District News

చిత్తూరు జిల్లాలో దళితులు తీవ్రమైన వివక్ష ఎదుర్కొంటున్నారు. వివక్ష రూపుమాపేందుకు అధికారయంత్రాంగం చొరవతీసుకోవాలి. లేకుంటే పోరాటం తప్పదని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు హెచ్చరించారు. తనకు కులంపైన నమ్మకం లేదని సిఎం చెబుతున్నారు...మరి సొంత జిల్లాలో కుల వివక్షపై మీ స్పందన ఏమిటని ప్రశ్నస్తున్నాను. కుల వివక్ష ముఖ్యమంత్రికే సిగ్గుచేటు. టిటిడికి ఒకరినయినా ఈవోగా నియమించారా. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే టిటిడి ఈవో గా దళితులను నియమించసలి. గతంలో దళితగోవిందం పూజలుచేసిన శ్రీవారి విగ్రహాలను గోదాముల్లో పడేశారు. ఇది వివక్ష కాదా. కబ్జా అయిన దళితుల భూములను తిరిగి వారికి అప్పగించాలి. దళితులను ఆలయాల్లోకి అనుమతించకుంటే మేమే ఉత్సవాలు నిర్వహించి...

తిరుపతిలో  స్మార్ట్ సిటీ పేరుతో పారిశుద్ధ్య కార్మికుల కాలనీ తొలగింపునకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అశోక్ నగర్ 'స్కావింజర్స్ కాలనీ' లో  స్మార్ట్ సిటీ పేరుతో 250 ఇళ్ళు తొలగించి అపార్ట్ మెంట్ కట్టాలని ప్రయత్నిస్తుండడంతో కాలనీ వాసులు ప్రతిఘటించారు. సిపియం కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి. కృష్ణయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు కందారపు మురళి తదితరులు కాలనీ వాసులను కలసి వారికి అండగా పోరాడుతామని హామీ ఇచ్చారు 

రాయలసీమ కరువు నివారణచర్యలు తీసుకోవాలని కోరుతూ వామపక్షాల ఆద్వర్యంలో కడపలో శాంతియుతంగా బంద్ నిర్వహిస్తున్న సిపిఎం, సిపిఐ కార్యకర్తలను పోలీసులు అరెస్టులు చేశారు.రాయలసీమలో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నా ప్రభుత్వంలో చలనం లేదని , బంద్‌ నిర్వహిస్తామనగానే జూన్‌ రెండు నుంచి ఇన్‌పుట్‌ సబ్సిడీ పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారని సిపిఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి మ‌ధు అన్నారు. హామీల అమ‌లు మాటల‌లో కాకుండా చేతల్లో చూపించేందుకు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం పై ఒత్తిడి పెంచాల్సిన అవసరముందని, కరువు సహాయక చర్యలు తక్షణం చేపట్టాలని , అదే విధంగా ఈ ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీనివ్వాలని మ‌ధు డిమాండ్ చేశారు.

పెద్ద నోట్ల రద్దు చేసి ప్రజలను ఎనలేని ఇబ్బందుల్లోకి నెట్టిన ప్రధాని మోడీ నియంతృత్వ ధోరణిని నిరసిస్తూ చేపట్టిన హర్తాళ్‌ రాష్ట్రంలో విజయవంతమైంది..హర్తాళ్‌కు వివిధ వర్గాల ప్రజల నుంచి స్వచ్ఛంద మద్దతు లభించింది. ప్రభుత్వం ఒత్తిడి పెంచినప్పటికీ విద్యా, వ్యాపార సంస్థల ప్రతినిధులు స్వచ్ఛందంగా సహకరించారు. పోలీసులు నిరసన ప్రదర్శనలకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. అయినప్పటికీ ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలను మూసివేశారు. వాణిజ్య, విద్యాసంస్థలూ మూతపడ్డాయి. 

బాబొస్తే జాబొస్తుందంటూ కల్లబొల్లిమాటలు చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అడ్డం తిరిగారు.. బాబుకేమో వాస్తవంగా జాబొచ్చింది.. ఇక్కడ ఎంఎల్‌ఏగా ఓడిపోయిన ముద్దుకృష్ణమనాయుడుకీ ఎంఎల్‌సిగా చోటు దక్కింది.. జాబ్‌ ఇస్తారని నమ్మి ఓటేసిన జనానికేమో కష్టాలొచ్చాయి' అంటూ వామపక్ష నాయకులు ఉద్ఘాటించారు. రాయలసీమ బస్సు యాత్రకు మూడో రోజు చిత్తూరు జిల్లాలో అడుగడుగునా ఆదరణ లభించింది. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కందారపు మురళి మాట్లాడుతూ ఈ ప్రాంతానికి గాలేరు-నగరి వస్తే తప్ప ఇక్కడ ప్రజల మనుగడ సాధ్యం కాదన్నారు. కండలేరు తాగునీటి పథకాన్ని కిరణ్‌కుమార్‌రెడ్డి తీసుకొస్తే జిల్లావాసిగా ఉండి చంద్రబాబు రద్దు చేయడం ఈ ప్రాంతం పట్ల ఎంత వివక్ష చూపిస్తున్నారో అర్ధమవుతుందన్నారు...

