తమ కార్యర్తలపై దాడులకు పాల్పడ్డ రౌడీలపై కఠిన చర్యలు తీసుకోవాలి:- సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి మధు

తమ కార్యర్తలపై దాడులకు పాల్పడ్డ రౌడీలపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన సుందరయ్యనగర్‌ను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, కార్యవర్గ సభ్యులు కృష్ణయ్య, రమాదేవి సందర్శించారు. మరోవైపు సీపీఎం కార్యకర్తలపై హత్యాయత్నంలో రౌడీషీటర్లు ఉపయోగించిన కత్తి, కారంపొడి ప్యాకెట్లను మున్సిపల్‌ కార్పొరేషన్‌ నిర్మిస్తున్న మరుగుదొడ్లలో వీరు గుర్తించారు. స్థానిక సీఐ రౌడీషీటర్లకు మద్దతు ఇచ్చారు. టిడిపిలోని కొంతమంది బలపర్చడంతో రౌడీ షీటర్లు ఈ చర్యకు పూనుకున్నారు. ప్రభుత్వం, పోలీసులు రౌడీ చర్యలను ప్రోత్సహిస్తున్నారు. రౌడీషీటర్లకు మద్దతు తెలపవద్దు. నేరస్తులను శిక్షిస్తే... ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. ఘటన వెనుకాల సీఐ ప్రాత ఉందని ప్రజలు చెబుతున్నారు. కాలనీలో ఇళ్ల కట్టుకునే వారికి రక్షణ కల్పించాలి...