
కరవుకు సంబంధించి చేపట్టిన చర్యలపై సుప్రీం కోర్టు గురువారం కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఎన్ని రాష్ట్రాల్లో కరవు నిర్వహణ విభాగాలను ఏర్పాటు చేశారని అడిగింది. జిల్లా స్థాయి విపత్తు నిర్వహణ సంస్థలను ఎందుకు ఏర్పాటు చేయలేదని నిలదీసింది. ఈ వివరాలను తనకు తెలియజేయాలని జస్టిస్ ఎం.బి.లోకుర్, జస్టిస్ ఎన్.వి.రమణలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. కరవు మాన్యువల్, కరవు నిర్వహణ మార్గదర్శకాలపై పూర్తి వివరాలు సమర్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది.