణను ఘోరంగా ఉల్లంఘించినా, నీతి బాహ్యంగా ప్రవర్తించినా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు జరిపినా అి్ట వానిని రాష్ట్ర కమిటీలేక జిల్లా కమిటీ తన మొత్తం సభ్యులలోని అధిక సంఖ్యాకుల నిర్ణయంపై తనలో నుండి తొలగించుతుంది.

3. (అ) ఉద్యమ అవసరాలను బట్టి జిల్లా కమిటీ ప్రాంతాన్ని రాష్ట్ర కమిటీ నిర్ణయిస్తుంది. అలాంటి  ప్రాంతం పరిపాలిత ప్రాంతానికే ఖచ్చితంగా కట్టుబడి వుండవలసిన అవసరం లేదు.

(ఆ) ప్రాథమిక యూనిట్ (శాఖ)కు, జిల్లా లేక ప్రాంతీయ కమిటీకి  మధ్య వుండవలసిన వివిధ పార్టీ సంస్థల నియామకాన్ని రాష్ట్ర కమిటీ నిర్ణయించవలసి వుంటుంది. ఆ సంస్థల స్వరూపాన్ని, వాటి విధులను గురించి కూడా అవసరమైన నిబంధనలను రాష్ట్ర కమిటీయే నిర్ణయిస్తుంది. కేంద్ర కమిటీ నిర్ణయించిన నిబంధనలకు అనుగుణంగానే ఇది జరుగుతుంది.

 

నిబంధన-17

ప్రాథమిక యూనిట్

1. (ఆ) పార్టీ ప్రాథమిక యూనిట్ గా పార్టీ శాఖ వుంటుంది. అది వృత్తిగానీ లేక ప్రాంతాన్ని గాని ఆధారం చేసుకొని ఏర్పాటవుతుంది.

(ఆ) ఒక ఫ్యాక్టరీలోగాని, ఒక సంస్థలోగాని లేదా ఒక పరిశ్రమలోగాని ఉన్న పార్టీ సభ్యులను వారి వారి వృత్తులను బట్టి లేదా చేసే పనిని బట్టి శాఖలను ఏర్పాటు చేయాలి. ఆ విధంగా పార్టీ శాఖలు ఏర్పడినప్పుడు అలాంటి పార్టీ శాఖలోని సభ్యులు తాము నివసించే ప్రాంతాల్లోని పార్టీ శాఖల్లో అసోసియట్ సభ్యులుగా ఉంటారు. లేదా ఆ ప్రాంతాల్లో సహాయ శాఖలుగా వ్యవహరించవచ్చు. వారు నివసించే ప్రాంతాల్లో వారికి అప్పజెప్పే పనులు ఫ్యాక్టరీలో లేదా వారు పని చేసే సంస్థల్లో పార్టీ శాఖకు అప్పగించిన పనులకు ఆటంకం కలిగించే విధంగా ఉండరాదు.

(ఇ) శాఖలోని సభ్యుల సంఖ్య తొమ్మిదికి మించి ఉండరాదు. శాఖ పనులు, ఇతర విషయాలను గూర్చి రాష్ట్ర కమిటీ  నిర్ణయిస్తుంది.

2. తన ప్రాంతంలోగాని, తన రంగంలోగాని ఉండే కార్మిక, రైతు తదితర తరగతుల ప్రజానీకానికి, పార్టీ ఉన్నత కమిీలకూ మధ్య సజీవ సంబంధంగా ఉండేది శాఖ. దాని కర్తవ్యాలు ఇవి :

(అ) పై కమిటీ ఆదేశాలను అమలు జరుపుట.

(ఆ) తన ఫ్యాక్టరీలోగానీ, ప్రాంతంలోగాని ఉండే ప్రజాసామాన్యం పార్టీ రాజకీయ, నిర్మాణ నిర్ణయాలను బలపర్చునట్లు చేయుట.

3. రోజువారీ కార్యక్రమాన్ని అమలు జరపానికిగాను శాఖ తన కార్యదర్శిని ఎన్నుకుంటుంది. పై కమిటీ  ఆ ఎన్నికను ధృవపర్చాలి.

 

నిబంధన - 18

కేంద్ర రాష్ట్ర కంట్రోల్  కమీషనులు

1. అయిదుగురు సభ్యులకు మించని కేంద్ర కంట్రోల్  కమిషన్‌ను పార్టీ మహాసభ నేరుగా ఎన్నుకొంటుంది. కేంద్ర కమిటీ ఎక్స్‌-అఫీషియో సభ్యుడే కేంద్ర కంోలు కమిషన్‌కు అధ్యకక్షులుగా వుాంరు.

2. కంట్రోల్  కమిషన్‌ చేపట్టే బాధ్యతలు :

(అ) కేంద్ర కమిటీ లేదా పొలిట్ బ్యూరో నివేదించిన క్రమశిక్షణా చర్యల కేసులు

(ఆ) రాష్ట్ర కమిటీలు క్రమశిక్షణా చర్యలు చేప్టినప్పుడు విజ్ఞప్తి చేసుకొన్న కేసులు

(ఇ) పూర్తి స్థాయి పార్టీ సభ్యత్వం నుండి బహిష్కరణ, సస్పెన్షన్‌కు సంబంధించిన కేసులపైనా, పార్టీ సభ్యత్వాన్ని పునరుద్ధరించరాదన్న నిర్ణయాలపైనా, రాష్ట్ర కమిటీ లేదా రాష్ట్ర కంట్రోల్  కమీషన్‌కు చేసుకున్న విజ్ఞప్తులను తిరస్కరించినప్పుడు

3. కేంద్ర కంట్రోల్  కమీషన్‌ నిర్ణయమే అంతిమ నిర్ణయం. దీనికి అందరూ కట్టుబడి వుండాలి.

4. కంట్రోల్  కమిషన్‌ పని విధానానికి సంబంధించిన సవివరమైన నిబంధనలకు కంట్రోల్  కమిషన్‌తో సంప్రదింపులు జరిపిన అనంతరం కేంద్ర కమిటీ రూపొందిస్తుంది.

(అ) పార్టీ మహాసభల నడుమ కేంద్ర కంట్రోల్  కమిషన్‌లో ఖాళీ ఏర్పడిన పక్షంలో దానిని భర్తీ చేసే హక్కు కేంద్ర కమిటీకి వుంది.

5. క్రమశిక్షణా చర్యలకు సంబంధించిన కేసులను పరిశీలించేటందుకుగాను రాష్ట్ర మహాసభ, రాష్ట్ర కంట్రోలు కమిషన్‌ను ఎన్నుకొనవచ్చును. ఏదైనా రాష్ట్రానికి రాష్ట్ర కంట్రోలు కమిషన్‌ ఏర్పడినట్లయితే దాని పని విధానమూ, అధికారములు కేంద్ర కంట్రోలు కమిషన్‌ను పోలి ఉంటాయి. అయితే యివి తన రాష్ట్రానికి మాత్రమే పరిమితమై వుాంయి.

 

నిబంధన-19

పార్టీ క్రమ శిక్షణ

1. పార్టీ ఐక్యతను సంరక్షించి బలోపేతం చేయడానికి, దాని బలాన్నీ, పోరాట పిమను, ప్రతిష్టను పెంపొందించానికి, కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రాలను అమలు జరపడానికి క్రమశిక్షణ తప్పనిసరిగా అవసరం. పార్టీ క్రమశిక్షణను ఖచ్చితంగా అంటిపెట్టుకొని వుండకపోతే ప్రజలను, వారి పోరాలనూ, కార్యకలాపాలనూ పార్టీ నడపలేదు. ప్రజల పట్ల తనకున్న బాధ్యతలను పార్టీ నిర్వర్తించలేదు.

2. పార్టీ లక్ష్యాలను, కార్యక్రమాన్ని, విధానాలను చైతన్యపూరితంగా ఆమోదించడం మీదనే క్రమశిక్షణ ఆధారపడి వుంటుంది. పార్టీ సభ్యులంతా పార్టీ నిర్మాణంలోగాని, ప్రజా జీవితంలోగాని వారికి గల స్థానాలతో నిమిత్తం లేకుండా పార్టీ క్రమశిక్షణకు సమముగానే బద్ధులవుతారు.

3. పార్టీ నిబంధనావళినీ, పార్టీ నిర్ణయాలను ఉల్లంఘించడం, కమ్యూనిస్టు పార్టీ సభ్యునికి తగని విధంగా ఏ పనినైనా చేయడం లేక వ్యవహరించడం, పార్టీ క్రమశిక్షణను భంగపరిచినట్లే అవుతుంది. అలాిం వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకొనబడతాయి.

4. క్రమశిక్షణా చర్యలనగా ?

(అ) మందలింపు (వార్నింగ్‌)

(ఆ) అభిశంసన (సెన్‌షర్‌)

(ఇ) బహిరంగ అభిశంసన

(ఈ) పార్టీలోనున్న స్థానాల నుండి తొలగించడం

(ఉ) ఏడాదికి మించకుండా ఎంతకాలమైనా పార్టీ పూర్తి సభ్యత్వాన్నుండి తొలగించడం

(ఊ) బహిష్కరణ (ఎక్స్‌పల్షన్‌)

5. ఒక కామ్రేడ్‌ తప్పులను సరిదిద్దడానికి నచ్చచెప్పటం మొదలగు యితర పద్ధతులన్నీ విఫలమైన తరువాతనే సాధారణంగా క్రమశిక్షణా చర్యలు తీసుకొనబడతాయి. అలా క్రమశిక్షణా చర్యలు తీసుకున్న సందర్భాల్లో కూడా అందుకు సంబంధించిన కామ్రేడ్‌ను సరిదిద్దడానికి కృషి సాగుతూనే వుండాలి. పార్టీ ప్రయోజనాలనూ, పార్టీ ప్రతిష్టనూ కాపాడుటకు అత్యవసర క్రమశిక్షణా చర్య తీసుకోవలసినంత తీవ్రమైన క్రమశిక్షణా ఉల్లంఘన జరిగితే వెనువెంటనే క్రమశిక్షణా చర్యలు తీసుకోబడతాయి.

6. పార్టీ నుండి బహిష్కరణ అన్ని శిక్షణా చర్యలలో అతి తీవ్రమైనది. అందువల్ల పార్టీనుండి బహిష్కరించే చర్యను అత్యంత జాగరూకతతోనూ, పరిశీలనతోనూ పూర్వాపరాలను ఆలోచించి మరీ తీసుకోవాలి.

7. పై కమిటీధృవీకరణ లేకుండా పార్టీ పదవుల నుంచి తొలగించడం, విచారణ జరుగుతున్నప్పుడు మినహా పార్టీ సభ్యత్వం నుండి సస్పెండ్‌ చేయటం, పార్టీ నుంచి బహిష్కరించటం వాటి  క్రమశిక్షణా చర్యలను అమలు చేయరాదు. బహిష్కరణ అయినట్లయితే పై కమిటీ ధృవీకరణ వచ్చేవరకు క్రమశిక్షణా చర్యకు గురైన పార్టీ సభ్యుని పార్టీ కార్యకలాపాలన్నింటి  నుంచి దూరంగా వుంచటం జరుగుతుంది. బహిష్కరణను పై కమిటీ ధృవీకరించే వరకు బహిష్కృత సభ్యుడు సస్పెన్షన్‌లో వుంటాడు. అతడు / ఆమె వున్న కమిటీ  తన నిర్ణయాన్ని ఆరుమాసాలలోగా తెలియజేయాలి.

8. ఏ కామ్రేడ్‌ మీదనైతే క్రమశిక్షణా చర్యను తీసుకోవాలన్న ప్రతిపాదనవచ్చిందో ఆ కామ్రేడ్‌కు అతనిపై మోపిన ఆరోపణలను, అందుకు సంబంధించిన తదితర వివరాలను తెలియజేయాలి. తాను ఏ యూనిట్  సభ్యుడో ఆ యూనిట్  ముందు స్వయంగా హాజరై తన వాదనను చెప్పుకోవానికి, తనపై చర్య తీసుకొనే యితర యూనిట్ కు తన సమాధానమును దాఖలు చేసుకోవానికి అతనికి లేక ఆమెకు హక్కు వున్నది.

9. ఒకరు రెండు పార్టీ యూనిట్లలో ఏకకాలంలో సభ్యుడుగా వున్నట్లయితే క్రింది యూనిట్ అతనిపై లేక ఆమెపై క్రమశిక్షణా చర్య తీసుకోమని సిఫార్సు చేయవచ్చును. కాని పై యూనిటు అంగీకరించేవరకు ఆ శిక్షణా చర్య తీసుకోమని సిఫార్సు చేయవచ్చును. కాని పై యూనిటు అంగీకరించేవరకు ఆ శిక్షణా చర్య అమల్లోకి రాదు.

10. సమ్మె విచ్ఛిన్నకులకూ, త్రాగుబోతులకూ, నైతికంగా అధోగతి పాలైన వారికి, పార్టీ విశ్వాసానికి ద్రోహం చేసిన వారికి, తీవ్రమైన ద్రవ్యాపహరణ నేరం చేసిన వారికి ఛార్జిషీట్లు యిచ్చివారు తమ సమాధానాన్ని పంపేలోగా తమ యూనిట్  గాని లేక ఆపై పార్టీ సంస్థచేగాని వెనువెంటనే పార్టీ సభ్యత్వం నుండి సస్పెండు చేయడం, పార్టీలో వారికి గల అన్ని బాధ్యతాయుత స్థానాల నుండి తొలగించటం జరుగుతుంది. పార్టీ బాధ్యతలన్నింటి నుంచి తొలగింపు, సస్పెన్షన్‌ కాలాన్ని మూడు మాసాలకు మించి పొడిగించరాదు.

11. శిక్షణా చర్యను తీసుకొన్న అన్ని సందర్భాల్లోనూ అప్పీలు చేసుకొనే హక్కు ఉంటుంది.

12. ఎల్లప్పుడు అదే పనిగా పార్టీ నిర్ణయాలను, విధానాన్ని ధిక్కరిస్తూ, తీవ్రమైన ముఠాతత్వం కలిగి, పార్టీ శిక్షణకు భంగం కలిగించే ఏ క్రింది కమిీనైనా రద్దు చేసి, కొత్త కమిీలను ఏర్పరచుకోవాటానికి లేదా శిక్షణా చర్యలను తీసుకోవానికి, గాని, కేంద్ర, రాష్ట్ర, జిల్లా కమిటీలకు హక్కు ఉంది. అయితే తాము తీసుకున్న ప్రతి చర్యనూ, రాష్ట్ర, జిల్లా కమిటీలు  వెనువెంటనే తమపై కమిటీలకు తెలియజేయాలి. పై కమిటీతాను అవసరమనుకొన్న చర్య గైకొనుటకు అధికారం కలిగి వున్నది.

13. సాధారణ పరిస్థితులలో, మిక్కిలి తీవ్రమైన పార్టీ వ్యతిరేక చర్యలకు పూనుకొన్న పార్టీ సభ్యులను బహిష్కరించుటకుగాను పార్టీ కమిటీలు  తమ విచక్షణను ఉపయోగించవచ్చు.

