
ఢిల్లీ పోలీసులు కేరళ హౌస్‌పై దాడి చేయడం ద్వారా నిబంధనలను అతిక్రమించారని సిపిఐ(ఎం)ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ఇందుకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ అంతర్గత వ్యవహారాల్లో కేంద్రం నేరుగా జోక్యం చేసుకోవడమేనని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి కేంద్రం అనేక నైతిక సూత్రాలను వల్లిస్తుంది కాని అమలు చేయదని విమర్శించారు. ఒక రాష్ట్ర ప్రభుత్వ ఆధ్యర్యంలో నడుస్తున్న అతిథి గృహంలోకి అనుమతి లేకుండా పోలీసులు ప్రవేశించడం, అక్కడి వంటకాలను తనిఖీ చేయడం తీవ్రమైన విషయమని ఆయన చెప్పారు.