అమెరికా నగరాల పై వాస్తవాలు మరుగున పరుస్తున్న విశాఖనగర ప్రజాప్రతినిధులు. మౌలికసదుపాయాలు, సేవలు, ప్రైవేటీకరణకు కుట్ర.

అధ్యయనం పేర నగరానికి చెందిన తెలుగుదేశం, బిజెపి ఎంఎల్‌ఏలు  అమెరికా పర్యటన చేసి అక్కడి నగరాల  గురించి ప్రచారం చేస్తున్నారు. విశాఖ నగరాన్ని కూడా శాన్‌ఫ్రాన్సిస్‌కో, న్యూయార్క్‌, వాషింగ్‌టన్‌లగా మారుస్తామని అంటున్నారు. నగరాలు  బాగా అభివృద్ది చెందాయని, అక్కడ రోడ్‌మీద కాగితం కూడ ఉండదని, ప్రతి నీటిబొట్టుకి డబ్బుచెల్లిస్తారని, ట్రాఫిక్‌, పొల్యుషన్  సమస్యలేదని, డ్రైనేజివ్యవస్థ బాగుంటుదని, ప్రతిసేవకు యూజర్‌ చార్జీలు  వసూలు  చేస్తారని తెలియజేస్తున్నారు.
    ఎంఎల్‌ఏల   ప్రకటను చాలా హాస్యాస్పధంగా ఉన్నాయి. వారి చేప్పేవిషయాలు విశాఖనగర ప్రజలకు తెలియనవికావు. ఆనగరాల్లో స్థానిక ప్రభుత్వవలు  ప్రజల  ఎడల  ఎలాంటి బాధ్యతు నిర్వర్తిస్తున్నాయో వాటిని చెప్పకుండా మరుగున పరుస్తున్నారు. పైపైవిషయాలు  చెప్పి విశాఖ మున్సిపల్‌ సేవలన్ని ప్రైవేట్‌పరం చేయాలనే కుట్రచేస్తున్నారు. ఈ చర్యను విశాఖ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నరు .
కొన్ని వివరాలు  :
    అమెరికాలో నగర ప్రజల సేవాలు , మౌలికసదుపాయాల  కల్పన పూర్తిబాధ్యత స్థానిక ప్రభుత్వాలదే. మనరాష్ట్రంలో వలే ప్రైవేట్‌ సంస్థల ప్రమేయం ఉండదు. న్యూయార్క్‌సిటీలో 1865 స్కూల్స్‌ ఉన్నాయి. వీటిల్లో కెజి నుండి 10+2 వరకు విద్య అందిస్తాయి. వీటిలో లో సుమారు 11లక్ష విద్యార్ధు చదువు చున్నారు.ఈ స్కూల్స్‌ పూర్తిగా న్యూయార్క్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌  ఆధీనంలోనే నడుస్తాయి. లక్షా ముప్పైఐదు వేల మంది టీచర్స్‌, సిబ్బంది ఉన్నారు. ప్రైవేట్‌ రంగంలో 5శాతం కూడా స్కూల్స్‌లేవు. పూర్తిగా ఉచితవిద్య, రవాణా సదుపాయం ఉచితం, మధ్యహ్నం భోజనం ఉచితం. ఇదే స్థితి శాన్‌ఫ్రాన్సిస్‌కో, వాషింగ్‌టన్‌లో కూడా ఉంది. అవినీతి తక్కువ.
    విశాఖ నగరంలో 1నుండి 5వ తరగతి వరకు 92 పాఠశాలు,17 హైస్కూల్స్‌ మాత్రమే జివిఎంసి బాధ్యత వహిస్తున్నది. 80శాతం విద్య పూర్తిగా ప్రైవేట్‌ ఆధీనంలో నడుస్తున్నది. ఫీజులు  విచ్చవిడి. జివిఎంసి పాఠశాల లో  మౌలిక సదుపాయాలు  లేక అనాధాశ్రయాలుగా ఉన్నాయి. కనీసం మరుగుదొడ్లు కూడ లేని దుస్థితి. విచ్చలవిడి అవినీతి.