 

నిబంధన-20

ప్రజా సంస్థలకు ఎన్నికైన పార్టీ సభ్యులు

1. పార్లమెంటుకు, రాష్ట్ర శాసనసభకు లేదా స్థానిక పరిపాలనా సంస్థలకు ఎన్నికైన పార్టీ సభ్యులు ఒక పార్టీ గ్రూపుగా ఏర్పడి, అందుకు సంబంధించిన పార్టీ కమిటీ క్రింద, పార్టీ విధానాలకు, కార్యక్రమానికి, ఆదేశాలకు ఖచ్చితంగా అంటిపెట్టుకొని వుంటూ పని చేయాలి.

2. కమ్యూనిస్టు శాసనసభ్యులు అచంచల దీక్షతో ప్రజల ప్రయోజనాలను కాపాడాలి. శాసనసభ లోపల వారు చేసే పని ప్రజా ఉద్యమాన్ని ప్రతిబింబిస్తూ ఉండాలి. అక్కడ వారు పార్టీ విధానాలను బలపరుస్తూ వాటిని  ప్రచారంలోకి తీసికొని రావాలి. కమ్యూనిస్టు శాసనసభ్యుల శాసనసభా కార్యక్రమాన్ని బయట జరిగే పార్టీ కార్యకలాపాలతోనూ, ప్రజా ఉద్యమాలతోనూ, సన్నిహిత మొనర్చుతూ మేళవింప చేయాలి. పార్టీని ప్రజా సంఘాలను నిర్మించడంలో తోడ్పడడం కూడా వారు విధిగా ఎంచుకోవాలి.

3. తమను ఎన్నుకొన్న ఓటర్లతోనూ, ప్రజానీకంతోనూ, కమ్యూనిస్టు శాసనసభ్యులు అత్యంత సన్నిహితమైన సంబంధాలను వుంచుకొంటూ ఉండాలి. తమ శాసనసభా కార్యక్రమాన్ని గురించి వారికి సక్రమంగా తెలియజేస్తూ వారి నుండి ఎప్పికప్పుడు సూచనలను పొందుతూ వుండాలి.

4. కమ్యూనిస్టు శాసనసభ్యులు వ్యక్తిగతంగా అత్యంత నిజాయితీపరులుగా వుండాలి. నిరాడంబర జీవితాన్ని గడపాలి. ప్రజలతో వ్యవహరించేటప్పుడు వినయం కలిగి వుండాలి. స్వప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలనే మిన్నగా ఎంచుకోవాలి.

5. కమ్యూనిస్టు శాసనసభ్యులూ, కమ్యూనిస్టు స్థానిక సంస్థల సభ్యులూ తీసుకొనే జీతాలు, భత్యాలూ పార్టీ సొమ్ముగా భావించబడుతుంది. ఈ సభ్యుల జీతాలనూ, భత్యాలనూ అందుకు సంబంధించిన పార్టీ కమిటీలు నిర్ణయించుతాయి.

6. కార్పొరేషన్లకు, మున్సిపాల్టీలకు, బస్తీ లేక ఏరియాకమిటీలకు, జిల్లాపరిషత్తులకు, పంచాయతీ సమితులకూ, గ్రామ పంచాయతీలకు ఎన్నికైన పార్టీ సభ్యులు అందుకు సంబంధించిన పార్టీ కమిటీలేదా పార్టీ శాఖ క్రింద పని చేయాలి. వారంతా తమను ఎన్నుకొన్న ఓటర్లతోనూ, ప్రజాసామాన్యంతోనూ సన్నిహితమైన దైనందిన సంబంధాలను పెట్టుకొంటూ తాము ఎన్నికైన సంస్థలలోవారి ప్రయోజనాలను కాపాడాలి. తమను ఎన్నుకొన్న ఓటర్లకు, ప్రజలకు తమ పనిని గురించి సక్రమంగా రిపోర్టులిస్తూ వారి సూచనలను, సలహాలను తీసుకోవాలి. స్థానిక సంస్థల్లో చేసే తమ పనిని బయట జరిగే ప్రజా కార్యక్రమాలతో జోడించాలి.

7. పార్లమెంటుకు, శాసనసభలకు, కేంద్ర పాలిత ప్రాంతాలలో కౌన్సిళ్ళకు జరిగే ఎన్నికలకు పార్టీ అభ్యర్థుల పేర్లకు కేంద్ర కమిటీ ఆమోదాన్ని పొందాలి. రాష్ట్ర శాసనసభలకు, కేంద్రపాలిత ప్రాంతాల కౌన్సిళ్ళకు పార్టీ అభ్యర్థుల పేర్లను ఆయా రాష్ట్ర కమిటీ నిర్ణయించి ప్రకటించాలి.

కార్పొరేషన్‌లకు, మున్సిపాలిటీలకు, జిల్లా బోర్డులకు, స్థానిక బోర్డులకు పంచాయతీలకు పార్టీ అభ్యర్థులను నిలబెట్టే విషయమై అనుసరించదగిన నియమాలను రాష్ట్ర కమిటీలు తయారు చేయాలి.

