District News

 ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించి ప్రత్యామ్నాయ వైద్య సదుపాయాలు అందించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌ నరసింగరావు డిమాండు చేశారు. శ్రీకాళహస్తి పట్టణంలో ఇటీవల డెంగీతో మృతి చెందిన జయశ్రీ,ఇషాంక్‌ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులలో తమ బిడ్డలకు సరైన వైద్యం అందకపోవడం వల్లే మృతి చెందారని బాధిత తల్లిదండ్రులు తమ ఆవేదన వ్యక్తం చేశారు .  చిత్తూరు జిల్లాలో మూడు నెలల వ్యవధిలో డెంగీతో 20 మంది మృతి చెందారని, ఇతర జ్వరాలతో లక్షా 44 కేసులు నమోదైనా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా విజయవాడలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది కార్మికులు ముందు రథం సెంటర్‌కు చేరుకు న్నారు. అక్కడి నుంచి ర్యాలీలో కార్మికులు చీమల దండులా కదిలారు. దీంతో బెడవాడ ఎర్రబారింది. ప్రజానాట్య మండలి కళాకారుల పాటలు, డప్పు కళాకారుల వాయిద్యాలు కార్మికులను ఉత్సాహపరి చాయి. ఫ్లైఓవర్‌ మీదుగా సాగిన ర్యాలీ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వరకు కొనసాగింది. సిఐటియు, ఏఐటి యుసి, ఐఎప్‌టి యు, టియుసిసి, వైఎస్‌ఆర్‌టియుసి, ఐఎన్‌టియుసి, ఏఐసిసిటియుసి, ఐఎఫ్‌టియు తదితర కార్మిక సంఘాల రాష్ట్ర నాయకులు ఈ ర్యాలీకి అగ్రభాగాన ఉండి నడిపించారు. సిపిఎం, సిపిఐ...

ఎస్‌పి, ఎస్‌టి మహిళలపై ఈ కాలంలో దాడులు విపరీతంగా పెరిగిపోయాయని కెవిపిఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు కె సుబ్రమణ్యం అన్నారు.దళితులు విద్య ,వైద్యం ఉపాధి కరువైందని వీటిని అధికమించడానికి అంబేద్కర్‌ 125వ జయంత్రి సందర్భంగా ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశం నిర్వహించి దళితుల సమస్యలను చర్చించాలన్నారు.ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు సాధనకై ఉద్యమించాలని పిలుపు నిచ్చారు.ప్రభుత్వం అవలబిస్తున్న ఆర్థిక సరళీకరణ విధానాల వల్ల ప్రభుత్వ రంగ సంస్థలు నర్వీర్యమైపోయి ప్రయివేటు పరంగా బలపడుతున్న తరుణంలో దళితులు బలహీన వర్గాలవారికి ఉపాధిలేక వీధిన పడుతుఉన్నారని తెలిపారు

 

 రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజధాని నిర్మాణం విషయంలో తీవ్ర గందరగోళంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ప్రాంతంలో రైతుల నుండి భయపెట్టి ఇప్పటి వరకు 33,500 ఎకరాల భూమి తీసుకున్న ప్రభుత్వం సింగపూర్‌, జపాన్‌ ప్రతినిధులతో చర్చలు జరిపారు. అనంతరం ఊహాచిత్రాలు విడుదల చేసి రాజధాని నిర్మాణం ఆగమేఘాలమీద జరిగిపోతుందని అరచేతిలో వైకుంఠం చూపించారు. రెండు రోజుల నుండి పత్రికల్లో (ముఖ్యమంత్రి అనుకూల పత్రిక) ప్రభుత్వం, ముఖ్యమంత్రి ప్రకటనల తీరు మారింది. టర్కీ దేశ రాజధాని ఇస్తాంబుల్‌ తరహాలో నిర్మాణం చేపడతామని వార్తలు లీక్‌ చేయడం స్థానికంగా కలకలం రేపింది. మంగళవారం ఆ పార్టీకి చెందిన వెంకటపాలెం మాజీ సర్పంచ్‌ బెల్లంకొండ నరసింహారావు ప్రభుత్వం, ముఖ్యమంత్రి రాజధాని...

కుప్పంలో ఏకపక్షంగా జరుగుతున్న భూసేకరణకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల మద్దతు కూడగట్టి పెద్ద ఎత్తున అసెంబ్లీని ముట్టడిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు హెచ్చరించారు. ప్రభుత్వం నిర్భంధాన్ని ప్రయోగిస్తే రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. విమానాశ్రయం కోసం భూములు కోల్పోతున్న కుప్పం నియోజక వర్గంలోని కడపల్లి, పాడుచేన్లు, తిమ్మరాజుపల్లి, కనుమలదొడ్డి, బీర్నకుప్పం గ్రామాల్లో గురువారం ఆయన విస్తృతంగా పర్యటించారు. విమానాశ్రయానికి ప్రతిపాదించిన భూములను ఆయన సందర్శించారు. బాధిత రైతులతో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా కడపల్లిలో జరిగిన రైతుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు భూ బ్యాంకు పేరిట పది లక్షల ఎకరాలను ఏకపక్షంగా...

ఆత్మహత్యలు పాల్పడిన రైతుల కుటుంబ సభ్యులు జంతర్‌ మంతర్‌ వద్ద ఆగస్ట్‌ ఈ నెల 10, 11 తేదీల్లో రెండు రోజుల పాటు పార్లమెంటు ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ ప్రధాన కార్యదర్శి హన్నన్‌ మొల్లా చెప్పారు.గత రెండున్నర దశాబ్దాలుగా అమలు చేస్తున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాల ఫలితంగా రైతాంగం చెప్పనలవి కాని బాధలను అనుభవిస్తోందని, వ్యవసాయ రంగం కుదేలయిందని మొల్లా విమర్శించారు. రైతాంగం ఆత్మహత్యలకు ఈ విధానాలే కారణమన్నారు. అధికారిక అంచనాల మేరకు ఈ కాలంలో మూడున్నర లక్షల మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు.ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబ సభ్యులకు కనీసం రూ. 10 లక్షల ఆర్థిక సహాయం, ఆత్మహత్యలు చేసుకున్న రైతుల రుణాల మాఫీ , కేరళ తరహాలో...

రాష్ట్రంలోని మూడు విశ్వవిద్యాలయాల్లో ప్రభుత్వం జపాన్‌ భాషను ప్రవేశపెట్టింది. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర, గుంటూరులోని ఆచార్య నాగార్జున, విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయాలను దీనికోసం ఎంపిక చేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే జపాన్‌ భాషపై విద్యార్థులకు బోధనా తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సుమితా దావ్రా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జపాన్‌ భాషపై బోధనా తరగతులను చేపట్టడానికి ఈ మూడు విశ్వవిద్యాలయాలకు అనుమతులను మంజూరు చేశారు. జపాన్‌ పెట్టుబడులపై రాష్ట్ర ప్రభుత్వం ఆశలు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏడాదిలో రెండుసార్లు ఆ దేశంలో పర్యటించారు. జపాన్‌కు చెందిన పలు...

పెట్టుబడిదారుల దోపిడీ వల్లే కొన్ని ప్రాంతాలు వెనుకబడుతున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.కృష్ణయ్య ఆందోళన వ్యక్తంచేశారు. వారి దోపిడీని అరికట్టి అభివృద్ధికి పార్టీ శ్రేణులు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. తిరుపతి సుందరయ్య నగర్‌లోని ఎంబి భవన్‌లో సిపిఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కృష్ణయ్య మాట్లాడుతూ.. సామ్రాజ్య వ్యవస్థను, భూస్వామి వ్యవస్థను వ్యతిరేకించే వారిని కలుపుకుని ఉద్యమించాలన్నారు. గ్రామీణ వ్యవస్థలో నెలకు ఐదువేల రూపాయలకు మించి ఆదాయం రాని వారు 50 శాతానికి పైగా ఉన్నారన్నారు. ప్రస్తుతం దేశ ప్రజలు ప్రత్యామ్నాయం వైపు అడుగులేస్తున్నారని, కలిసొచ్చేవారిని కూడగట్టుకుని...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా ధ్వజమెత్తారు. ట్యాపింగ్ తప్పు అని చెప్పిన చంద్రబాబు ఏ చట్టం ప్రకారం ట్యాపింగ్ టెక్నాలజీని కొనుగోలు చేస్తున్నారని ప్రశ్నించారు. బాబు సీఎంలా కాదు.. సెటిల్‌మెంట్ మినిస్టర్‌లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ట్యాపింగ్ టెక్నాలజీ కొనుగోలుకు బాబు యత్నిస్తున్నాడన్న వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రోజా డిమాండ్ చేశారు. 

Pages