District News

 మద్యం దుకాణాలకు వేలం పాడిన వారంతా ఇప్పుడు తలలు పట్టుకురటున్నారు. లాభాలు బాగా ఉరటాయని ఈ వ్యాపారంలోకి వచ్చిన వారు తమ ఆదాయంలో సగ భాగాన్ని అప్పనంగా పరులకు ఇవ్వాల్సి రావడంపై వారంతా ఆరదోళన వ్యక్తం చేస్తున్నారు. మద్యం వ్యాపారుల నురచి భారీగా వసూళ్లు చేసే నేతల సంఖ్య పెరిగిపోతోరదట. పది నురచి గరిష్టంగా 50 శాతం వరకు వారికి చెల్లిరచుకోవాల్సి వస్తోరదని వ్యాపారులు అరటున్నారు. మద్యం దుకాణాలపై వేలం ముగిసిన వెరటనే అనేక మంది సీనియర్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగి వ్యాపారులతో సమావేశాలు నిర్వహిరచారు. ఆ ప్రారతంలో దుకాణాలకు వచ్చే ఆదాయాన్ని బట్టి తమకూ వాటా కావాలంటూ హుకుం జారీ చేసినట్లు తెలుస్తోరది. అవసరమైతే వాస్తవ విలువపై 15 రూపాయలు అధికంగా వసూలు...

గుంటూరు జిల్లా‌లోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో బీఆర్కే(బ్యాచ్‌లర్ ఆఫ్ ఆర్కిటెక్చర్) ఫస్టియర్ చదువుతున్న రుషితేశ్విని అనే విద్యార్థిని ఉరేసుకుంది. మృతురాలిది వరంగల్ జిల్లా అని తెలుస్తోంది. ఆత్మహత్యకు ర్యాగింగే కారణమని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి

రాజధాని గ్రామాల్లో కౌలు రైతుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. 29 గ్రామాల పరిధిలో 33 వేల ఎకరాల్లో వ్యవసాయం ఉపసంహరణతో కౌలు రైతుల జీవనం అగమ్యగోచరంగా మారింది. రాజధాని ప్రాంతంలో మొత్తం 22 వేల మంది భూమి ఉన్న రైతులు ఉండగా వీరిలో 40 శాతం మంది రైతులు నేరుగా వ్యవసాయం చేయరు. వీరు ఎక్కువగా భూములను కౌలుకు ఇస్తారు. కొందరికి ఈ గ్రామాల్లో భూములు ఉన్నా ఇతర రాష్ట్రాలు, దేశాల్లో నివశిస్తూ ఏడాదికి ఒకటి రెండు సార్లు ఈ ప్రాంతానికి వచ్చి వెళ్తుంటారు. అలాగే మరికొందరు రైతులు గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌లో స్థిరపడి వారి భూములను కౌలుకు ఇస్తుంటారు. మొత్తం మీద 29 గ్రామాల పరిధిలో 4,230 మంది కౌలు రైతులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరు గత కొన్నేళ్లుగా...

గుంటూరు జిల్లా అమృతలూరు మండలం కోడితాడిపర్రులో దశాబ్దాల తరబడి సాగుచేసుకుంటున్న తమ భూములను బలవంతంగా వేలం వేయాలని దేవాదాయశాఖ అధికారులు తీసుకున్న నిర్ణయానికి నిరసనగా ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఆరుగురు రైతుల్లో మరొకరు బుధవారం ఉదయం మృతి చెందారు.. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొందుతున్న వీర్లపాటి చెత్తయ్య(70) బుధవారం ఉదయం మృతిచెందాడు. దీంతో బాధితులు మరింత ఆగ్రహంతో ప్రభుత్వాస్పత్రి వద్ద పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరికి మద్దతుగా వామపక్షాల ఆధ్వర్యంలో గుంటూరు-అమరావతి రోడ్డులో ప్రభుత్వాస్పత్రి మార్చురి వద్ద రెండు గంటల పాటు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ,...

             రాజధాని ప్రాంతంలో రైతులను తప్ప పేదలను, దళితులను, వ్యవసాయ కార్మికులను, మైనార్టీలను, మహిళలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఇకనైనా తీరుమార్చుకోకపోతే రానున్న రోజుల్లో రాజధానిలోనే ప్రజలు ప్రభుత్వాన్ని పాతిపెడతారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు హెచ్చరించారు. రాజధానిలో పేదల సమస్యలు పరిష్కరించాలని, ఉపాధి కోల్పోయిన ప్రతి కుటుంబానికీ రూ. 9 వేలు పరిహారమివ్వాలని, అసైన్డ్‌, సీలింగ్‌, చెరువుపోరంబోకు భూముల లబ్ధిదారులకు పరిహారం వెంటనే చెల్లించాలని కోరుతూ వ్యవసాయ కార్మికసంఘం, డ్వాక్రా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో గురువారం తుళ్లూరులో క్రిడా కార్యాలయం ముందు బైఠాయించారు. ఆందోళనకు సిపిఎం మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ, రాజధానిలో...

రాజధాని నిర్మాణం కారణంగా  ఉపాధి కోల్పోయిన వ్యవసాయ కూలీలకు రోజుకు 300చోప్పున నెలకు 9వేల రూపాయలు ఇవ్వాలని, అవి కుడా ఏప్రిల్ నెల నుండి లెక్కకట్టి ఇవ్వాలని, రైతులకు ఏవిధంగా అయితే రాజధాని ప్రాంతంలో సంపూర్ణ రూణమాఫీ చేశారో అదే విధంగా డ్వాక్ర మహిళలకు కూడా సంపూర్ణ రుణమాఫీ చేయాలని సిఆర్ డిఎ కార్యలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో రాజధాని ప్రాంతా గ్రామాల ప్రజలు ధర్న కార్యక్రమం నిర్వహించారు..ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు, కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు తదితరులు పాల్గొన్నారు .

 

Pages