 

నిబంధన - 21

పార్టీ అంతరంగిక చర్చలు

1. పార్టీని సమైక్యపరచానికై పార్టీ మొత్తం వివిధ సంస్థలలోనూ, పార్టీ విధానంపై స్వేచ్ఛగానూ, క్రమంగా చర్చలు జరపటం ఉపయోగకరమూ, అవసరం కూడా. ఇది పార్టీ అంతరంగిక ప్రజాస్వామ్యం నుండి ఉదయించే పార్టీ సభ్యుల విడదీయరాని హక్కు. అయితే పార్టీ విధానానికి సంబంధించిన సమస్యలపై ఎడతెగని చర్చలు జరపడం పార్టీ అంతరంగిక ప్రజాస్వామ్యాన్ని ఘోరంగా దుర్వినియోగం చేయటమే అవుతుంది.

2. అఖిల భారత స్థాయిలో పార్టీ అంతరంగిక చర్చలను కేంద్రకమిటీ ఈ క్రింది సందర్భాలలో ఏర్పాటు చేస్తుంది.

(అ) అవసరమని తాను తలచినప్పుడు

(ఆ) పార్టీ విధానానికి సంబంధించి ఏదైనా ఒక ముఖ్య అంశంపైన కేంద్ర కమిటీలో తగినంత గ్టి మెజారిటీలేనప్పుడు.

3. అఖిల భారత స్థాయిలో అంతరంగిక చర్చలు జరపాలని పార్టీ మొత్తం సభ్యులలో మూడవ వంతుకు ప్రాతినిధ్యం వహించే రాష్ట్ర కమిటీలు కోరినప్పుడు.

4. తాను స్వయంగాగాని లేక రాష్ట్రంలో వున్న పార్టీ సభ్యుల మొత్తంలో మూడవ వంతు ప్రాతినిధ్యం వహించే జిల్లా కమిటీలు కోరినప్పుడు గాని కేంద్ర కమిటీ అనుమతితో రాష్ట్ర కమిటీ తన రాష్ట్రానికి సంబంధించిన పార్టీ విధానాలలోని ఏదైనా ఒక ముఖ్య అంశాన్ని చర్చించుటకై పార్టీ అంతరంగిక చర్చను ప్రారంభించవచ్చు.

5. పార్టీ అంతరంగిక చర్చలు కేంద్ర కమిీ పర్యవేక్షణలో జరగాలి. చర్చనీయాంశాలను అదే తయారు చేస్తుంది. ఈ చర్చను పర్యవేక్షించే కేంద్ర కమిటీయే ఆ చర్చను సాగించే పద్దతిని కూడా నిర్ణయిస్తుంది.

రాష్ట్ర కమిటీ చర్చను ప్రారంభించినప్పుడు కేంద్ర కమిటీ  అంగీకారంతో చర్చనీయాంశాలను తయారు చేస్తుంది. చర్చల పద్ధతిని నిర్ణయిస్తుంది.

 

నిబంధన - 22

పార్టీ మహాసభకు, ఇతర మహాసభలకు ముందు జరిగే చర్చ

అఖిల భారత పార్టీ మహాసభ జరిగేనాటికి  రెండు నెలల ముందుగానే పార్టీ యూనిట్లన్నీ చర్చించేందుకుగాను ముసాయిదా తీర్మానాలను కేంద్ర కమిటీ పంపిస్తుంది. ఆ తీర్మానాలకు ప్రతిపాదించిన సవరణలన్నింనీ నేరుగా కేంద్ర కమిటీకి పంపాలి. అప్పుడు కేంద్ర కమిటీ వాటీపై రిపోర్టు తయారు చేసి పార్టీ మహాసభ ముందు పెడుతుంది. తమ చిత్తు తీర్మానాన్ని వివిధ భాషలలో తర్జుమా చేసి అన్ని పార్టీ శాఖలకు కేంద్ర కమిటీ విడుదల చేసిన తర్వాత సాధ్యమైనంత తక్కువ కాలంలో చర్చల సారాంశాన్ని అందచేయవలసిన బాధ్యత రాష్ట్ర కమిటీలపై ఉన్నది.

 

నిబంధన - 23

ప్రజాసంఘాల్లో పని చేసే పార్టీ సభ్యులు

ప్రజాసంఘాల్లోనూ, ఆ సంఘాల కార్యనిర్వాహక వర్గాల్లోను పనిచేసే పార్టీ సభ్యులు అందుకు సంబంధించిన పార్టీ కమిటీ నాయకత్వాన ఫ్రాక్షన్‌ కమిటీలుగా ఏర్పడి పని చేయాలి. వారు తాము పనిచేసే ప్రజాసంఘాల ప్రజాపునాదిని, పోరాట పటిమను బలోపేతం చేయడానికి సదా కృషిని సాగించాలి.

 

నిబంధన - 24

ఉపనిబంధనలు

పార్టీ నిబంధనావళి క్రింద దానికి అనుగుణంగా కేంద్ర కమిటీ కొన్ని నియమాలను, కొన్ని నిబంధనలను  తయారు చేయవచ్చు. అలాగే కేంద్ర కమిటీ ధృవీకరణకు లోబడి రాష్ట్ర కమిటీ కూడా పార్టీ నిబంధనావళి క్రింద దానికనుగుణంగా కొన్ని నియమాలను ఉపనిబంధనలను తయారు చేసుకోవచ్చు.

