District News

కౌలు చెక్కులివ్వాలని డిమాండ్‌ చేస్తూ అసైన్డ్‌, సీలింగ్‌ భూముల రైతులు తుళ్ళూరు క్రిడా కార్యాలయాన్ని ముట్టడించారు. లైబ్రరీ సెంటర్‌ నుండి ర్యాలీ నిర్వహించి క్రిడా కార్యాలయం ఎదుట గంటకు పైగా బైఠాయించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, పేద వ్యవసాయ కూలీలకు రూ. 2,500 పింఛన్‌, అసైన్డ్‌, సీలింగ్‌ భూముల రైతులకు కౌలు చెక్కులివ్వడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. క్రిడా ప్రాంత సిపిఎం కన్వీనర్‌ సిహెచ్‌.బాబురావు, సిపిఎం డివిజన్‌ కమిటీ కార్యదర్శి ఎం.రవి, నాయకులు జొన్నకూటి వీర్లంకయ్య, నవీన్‌ప్రకాష్‌ ఆందోళనకు మద్దతు తెలిపారు. ఆందోళనకు అధికారులు స్పందించకపోవడంతో రైతులు కార్యాలయంలోకి వెళ్ళేందుకు ప్రయత్నించారు. దీంతో ఎస్‌ఐ...

గతంలో పట్టాలిచ్చిన అటవీ భూములను చంద్రబాబు తిరిగి లాక్కోవాలని చూస్తున్నారని,మా ప్రాణాలు పోయినా సరే అడ్డుకొని తీరుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు హెచ్చరించారు.

విదేశీ పెట్టుబడిదారులతో దేశం అధోగతిపడుతోందని, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కి సింగపూర్‌, జపాన్‌ల వంటి వలస పాలన అవసరం లేదని ధ్వజమెత్తారు. సొంత వనరులపై ఆధారపడి ప్రభుత్వాలు పాలన సాగించాలని ఆయన సూచించారు. డ్వాక్రా మహిళల రుణమాఫీ˜ీ, మద్య నియంత్రణ అంశాలపై శుక్రవారం ఇక్కడ మహిళా సంఘాల రాష్ట్ర సదస్సులో ఆయన ప్రసంగించారు.. ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు వి. జయలక్ష్మి అధ్యక్షత వహించారు. సదస్సులో మధు మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు ప్రకటించినట్లుగా మహిళలకు సంపూర్ణ రుణమాఫీ న్యాయ సమ్మతమేనన్నారు. మహిళల ఉద్దరణ కోసమే పొదుపు సంఘాలు ఏర్పాటు చేశారనే సంగతి పాలకులు మరచిపోకూడదని హితవు పలికారు. మహిళలపై...

రాజధాని నిర్మాణ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గ్యాంబ్లింగ్‌ గేమ్‌ను తలపిస్తోంది. ప్రక్రియ మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకూ ఇద్దరు కీలక అధికారులను మార్చేసింది. ఒకరికి రాజధాని ఎంఓయుపై అవగాహన ఉంటే, మరొకరికి ఇప్పటి వరకూ జరిగిన ప్రక్రియపై అవగాహనుంది. వీరిలో ఒకరు దొండపాటి సాంబశివరావు కాగా, మరొకరు ఆర్మానే గిరిధర్‌. రాజధానిపై జరిగిన ఒప్పందాలు, జరుగుతున్న తీరుపై వీరికి పూర్తి అవగాహన ఉంది. వీరిద్దరినీ తొలగించడం ద్వారా రాజధాని నిర్మాణ ప్రక్రియపై ముఖ్య మంత్రికి, క్రిడా కమిషనర్‌కు తప్ప మరెవరికీ పూర్తిస్థాయి అవగాహన లేని పరిస్థితి ఏర్ప డింది.

అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషికేశ్వరి మృతిపై బాలసుబ్రహ్మణ్యం కమిటీ బుధవారం ఉదయం విచారణ ప్రారంభించింది. నెల్లూరు విక్రమసింహ వర్సిటీ వైస్ ఛాన్సలర్ వీరయ్య, వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రొఫెసర్ బాలకృష్ణమనాయుడు, పద్మావతి వర్సిటీ రిజిస్ట్రార్ విజయలక్ష్మి ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. 

రాజధాని ప్రాంతంలో డ్వాక్రా మహిళలకు ఏకకాలంలో రూ. లక్ష రుణ మాఫీ చేయకపోతే గ్రామాల్లో ఉన్న క్రిడా కార్యాలయాలన్నింటినీ దిగ్బంధిస్తామని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి హెచ్చరించారు. రూ. లక్ష రుణమాఫీ తక్షణం అమలు చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా తుళ్లూరులోని క్రిడా కార్యాలయం ఎదుట మంగళవారం డ్వాక్రా మహిళలు నిర్వహించిన ధర్నాలో ఆమె మాట్లాడారు. డ్వాక్రా మహిళలను మభ్యపెట్టి ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు, ఇప్పుడు వాయిదాల పద్ధతిలో రుణమాఫీ చేస్తామనడం సరికాదన్నారు. వచ్చే ఎన్నికల్లో మహిళలు తమ తడాఖా చూపిస్తారని హెచ్చరించారు. ఏడాదిన్నరగా రుణ బకాయిలు కట్టని మహిళలు ప్రస్తుతం చేసేందుకు పనుల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో...

ఉమ్మడి రాజధానిలో కాకుండా నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం నుంచే పాలన సాగించే ప్రక్రియలో వేగం పెంచేందుకు ఏపీ సర్కార్‌ ప్రణాళికలు రచిస్తోంది. రాజధాని ప్రాంతం నుంచి పాలన సాగించేదిశగా ఏపీ సర్కార్‌ అడుగులు వేస్తోంది. పలు శాఖల కార్యాల‌యాల త‌ర‌లింపున‌కు కసరత్తు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే వారానికి 3 రోజులు రాజ‌ధాని నుంచి పాలిస్తున్న సీఎం పూర్తిస్థాయిలో అక్కడి నుంచే కార్యకలాపాలు కొనసాగించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేయ‌డానికి అనువైన ప్రైవేట్ భవనాలను ప‌రిశీలించేందుకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే విజయవాడలో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకున్న బాబు.. ఇరిగేషన్‌కు సంబంధించిన 9 కార్యాలయాల‌ను తరలించటానికి చర్యలు...

రాష్ట్రంలోని మూడు విశ్వవిద్యాలయాల్లో ప్రభుత్వం జపాన్‌ భాషను ప్రవేశపెట్టింది. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర, గుంటూరులోని ఆచార్య నాగార్జున, విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయాలను దీనికోసం ఎంపిక చేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే జపాన్‌ భాషపై విద్యార్థులకు బోధనా తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సుమితా దావ్రా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జపాన్‌ భాషపై బోధనా తరగతులను చేపట్టడానికి ఈ మూడు విశ్వవిద్యాలయాలకు అనుమతులను మంజూరు చేశారు. జపాన్‌ పెట్టుబడులపై రాష్ట్ర ప్రభుత్వం ఆశలు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏడాదిలో రెండుసార్లు ఆ దేశంలో పర్యటించారు. జపాన్‌కు చెందిన పలు...

అసలే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ రాష్ట్రంలో నూతన మద్యం విధానం అమలైతే మరింత కష్టకాలం తప్పదు. తెలంగాణలో మందుబాబులకు తక్కువ ధరకే మద్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు అక్కడి సర్కార్‌ కసరత్తు మొదలుపెట్టింది. ఈ విధానం అమల్లోకి వచ్చి.. సారా ప్యాకెట్ల(సాచెట్లు) తరహాలో చీప్‌లిక్కర్‌ మద్యం దుకాణాల్లోకి ప్రవేశిస్తే.. ఏపీ ఆదాయానికి భారీగా గండిపడే అవకాశాలున్నాయని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ ఆందోళన చెందుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న ఏపీకి చెందిన ప్రధానమైన ఐదు జిల్లాల్లో తెలంగాణ చీప్‌లిక్కర్‌ ఏరులై పారనుంది. రాయలసీమలోని కర్నూలు, కోస్తాలోని గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలు తెలంగాణకు సరిహద్దు...

రాష్ట్ర ప్రభుత్వం 43 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ ప్రకటించిందని ఉద్యోగులు సందడి చేసుకుంటుంటే... ఆ చెల్లింపుల మాటున ట్రెజరీ ఉద్యోగులు పెద్ద ఎత్తున దోపిడీకి తెరతీశారు. ప్రతి ఉద్యోగి నుంచీ అధికారికంగా రూ. 500 మామూళ్లు వసూ లు చేస్తున్నారు. ‘ప్రభుత్వం పదో పీఆర్‌సీలో 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చినప్పుడు ఉద్యోగుల బేసిక్‌ రెట్టింపు అవుతుంది. అటువంటప్పుడు మాకు రూ.500 ఇవ్వడం పెద్ద లెక్క కాదు’ అని ట్రెజరీ ఉద్యోగులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఇది కొత్త కాదని, ప్రతి కొత్త పీఆర్‌సీకి ఈ తరహా ప్రత్యేక బాదుడు మామూలేనని ఉద్యోగులు వాపోతున్నారు. ఏ శాఖ ఉన్నతాధికారి తమ శాఖ పరిధిలోని ఉద్యోగులకు కొత్త పీఆర్‌సీ ప్రకారం వేతనాన్ని సవరించి పే ఫిక్సేషన్‌ బిల్లులను...

Pages