కాశ్మీరీ యువతపై వేధింపులు ఆపాలి:తరిగామి

కాశ్మీరీ యువతపై ప్రజా భద్రత చట్టం (పిఎస్‌ఎ) ప్రయోగించి వేధింపులకు గురిచేయడం విరమించాలని సిపిఐ(ఎం) నేత, ఎంఎల్‌ఏ మహ్మద్‌ యూసుఫ్‌ తరిగామి అన్నారు. ఈ నిరంకుశ చట్టంతో యువతను భయాందోళనలకు లోనుచేయవద్దని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. పలు సందర్భాల్లో ఎలాంటి కారణాలు లేకుండానే యువతపై ఈ చట్టం ప్రయోగిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ తీరుతో ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అరెస్టులతో ప్రభుత్వంపై యువతకు విశ్వాసం సన్నగిల్లుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.