 

నిబంధన - 25

పార్టీ నిబంధనావళిని సవరించే అధికారం పార్టీ మహాసభకు మాత్రమే వుంది. నిబంధనావళిని సవరించడానికి చేసే ప్రతిపాదనల నోటీసును పార్టీ మహాసభ జరగడానికి రెండు నెలల ముందుగానే పంపాలి.

పార్టీ నిబంధనావళికి రూల్స్‌

(1988 ఏప్రిల్‌ 8-10 తేదీలలో కేంద్ర కమిటీ సమావేశం ఆమోదించినవి)

ఆర్టికల్‌ 4, సెక్షన్‌ (10) సభ్యత్వం

ఒక శాఖ నుండి మరొక శాఖకు, ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి సభ్యత్వం బదిలీ గురించి:

వివరణ : ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి సభ్యత్వం బదిలీ కేంద్ర కమిటీ ద్వారానే జరుగుతున్నప్పటికీ అందుకై పేర్కొంటున్న వివరాలు సాధారణంగా సంపూర్ణంగా వుండటం లేదు. అందువల్ల రాష్ట్రాలు ఒక కామ్రేడ్‌ సభ్యత్వాన్ని ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి బదిలీ చేయమని కోరేటప్పుడు ఆ రాష్ట్రం ఈ క్రింది విషయాలను స్పష్టంగా పేర్కొనాలి. ప్రతి స్థాయిలో పార్టీ సభ్యుని రికార్డు సక్రమంగా వుంచడానికి అది అవసరం. అదేవిధంగా రాష్ట్రంలో బదిలీ చేయాలన్నా అదే వర్తిస్తుంది.

 

రూల్స్‌ - సభ్యత్వం బదిలీ

1. బదిలీ కాపీతోపాటు క్రింది వివరాలను తప్పనిసరిగా తెలియజేయాలి.

కామ్రేడ్‌ పేరు :

వయస్సు :

పార్టీలో చేరిన సంవత్సరం :

ఆమె/అతడు ఏ శాఖకు చెందిన వారు ? :

ఆమె/అతడు పని చేసిన ప్రజాసంఘం ? :

నెలవారీ లెవీ మొత్తం ఎప్పటివరకు చెల్లించారు ? :

ఏమైనా క్రమశిక్షణా చర్య తీసుకుంటే దాని రికార్డు :

ఆమె/అతడు ఏ రాష్ట్రం నుండి బదిలీ కావాలి :

ఆమె/అతడు ఏ రాష్ట్రానికి బదిలీ కావాలి :

పార్టీ సభ్యత్వ పునరుద్ధరణ సంవత్సరం :

ఆమె/అతనితో సంబంధం పెట్టుకోవాలంటే అవసరమైన చిరునామా :

3. (|) కేంద్ర కంట్రోల్‌ కమిషన్‌ వద్దకు నేరుగా వచ్చిన కేసుల గురించి పొలిట్ బ్యూరోకు తెలియజేసిన తరువాత పరిశీలన మొదలవుతుంది.

(||) పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీల  దృష్టికి వచ్చిన లేదా అప్పీలు చేసుకున్న ఏ కేసునైనా వారు అవసరము, అర్హమైనదని భావిస్తే, కేంద్ర కంట్రోల్‌ కమిషన్‌ పరిశీలనకు యివ్వవచ్చు. కేంద్ర కంట్రోల్‌ కమిషన్‌ ఆ కేసును తదనుగుణంగా చేపడుతుంది.

(|||) బహిష్కరణ కన్న తక్కువ స్థాయి క్రమశిక్షణా చర్యలపై వచ్చిన విజ్ఞప్తులను, రాష్ట్ర కమిటీస్థాయికి దిగువనున్న కమిటీలు తీసుకున్న క్రమశిక్షణ చర్యలను సంబంధిత రాష్ట్ర కంట్రోల్‌ కమిషన్‌ వుంటే దాని పరిశీలనకు పంపవచ్చు. కేంద్ర కమిటీనుద్దేశించి విజ్ఞప్తి చేసుకుంటే అప్పుడు కూడా పొలిట్ బ్యూరో వాిని రాష్ట్ర స్థాయిలోని కంట్రోల్‌ కమిషన్‌కు పంపే నిర్ణయం వస్తుంది.

(|ఙ) వాస్తవాలను నిర్థారించుకొని, నిర్ణయాలు తీసుకునేందుకై సంబంధిత యూనిట్ యూనిట్ తో, వ్యక్తులతో నేరుగా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేందుకు, పరిశీలించేందుకు కేంద్ర కంట్రోల్  కమిషన్‌కు అధికారం ఉంటుంది.

(ఙ) కేంద్రకంట్రోల్‌ కమిషన్‌ సాధారణంగా కేంద్రకమిటీసమావేశాలు జరుపుతున్నప్పుడు సమావేశమవుతుంది. కేసులను త్వరగా పరిష్కరించేందుకు అవసరమయితే కేంద్రకమిటీసమావేశాల మధ్యలో కూడా కంట్రోల్  కమిషన్‌ సమావేశం కావచ్చు. 14రోజులు ముందుగా నోటీసు ఇచ్చి కన్వీనర్‌ కేంద్ర కంట్రోల్  కమిషన్‌ సమావేశాన్ని ఏర్పాటుచేయాలి.

(ఙ|) ఈవిధంగా ఏర్పాటైన సమావేశానికి ముగ్గురు సభ్యులలో ఒకరు హాజరు కాకపోయినట్లయితే నిర్ణయము తీసుకునే అధికారం మిగిలిన ఇద్దరు సభ్యులకు వుంటుంది. ఈ నిర్ణయాన్ని మూడవ సభ్యునికి తెలియజేయాలి.

(ఙ||) కేసు క్లిష్టమైనది కానట్లయితే ఒక మేరకు తేలికయినదైతే కేంద్రకంట్రోల్  కమిషన్‌ సభ్యులు ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా అభిప్రాయాలను తెలియజేసుకొని ఒక నిర్ణయానికి రావచ్చు.

(ఙ|||) ఒక అప్పీలుపై నిర్ణయం తీసుకున్న తరువాత కేంద్ర కంట్రోల్ కమిషన్‌ దాని గురించి కేంద్ర కమిటికి నివేదిస్తుంది.

కేంద్ర కంట్రోల్‌ కమిషన్‌ వ్యవహరించవలసిన తీరుపై రూల్స్‌

1. ఏదైనా ఒక అప్పీలు అందిన తరువాత కంట్రోల్‌ కమిషన్‌ కన్వీనర్‌ మిగిలిన సభ్యులకు ఆ వివాదం గురించి తెలియజేయాలి.

2. ఆ ప్రత్యేకమైన వివాదాన్ని పరిశీలించుటకు తక్షణ చర్యలను కన్వీనరే సూచిస్తాడు.

3. దానికి సంబంధించి మిగిలిన కేంద్రకంట్రోల్‌ కమిషన్‌ సభ్యులు కూడా తమ ప్రతిపాదనలు పంపవచ్చు.

4. కేంద్ర కంట్రోల్ కమిషన్‌ ఛార్జి షీటు గురించి సంబంధిత రాష్ట్ర కమిటీకి  ఫిర్యాదుదారులకు తెలియజేస్తుంది. సంబంధిత కమిటీల వద్దనుండి అవసరమైన సమాచారాన్ని కోరే హక్కు కేంద్ర కంట్రోల్‌ కమిషన్‌కు వుంది. ఆ కమిటీలు సమాచారాన్ని రెండు మాసాల లోపుగా పంపించాలి.

 

ఆర్టికల్‌ 19లో క్లాజ్‌ (13) పార్టీ క్రమశిక్షణ

1. ''తీవ్రమైన'' పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే విచారణ లేకుండా బహిష్కరించబడతాడు. సభ్యుడు శత్రువుల ఏజెంటు, గూఢచారి అని కనుగొన్నప్పుడు. సభ్యుని కార్యకలాపాలు పార్టీ ప్రయోజనాలను ఫణంగా పెట్టడంలాంటి  తీవ్రమైన ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే దీనిని వర్తింపజేయాలి.

ఆర్టికల్‌ 19 : ఎన్నికైన సంస్థలో పార్టీ సభ్యుల రూల్స్‌

1. సి.పి.ఎం.కు చెందిన ప్రతి పార్లమెంట్  సభ్యుడు కేంద్రకమిటీ నిర్ణయించినవిధంగా దానికి లెవీ చెల్లించాలి.

2. ఈ లెవీలో పొలిట్ బ్యూరో నిర్ణయించినవిధంగా రాష్ట్ర కమిటీలకు (ఆ సభ్యుడు చెందిన రాష్ట్రానికి) చెందవలసిన లెవీ శాతం మొత్తాన్ని ప్రతి నెలా ఆ రాష్ట్ర కమిటీకి జమచేస్తారు.

వివరణ: ఆర్టికల్‌ 20 సబ్‌ క్లాజు (5) ప్రకారం పార్టీకి చెందిన పార్లమెంటు, శాసనసభ్యుల, స్థానికసంస్థలలోని సభ్యుల వేతనాలు పార్టీ ధనంగానే పరిగణించబడతాయి. ఇంతకుముందు ఎం.పి.లకు ఎం.ఎల్‌.ఎ.లకు పెన్షన్‌లనేవి లేవు. ఇప్పుడు వచ్చినాయి కాబ్టి క్రింది రూలు రూపొందింది.

3. పార్టీకి చెందిన ఎం.పి.ల, ఎం.ఎల్‌.ఎ.ల స్థానికసంస్థల సభ్యుల వేతనాలు, అలవెన్స్‌లలో, పెన్షన్‌లు ఏమైనావుంటే అవి కూడా అందులో భాగమౌతాయి.

 

ఆర్టికల్‌ 22: పార్టీ మహాసభల సన్నాహక చర్చలు

1. గత మహాసభనుండి ప్రస్తుత మహాసభవరకు జరిగిన కార్యకలాపాల నివేదికను చర్చించేందుకు, సమీక్షించేందుకు, గత మహాసభలో రూపొందించిన పార్టీ పంధాను అమలుచేయడానికి సంబంధించిన రాజకీయ, నిర్మాణ సమస్యలను చర్చించేందుకు యీ పార్టీ మహాసభ వేదికను ఉపయోగించుకోవాలి. నిబంధనావళి పేర్కొన్నవిధంగా మహాసభ ముసాయిదా రాజకీయ తీర్మానంపై చర్చ విడిగా జరపాలి.

 

ఆర్టికల్‌ 23: ప్రజాసంఘాల్లో పనిచేస్తున్న పార్టీ సభ్యులు

1. పార్టీ కేంద్ర, రాష్ట్ర జిల్లా కమిటీలు వివిధ ప్రజాసంఘాలకు సబ్‌ కమిటీలను ఏర్పాటు చేసుకోవచ్చు. సబ్‌ కమిటీలలో సంబంధిత కమిటీల సభ్యులను, ప్రజాసంఘాలలో పార్టీ సభ్యులను తగువిధంగా మార్గదర్శకత్వం వహించగలరని భావించిన యితర పార్టీ సభ్యులను చేర్చుకోవచ్చు. ఏ ప్రజాసంఘానికి చెందిన సబ్‌కమిటీ సభ్యులు ఆ ప్రజాసంఘానికి సంబంధించిన సమస్యలపై ప్రత్యేక అధ్యయనం చేస్తారు. పార్టీ నిర్మాణాన్ని తనిఖీ చేస్తారు. వివిధ ప్రజాసంఘాలలో పార్టీ యూనిట్లుగాగాని, ఫ్రాక్షన్‌ కమిటీగాగాని వున్న పార్టీ సభ్యుల కార్యకలాపాలకు సబ్‌ కమిటీ దర్శకత్వం వహించి సమన్వయం చేస్తుంది. పార్టీ విధానాన్ని అనుసరించి అమలుపరచేలా చూస్తుంది.

2. ఒక ప్రజాసంఘంలో పనిచేస్తున్న మొత్తం పార్టీ సభ్యులు లేదా వివిధస్థాయిల్లో ఎన్నికయిన సంస్థల్లోని పార్టీసభ్యులు ఫ్రాక్షన్‌గా వ్యవహరిస్తారు. సంబంధిత పార్టీ కమిటీ మార్గదర్శక నిర్ణయాలకు అనుగుణంగా ఫ్రాక్షన్‌ పనిచేయాలి.

3. ఒక ప్రజాసంఘంలో వివిధస్థాయిల్లో అధికసంఖ్యలో పార్టీ సభ్యులు పనిచేస్తుంటే ఫ్రాక్షన్‌ సభ్యులనుండి ఫ్రాక్షన్‌ కమిటీలను ఏర్పాటుచేయాలి. ఫ్రాక్షన్‌ కమిటీని సంబంధిత పార్టీ కమిీ ఏర్పాటుచేస్తుంది. ఈ కమిటీలలో సంబంధిత పార్టీ కమిటీకి చెందిన సభ్యులతోపాటు తగినంత పరిపూర్ణత, ప్రజా ఉద్యమాల అనుభవం కలిగివున్నారని పార్టీ కమిటీ భావించినవారితో ఫ్రాక్షన్‌ కమిటీ ఏర్పాటు చేయాలి.

4. ఈ విధంగా ఏర్పాటయిన ఫ్రాక్షన్‌ కమిటీ ఆ ప్రజాసంఘం జనరల్‌ కౌన్సిల్‌, కార్యవర్గాలలో సంబంధిత పార్టీ కమిటీ నిర్ణయాలకు అనుగుణంగా పనిచేయాలి. ఆ ప్రజాసంఘంలో అనుసరించాలని పార్టీ కమిటీ నిర్ణయించిన అంశాలను ఫ్రాక్షన్‌ అమలుపరచేందుకై ఫ్రాక్షన్‌ కమిటీ తగు చర్యలు తీసుకోవాలి.

సభ్యుల కనీస విధులు

కేంద్రకమిటీ తక్షణ నిర్మాణ కర్తవ్యాలపై చేసిన తీర్మానం నుండి:

''పార్టీ సభ్యత్వం పునరుద్ధరణ అంటే ఆచరణలో పాటు  రెండు రూపాయలు వసూలు చేయడంగా పరిణమించింది. వాస్తవంగా దాని ఉద్దేశం అదిగాదు. ప్రతి పార్టీ సభ్యుని, కాండిడెట్ సభ్యుని పనిని ఆయా శాఖలు సమీక్ష చేయాలి. పై కమిటీ తనిఖీ చేయాలి. ఆ సమీక్షపై ఆధారపడి, అతని లోపాలను పరిశీలించి, చక్కదిద్ది సభ్యత్వార్హత కలిగివున్నదీ లేనిదీ నిర్ణయించాలి. ఆవిధంగా కార్యకలాపాలను సమీక్షించేటప్పుడు కనీసం దిగువ విధులైనా ఆ సభ్యుడు అమలు జరుపుతున్నాడా లేదా అనీ చిత్తశుద్ధితో అందుకు ప్రయత్నమైనా చేస్తున్నాడా లేదా అని పరిశీలించాలి.

ఆ విధులు: 1) పార్టీ రుసుమూ, లెవీ చెల్లించడం, 2) పార్టీ శాఖ లేక యూనియన్‌ సమావేశాలకు హాజరవడం 3) పార్టీ పత్రికలు, సాహిత్యం చదవడం 4) ఏదో ఒక ప్రజాసంఘంలో పనిచేయడం.''