
ప్రస్తుతం దేశంలో కుల, మతాల జాడ్యం పెచ్చుమీరుతున్న నేపథ్యంలో ప్రజలు కులం కోసం కాకుండా, కూటి కోసం పోరాడాలని ప్రముఖ విప్లవ సినీ గేయ రచయిత వంగపండు ప్రసాద్ పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో తెలుగు భాషోపాధ్యాయ రాష్ట్ర అధ్యక్షుడు పినిపే సత్యనారాయణ రాసిన 'ధిక్కార ఖడ్గం' పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.అంబేద్కర్ మనల్ని కులం కంటే కూటి కోసమే పోరాడాలని చెప్పారన్నారు. డబ్బుకు ప్రాణం లేకపోయినా అన్నింటినీ శాసిస్తుందన్నారు.