    శ్రాన్‌ఫ్రాన్సిస్‌కో నగరంలో 8.5లక్ష జనాభా ఉంది, ఈ నగరపాలక సంస్థ ఆధీనంలో నడుస్తున్న పాఠశాలలో 9,551 మంది టీచర్స్‌, సిబ్బంది పనిచేస్తున్నారు. మొత్తం 84 వేల మంది విద్యార్ధు ఉన్నారు. తలసరి విద్యార్ధికి ఏడాదికి 6.25 క్షు ఖర్చుచేస్తున్నది. ఏడాదికి విద్యారంగంపై 3364 కోట్లు స్థానిక మున్సిపల్‌ బడ్జెట్‌లో ఖర్చుచేస్తున్నరు.
    జివిఎంసి తనబడ్జెట్‌ లో కేవలం 1శాతం, అంటే 11కోట్లు  మాత్రమే. విద్యారంగంపై ఖర్చు చేస్తున్నది. టీచర్స్‌, సిబ్బంది మొత్తం కేవలం  820 మంది మాత్రమే ఉన్నారు.
వాటర్‌:
    శాన్‌ఫ్రాన్సిస్‌కో నగరానికి రోజుకి మంచినీరు 74 ఎంజిడిలో సరఫరాఅవుతుంది. అక్కడ పేదలకు, సీనియర్‌ సిటిజన్స్‌, వికలాంగులకు ఉచితంగాను, సబ్సిడీ రేట్లకు నీటిని సరఫరాచేస్తారు.
    విశాఖ నగరంలో రోజుకి 56 ఎంజిడిలు  మాత్రమే నీరు సరఫరా అవుతుంది. తీవ్రనీటి కొరత వుంది. ఆపరేషన్‌ అండ్‌ మెయింటినెన్స్‌ ప్రైవేట్‌ పరం చేశారు. విస్కో లో ప్రైవేట్‌ భాగస్వామ్యంపెంచారు. మొత్తం నీటి వ్యవస్థను ప్రైవేటీకరణ చేయాలన్నది వీరి విధానం.
డ్రైనేజీ:
    అమెరికా నగరాల్లో భూగర్భమురుగునీటి వ్యవస్థ ఉంది. విశాఖలో కేవలం  6వార్డుల్లో నే ఉంది. అదీ అస్థవ్యస్ధంగా ఉంది. జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం క్రింద 9 ఏళ్ళ క్రితం ప్రాంభించిన భూగర్భ మురుగునీటి పనులు  నిధుల సమస్యతో అర్ధాంతరంగా ఆగిపోయింది.అదీ నగరంలో కొన్నిప్రాంతాలకే పరిమితంమైయ్యింది. దీనిగురించి మాట్లాడరు. కేంద్ర రాష్ట్రాలునిధులు  ఇవ్వవు.
పార్కులు :
    జివిఎంసి లో 124 పార్కులు న్నాయి, 40వార్డుల్లో పార్కులు  లేవు, ఉన్న పార్కుల్లో 81 పార్కులు  కోలనీలో ఉన్నాయి. ఇవి నిధులేక కునారిల్లు తున్నాయి. 856 జివిఎంసి ఓపెన్‌ స్పేస్‌ ప్రాంతాలో 213 ఆక్రమణకు గురయ్యాయి.
    శాన్‌ప్రాన్సిస్‌కో లో ప్రతి 10వేల  జనాభాకి ఒక కాలనీపార్కు ఉంది.1 నుండి 30 ఎకరాల  విస్తీర్ణంగ కోలనీ పార్కు 166 ఉన్నాయి. ఇవన్ని మున్సిపల్‌ యంత్రాంగమే నిర్వహిస్తుంది.ఇందులో లైబ్రరీలు , జిమ్స్‌, కోర్టు, అధెలెటిక్‌ఫీల్డ్స్‌, స్విమ్మింగ్‌పూల్స్‌ తదితర మొత్తం 12రకాల సౌకర్యాలు  ఉంటాయి. యివి కాక స్టేట్‌,ఫెడరల్‌ గవర్నమెంట్స్‌ ఆధీనంలో జాతీయ, ప్రాంతీయ పార్కు లు కొన్నిఉన్నాయి.
