కొత్తగా చేరేవారికే IIT ఫీజు పెంపు

ఇప్పటికే ఐఐటీ అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో చదువుతున్న విద్యార్థులకు రుసుముల పెంపు ఉండబోదని మానవ వనరుల అభివృద్ధి శాఖ పేర్కొంది. ఈ మేరకు అన్ని ఐఐటీల సంచాలకులకు లేఖ రాసింది. రుసుముల పెంపుపై ఐఐటీ-ఖరగ్‌పూర్‌ విద్యార్థులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో ఈ విషయాన్ని స్పష్టీకరించింది. ‘‘2016-17 విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు పొందే విద్యార్థులకే సవరించిన రుసుములు వర్తిస్తాయి. ఇప్పుడు చదువుతున్న విద్యార్థులు ప్రస్తుతమున్న రుసుములనే చెల్లించాల్సి ఉంటుంది’’ అని వివరించింది.