రాయలసీమ ప్రాజెక్టుల గురించి స్పష్టంగా చెప్పకపోవడాన్ని వామపక్షాల నేతలు తీవ్రంగా తప్పుపట్టారు.మదనపల్లి బస్టాండులో ఏర్పాటు చేసిన సభలో సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు వి.కృష్ణయ్య మాట్లాడుతూ.. వచ్చే నాలుగేళ్లలో ప్రాధాన్యతా ప్రాజెక్టుల పూర్తికి రూ.20 వేల కోట్ల వరకూ ఖర్చువుతుందని ముఖ్యమంత్రి శనివారం మీడియా సమావేశంలో వెల్లడించారని, అయితే గాలేరు నగరి, హంద్రీ నీవా ప్రాజెక్టులకు వచ్చే బడ్జెట్‌లో ఎంత కేటాయిస్తారో స్పష్టం చేయలేదని విమర్శించారు. ప్రాజెక్టుల మొదటి దశ, రెండో దశ పనులను ఆగస్టు నాటికి పూర్తి చేస్తామంటూ డొంక తిరుగుడుగా చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.అభివృద్ధి ముసుగులో ముఖ్యమంత్రి.. అమరావతి అభివృద్ధిని మాత్రమే కాంక్షిస్తూ, వెనుకబడిన...

సీమ ప్రజల తరపున కేంద్రానికి తమ వాణి వినిపించేందుకు సిపిఐతో కలిసి సిపిఎం బస్సుయాత్ర నిర్వహించేందుకు సిద్ధమైంది. నేడు తిరుపతిలో యాత్ర ప్రారంభమై మార్చి 5 వరకు సీమలోని నాలుగు జిల్లాల్లో కొనసాగుతుంది. నాలుగు జిల్లాల్లోనూ సిపిఎం, సిపిఐ నేతలు పర్యటిస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తారు. ఇదే స్ఫూర్తితో మార్చి 11న చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించనున్నారు. సీమకు ప్రత్యేక ప్యాకేజీ, హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్ట్‌ల పూర్తి, కడపలో ఉక్కు కర్మాగారం తదితర హామీలు ఏమయ్యాయో ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు. ఆయా హామీలు ఎందుకు ముందుకు సాగడం లేదో వివరించనున్నారు.

వచ్చే వార్షిక బడ్జెట్‌లో వెనుకబడిన రాయలసీమ సమగ్రాభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వకపోతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ద్రోహిగా మిగిలిపోతారని సిపిఎం పోలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. సీమ సమగ్రాభివృద్ధికి చంద్రబాబే ఆటంకమని విమర్శించారు. మదనపల్లి బిటి కళాశాల ఆవరణలో రాయలసీమ అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా సమగ్రాభివృద్ధిపై ఏర్పాటు చేసిన ప్రత్యేక సదస్సుకు ఎంఎల్‌సి యండపల్లి శ్రీనివాసులురెడ్డి అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ, రాయలసీమ అభివృద్ధి పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదన్నారు. సీమ సమగ్రాభివృద్ధికి చంద్రబాబు ఆలోచనలు, ప్రభుత్వ విధానాలే ప్రధాన ఆటంకంగా ఉన్నాయన్నారు. హంద్రీనీవా కాల్వ గట్లుపై...

సీమ అభివృద్ధిలో భాగంగా ఉద్యమాలకు సీపీఎం శ్రీకారం చుట్టినట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. రాయలసీలమ అభివృద్ధి నినాదంతో వచ్చే నెలలో భారీ ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. ఫ్రిబవరి రెండో వారంలో రాయలసీమ జిల్లాల నుండి బస్సు, పాదయాత్రలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మార్చి మొదటి వారంలో అసెంబ్లీని ముట్టడిస్తామని, రాయలసీమలోని సమస్యలు పరిష్కరించాలని, ప్రత్యేక రాయలసీమ అన్నది వ్యర్థమైన డిమాండ్ అని తెలిపారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాయలసీమకు అదనంగా నిధులు కేటాయించాలన్నారు. మంచినీటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. టిటిడి నిధులను రాయలసీమ జిల్లాల నీటి సదుపాయానికి వినియోగించాలని, జన్మభూమి పేరిట జరుగుతున్నది ప్రచార...

Pages