కోల్‌కతా దుర్ఘటనతో మరింత ఇబ్బంది

కోల్‌కతాలో కుప్పకూలిన వివేకానంద పైవంతెనను నిర్మిస్తున్న ఐవీఆర్‌సీఎల్‌, కొంతకాలంగా అప్పుల భారంతో సతమతం అవుతోంది. హైదరాబాద్‌కు చెందిన ఈ కంపెనీ, దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ప్రాజెక్టులు నిర్వహిస్తోంది.మౌలిక సదుపాయాల రంగంలోని ఇతర సంస్థల మాదిరిగానే ఐవీఆర్‌సీఎల్‌కు కూడా అప్పుల భారం అధికంగా ఉంది. అప్పులకు సంబంధించి వాయిదాలు సక్రమంగా చెల్లించలేని పరిస్థితి ఎదురు కావడంతో, బ్యాంకులు కొంతకాలం క్రితం ఈ కంపెనీని స్వాధీనం చేసుకునే ప్రక్రియ చేపట్టాయి.