ఉద్యోగులు :
    8లక్ష జనాభా కలిగిన శాన్‌ప్రాన్సిస్‌ నగరంలో సుమారు 48వేల మంది ఉద్యోగులు , కార్మికులు వివిధసేవాలు  అందిస్తున్నారు. వీరంతా శాన్‌ప్రాన్సిస్‌కో మున్సిపల్‌ పరిధిలోను,వాటర్‌బోర్డు అధీనంలో పనిచేస్తున్నారు. వీరంతా పర్మినెంట్‌ ఉద్యోగులు . వీరికి అదనంగా కాంట్రాక్ట్‌ ఉద్యోగులు  కూడా ఉన్నారు.
    జివిఎంసి లో కేవలం 3400 పర్మినెంట్‌ ఉద్యోగులు , కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులు 7500 మంది. మొత్తం కలిపి  10,900మంది ఉన్నారు. నేడు అనేక విభాగాలు  ప్రైవేటీకరణ చేయడంవల్ల  యింకా ఉద్యోగులు  తగ్గిపోతారు.
బడ్జెట్‌ ఆదాయాలు :
     అమెరికాలో మున్సిపల్‌ నగరపాలక సంస్థకు బహుముఖంగా ఆదాయవనరులు న్నాయి. ఆస్థిపన్నేప్రధానవనరు కాదు. ముఖ్యమైనది ఫెడరల్‌, రాష్ట్ర ప్రభుత్వానుండి కనీసం 30శాతం నిధులు  స్థానిక సంస్థల కు వస్తాయి. అంతేకాక మన రాష్ట్రంలో రాష్ట్రపభుత్వఖజానాకు వెళ్ళేకొన్ని పన్నులు కూడా స్ధానికసంస్థకే  అమెరికాలో చెందుతాయి. అలాగే అమెరికా నగరాలల్లో పేదలకు,సీనియర్‌సిటిజన్స్‌కు, వికలాంగులకు ఆస్థిపన్నులో, నీటి ఛార్జీల్లో, ఇతర సేవల్లో రాయితీలు  ఇస్తున్నారు.
    జివిఎంసి కి ప్రధానఆదాయవనరు ఆస్థిపన్ను, నీటిచార్జీలు , టౌన్‌ప్లానింగ్‌ చార్జీలు  ప్రధానమైనవి. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల నుండి బడ్జెట్‌ కి నిధులురావు, చట్టబద్దంగా ఇవ్వాల్సిన కొన్నినిధులు  కూడా ఇవ్వడం లేదు. స్థానికమున్సిపల్‌ అధికారాలు  హరించబడ్డాయి.
    స్మార్ట్‌నగరం  ` సేవలు    ప్రైవేటికరణ
    విశాఖ నగరం స్మార్ట్‌ నగరాల్లో ఒకటిగా ఎంపికయ్యింది రాబోయే 5 ఏళ్ళలో విశాఖ లో ఏంచేయబోతున్నారో జివిఎంసి నివేదిక రూపొందించి కేంద్రానికి పంపింది. దీనిప్రకారం 5 ఏళ్ళ కాలంలో కేవలం 70వేల  జనాభా కలిగిన పెదవాల్తేరు, చినవాల్తేరు, కిర్లంపూడిలేఅవుట్‌, ఈస్ట్‌పాయింట్‌ కోలనీ, దసపల్లాలేఅవుట్‌, పాండురంగపురం, ఆర్‌కే బీచ్‌ ఏరియా ప్రాంతంలో 1,465 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. ఈ ఖర్చంతా నిరర్ధకమైనది. దీనివల్ల  మిగిలిన 20లక్షల  జనభా కలిగిన ప్రాంతానికి నిధులు  ఉండవు, తీవ్రనిర్లక్ష్యానికి గురవుతాయి. రక రకాల  పన్ను భారాలు ప్రజలపై వడ్డిస్తారు. జివిఎంసి అప్పుల  ఊబిలోచిక్కుకుంటుంది. మంచినీరు, పారిశుద్ద్యం, పార్కు, విద్య, ఆరోగ్యం తదితర విభాగాు పూర్తిగా ప్రైవేట్‌ పరమవుతాయి.