
శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో నిర్మించనున్న అణు పార్కుతో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం వాటిల్లనుందని సిపి ఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.నర్సింగరావు తెలి పారు. సైట్ సెలక్షన్ కమిటీ నిర్ణ యం చేయకుండా రైతుల నుంచి భూములు తీసుకునే అది ప్రకారం ప్రభుత్వానికి లేదన్నారు. గుజరాత్‌లోని మితివిర్ధిలో నిర్మించాల్సిన అణుపార్కును కొవ్వాడకు తరలిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం జూన్ నాలుగున ప్రకటించిందని, మోడీ-ఒబామా ఒప్పందం జూన్ ఏడున జరిగిందని, దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందా? లేదా? అనేది చెప్పడం లేదని తెలిపారు. టిడిపి తక్షణమే తన వైఖరిని బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.