ఎమ్మెల్యేల జీతాల పెంపుకు వ్యతిరేకం

'రాష్ట్రాన్ని విభజించి కట్టుబట్టలతో రోడ్డు మీదకు నెట్టేశారు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగోలేదు. ప్రభుత్వానికి అండగా నిలవండి. జీత భత్యాలు అడగకండ'ి అంటూ హితబోధ చేసే ముఖ్యమంత్రి చంద్రబాబు..ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంచటాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకించింది. పెంచిన జీతాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేసింది. ఒకసారి నిస్వార్థంగా మీకు సేవ చేసుకునే భాగ్యం కలుగజేయండి అంటూ ఎన్నికల ముందు ప్రజలకు దండాలు పెట్టిన ఈ ప్రజా ప్రతినిధులు తీసుకునే డబ్బు ప్రజలదేనని గుర్తు చేశారు. ప్రజలు కట్టే పన్నులు, అదీ పేదల రక్తం పిండి, జనంతో మందు తాగించి, పెట్రోల్‌, డీజిల్‌ల్లో కొట్టేసిన డబ్బేనని తీవ్రంగా విమర్శించారు. తమ తాత ముత్తాతలు సంపాదించిన డబ్బుల్లా ఖర్చు చేసుకుంటున్నారని, వీళ్ల దోపిడిని ప్రజలంతా ఖండించాలని కోరారు