
కేరళ రాజకీయాల్లో నిరసన కొత్త పుంతలు తొక్కింది. సర్కారు విధానాలపై CPM సామాన్యులను కదిలించింది. ఈరోజు కేరళలో సీపీఎం పిలుపుతో 25లక్షల మంది రోడ్డెక్కారు. 1110 కిలోమీటర్ల పొడవునా మానవహారం సాగించారు. పార్టీ అఖిల భారత కార్యదర్శి సీతారం ఏచూరి కూడా పాల్గొన్న ఈ కార్యక్రమం ఓ ప్రపంచ రికార్డుగా చెప్పవచ్చు. ప్రజాకంటక కాంగ్రెస్ ప్రభుత్వానికి వెన్నులో వణుకుపుట్టిస్తోంది. నిరసన కార్యక్రమానికే ఇంత పెద్ద స్థాయిలో కదిలిరావడంతో వారిలో కలకలం మొదలయ్యింది. త్వరలో పెనుమార్పులకు సంకేతంగా కనిపిస్తోంది.