జులై 30న ఉరిశిక్ష!

వందలాది మందిని పొట్టన పెట్టుకున్న యాకుబ్ మెమెన్(53)కు ఉరిశిక్ష ఖాయమైంది. 1993 ముంబయి బాంబు పేలుళ్ల కేసులో ఉరిశిక్ష పడ్డ మెమెన్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించిన విషయం విదితమే. మెమెన్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కూడా తోసిపుచ్చారు. దీంతో మెమెన్ ఉరిశిక్ష ఖాయమైంది. జులై 30న మెమెన్‌ను ఉరి తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం మెమెన్ నాగపూర్ సెంట్రల్ జైలులో ఉంటున్నారు. ముంబయి బాంబు పేలుళ్ల కేసులో మెమెన్‌కు 2007లో కోర్టు మరణశిక్ష విధించింది. 1993 మార్చి 12న జరిగిన పేలుళ్లలో 250 మందికి పైగా మృతి చెందగా, 750 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో గత 14 సంవత్సరాలుగా జైల్లోనే ఉంటున్నాడు. మెమెన్ ఉరిశిక్షకు సంబంధించి మహారాష్ట్ర సర్కార్ కూడా రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. - See more at: http://www.vaartha.com/node/1968#sthash.f1lsHfn6.dpuf