2017

మాకినేని బ‌స‌వ‌పున్న‌య్య 103వ జ‌యంతి సంద‌ర్భంగా

భారత కమ్యూనిస్టు ఉద్యమ ప్రముఖుల్లో ఒకరైన కామ్రేడ్‌ మాకినేని బసవపున్నయ్య రేపల్లె మండం తూర్పుపాలెంలోని భూస్వామ్య కుటుంబంలో 1914 డిసెంబరు 14న జన్మించారు. తల్లిదండ్రలు చారుమతి, అప్పయ్య. భార్య జగదాంబ. కొద్దికాం సాంప్రదాయ బద్దమైన విద్యనభ్యసించారు. అనంతరం ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌లో చదివారు. బందరు నోబుల్‌ కళాశాలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేశారు. 1930లో దేశస్వాతంత్య్రం కోసం పోరాటం సాగించిన తరంతో ఆయన కలిసిమెసి పనిచేసి అనుభవాు పంచుకున్నారు.

బిఎస్ ఎన్ ఎల్ ఉద్యోగుల‌కు సిపిఎం రాష్ర్ట కార్య‌ద‌ర్శి పి. మ‌ధుగారు మ‌ద్ద‌తు

  తిరుప‌తిలో బిఎస్ ఎన్ ఎల్ పెండింగ్‌లో ఉన్న 2పిఆర్‌సిని విడుద‌ల చేయాల‌ని బిఎస్ ఎన్ఎల్  ఉద్యోగులు చేస్తున్న నిర‌స‌న‌కు మ‌ద్ద‌తు తెలియ‌జేశారు. 2000 సంవత్స‌రం నుంచి బిఎస్ఎన్ఎల్ షేర్్స‌    అమ్మ‌డాన్ని వ్య‌తిరేకించాము. నాడు యుపిఎ వెన‌క్కిత‌గ్గింది. కానీ నేడు దేశ భ‌క్తుల‌మ‌ని చెప్పుకుంటూ  ప్ర‌భుత్వ రంగాల‌న్నీ కూడా పూర్తిగా నిర్వీర్యంచేస్తున్న‌ది. ఒక‌ప్పుడు టెలికాం, రైల్వే, విద్యుత్‌, ఆర్‌టిసి ప్ర‌భుత్వ ఆధీనంలో ఉండేవి కానీ  బిజెపి, టిడిపి కుట్ర‌ప‌న్ని మ‌రీ ఇలాంటి చ‌ర్య‌ల‌కు పూనుకుంది. గ్లోబ‌లైజేష‌న్ ప‌ర్య‌వ‌సానం నేడు ప్ర‌యివేటీక‌ర‌ణ విజృంభించి. ప్ర‌జ‌ల‌ను దోచుకుంటున్న‌ది. 

ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ ఛలోఅసెంబ్లీ

రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, నిధులు విడుదల చేయాలని, ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వామపక్షపార్టీలు, ప్రజా సంఘాల నాయకులు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని తలపెట్టాయి.  విజయవాడలోని ధర్నా చౌక్‌ వద్ద నిరసన తెలుపుతున్న వామపక్ష, ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు వందలాది మందిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి చుట్టుపక్కల పోలీస్‌స్టేషన్లలో నిర్బంధించారు.ఈసందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ  రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని మాట్లాడిన బిజెపి, టిడిపి నాయకులు అధికారంలోకి రావడంతోనే ఆ ఊసే ఎత్తకుండా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.

Pages

Subscribe to RSS - 2017