అబద్ధాలు ఆపి పనిచేయండి:రాహుల్

దేశంలో నిత్యావసర సరుకుల ధరలు చుక్కలనంటుతున్నా ప్రధాని నరేంద్రమోడీ స్పందిం చడం లేదని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ విరుచుకుపడ్డారు.''కందిపప్పు రొట్టె తినకండి, దేవుడిని ప్రార్థించండి'' అంటూ మోడీ, ఆర్‌ఎస్‌ఎస్‌ అంటారని, కానీ వారు మాత్రం విమానా ల్లో అమెరికా, ఇంగ్లాండ్‌ దేశాలకు వెళ్లి పప్పు తిని వస్తారని రాహుల్‌గాంధీ ఎద్దేవా చేశారు.