District News

 'గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ బిల్లు తో ప్రజలపై పెనుభారం పడుతుంది'. పన్నుల విధానంలో పెనుమార్పులు తీసుకువచ్చే జిఎస్‌టి బిల్లు ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున కసరత్తు చేస్తోంది.కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించినప్పటికీ స్థూలంగా అంగీకరించారంటూ ముందడుగు వేయడానికి కేంద్రం సిద్దమైందని అన్నారు..

విజయవాడ లో సమస్యల పరిష్కారానికి మున్సిపల్‌ కార్మికులు తమ సమ్మెను మరింత ఉధృతం చేశారు. 13 జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన కార్మికులు బందర్‌రోడ్డులోని సీఎం ఆఫీసు ముట్టడికి యత్నించారు. దీంతో వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. పలువురు మున్సిపల్‌ కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ కార్మికులు మాట్లాడుతూ ఈనెల 20 నుంచి సీఎం, మంత్రుల ఆఫీసు ఎదుట ధర్నాలు చేస్తామని, మంత్రులను జిల్లాల్లో తిరగనివ్వమని హెచ్చరించారు. డిమాండ్లు తీర్చేవరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఏపీ మున్సిపల్‌ కార్మిక జేఏసీ స్పష్టం చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో మున్సిపల్ కార్మికుల ఆందోళనలతో అట్టుకుడుతోంది. ఏపీలో తమ సమస్యల పరిష్కారం కోరుతూ విజయవాడలో ఉన్న ఏపీ సీఎంక్యాంప్ ఆఫీసు ముట్టడికి బయలు దేరిన మున్సిపల్ కార్మికులను, కార్మిక నేతలను బందర్ రోడ్డులో పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఆ ప్రాంతం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కార్మికుల సమ్మెకు మద్ధతుగా సీఐటీయూ, సీపీఎం చేపట్టిన సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి సీఎం క్యాంపు ఆఫీసు ముట్టడికి పెద్ద ఎత్తున కార్మికులు బయలుదేరారు. అయితే రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్న సీఐటీయూ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. పోలీసులకు, లెఫ్ట్‌ కార్యకర్తలకు జరిగిన తోపులాటలో పలువురికి...

తెలుగు రాష్ట్రాల్లో మున్సిపల్ కార్మికుల ఆందోళనలతో అట్టుకుడుతోంది. ఏపీలో తమ సమస్యల పరిష్కారం కోరుతూ విజయవాడలో ఉన్న ఏపీ సీఎంక్యాంప్ ఆఫీసు ముట్టడికి బయలు దేరిన మున్సిపల్ కార్మికులను, కార్మిక నేతలను బందర్ రోడ్డులో పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఆ ప్రాంతం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

బేగంపేట ఎయిర్ పోర్టును ఆర్మీకి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ విషయంలో విమానయాన శాఖ మంత్రిగా ఉన్న అశోక గజపతిరాజు పావులు కదుపుతున్నారని టీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. బేగంపేట ఎయిర్‌ పోర్టు ప్రాంతంలో.. తెలంగాణ ప్రభుత్వం ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు చేపడుతుంటే.. ఏపీ ప్రభుత్వం దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎయిర్ పోర్టును ఆర్మీకి అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.

వారం రోజులుగా సమ్మె చేస్తున్నాప్రభుత్వం పట్టించుకోకపోవడం పై మున్సిపల్ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలో భాగంగా ఇవాళ చలో విజయవాడకు పిలుపునిచ్చారు.

మున్సిపల్‌ కార్మికుల విషయంలో ప్రభుత్వ మొండివైఖరికి నిరసనగా నేడు విజయవాడలో సిఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తున్నట్లు మున్సిపల్‌ ఉద్యోగులు, కార్మికుల జెఎసి ప్రకటించింది. రాష్ట్రంలో ఏడురోజులుగా సమ్మె కొనసాగుతున్నా పర్మినెంటు ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల మధ్య చీలికతెచ్చి సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జెఎసి నాయకులు ఉమామహేశ్వరరావు, రంగనాయకులు, దశరధరామరాజు, వెంకటరత్ననాయుడు, వై.వి.రమణ, వి.రవికుమార్‌, ఎస్‌.శంకరరావు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంఎల్‌సిలు ఇతర ప్రజాప్రతినిధులు వీధిరౌడీల్లా వ్యవహరిస్తూ కార్మికులను భయభ్రాంతులకు...

రాష్ట్ర ప్రభుత్వ తరుపున ఈనెల 17న విజయవాడలో ఏర్పాటు చేయనున్న ఇఫ్తార్‌ విందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు. అదేరోజు జరిగే 66వ వనమహోత్సవంలోనూ పాల్గొననున్నారు. బృందావన్‌కాలనీలోని ఎకన్వెన్షన్‌ హాల్లో సాయంత్రం ఐదుగంటల తరువాత ఇఫ్తార్‌ విందు ప్రభుత్వం తరుపున ఇవ్వనున్నారు. సుమారు మూడువేలమంది మంది హాజరవనున్నారు. అలాగే కొత్తూరు తాడేపల్లి అటవీ ప్రాంతంలోని జక్కంపూడి గ్రామ పరిధిలో వనమహోత్సవం జరగనుంది. దీనికి సంబంధించి ఫైలాన్‌ ఆవిష్కరించ డంతోపాటు, ఫొటో ఎగ్జిబిషన్‌ను నిర్వహించనున్నారు. ముఖ్య మంత్రితోపాటు సుమారు 1000 మంది విద్యార్థులు మొక్కలు నాటే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతోపాటు కృష్ణాజిల్లాలో క్రిడా పరిధిలో ఉన్న 29 మండలాల్లో...

పట్టణ సమస్యలపై రాష్ట్రంలోని మున్సిపల్‌ పట్టణాల్లో ఆందోళనలు నిర్వహిం చాలని సిపిఎం రాష్ట్రకమిటీ నిర్ణయించింది. సిపిఎం పట్టణ బాధ్యుల రాష్ట్రస్థాయి సమావేశం బుధవారం విజయవాడలో జరిగింది. ఆగస్టు 1 నుంచి 14 వరకు పట్ట ణ సమస్యలపై క్యాంపెయిన్‌లు, ఆందోళనలు నిర్వహించాలని ఈ సమావేశం నిర్ణ యించింది. ఈ సమావేశానికి ఆ పార్టీ రాష్ట్రకార్యదర్శి పి మధు హాజరయ్యారు. పట్టణ సమస్యలపై పోరాడాల్సిన అవశ్యకతను ఆయన వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్న మెగాసిటీలు, స్మార్ట్‌సిటీలు, అమృత్‌ పట్టణాలు అన్నీ కూడా పట్టణాల్లో మౌలిక సదుపాయాలను ప్రైవేటీకరింటి వ్యాపారమయం చేయ డం కోసం ఉద్దేశించినవేనని చెప్పారు. మౌలిక సదుపాయాల ప్రైవేటీకరణ వల్ల పట్టణ ప్రజలు, తీవ్ర...

Pages