సిపిఎం కేంద్ర కార్యాలయంపై ఆర్‌ఎస్‌ఎస్, ఎబివిపి గూండాల దాడిని నిరసిస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తింది. సిపిఎం ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమాల్లో పలుచోట్ల ఇతర వామపక్ష పార్టీల నేతలు కూడా పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ప్రదర్శనలు, రాస్తారోకోలు, సంఘపరివార్ దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాలు పెద్దఎత్తున నిర్వహించారు. కొన్నిచోట నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు.