విజయవాడలో పైపుల్‌రోడ్డు ప్రాంతం నుండి సుందరయ్య వరకు వున్న (సుందరయ్య నగర్) కట్ట మీద వున్న పేద ఇళ్లను తొగించడానికి ప్రభుత్వం హడావుడి చేస్తుందని, ఇళ్ళు ఎక్కడిస్తారో? ఎప్పుడిస్తారో? స్పష్టం చేయకుండా తొగించే ప్రయత్నాలు మానుకోవాని బాబూరావు కోరారు. తొలగింపు విషయంలో ప్రజల్లో వున్న అనుమానాను ప్రభుత్వమే నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు మేము అదికారంలోకి వస్తే ఇళ్ళుతొగించమని, పట్టాలు ఇస్తామని చెప్పిన టి.డి.పి అధికారంలోకి రాగానే ఇళ్లను తొగించే ప్రయత్నాలు ముమ్మరం చేయడం దారుణమన్నారు. పైగా 296 జీవో ప్రకారం అక్రమణ స్థలాల్లో వున్న వారికి రిజిస్ట్రేషన్లు చేస్తామని చెప్పి, ఇళ్ళు తొగించే ప్రక్రియ చేపట్టడం పై మండిపడ్డారు. ఇప్పటికే అనేక దఫాుగా అధికాయి వచ్చి మార్కింగ్ చేసి, 15 అడుగులో రోడ్డు విస్తరణకు కావాల్సిన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. మళ్ళీ ఇప్పుడు 90 అడుగు వరకు మార్కింగ్ చేసి ప్రజను భయాందోళలకు గురిచేస్తున్నారన్నారు. 296 జీవో ప్రకారం రిజిస్ట్రేషన్లు చేయాని కోరారు. మార్కింగ్‌లో పోయిన వారికి వెంటనే ఇళ్ళు కేటాయించాలన్నారు.