రాజధానిపై బిజెపి అసలు నాటకం బయటపడింది.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 13 ఏప్రిల్‌, 2024.

 

రాజధానిపై బిజెపి అసలు నాటకం బయటపడింది.

`సిపిఎం రాష్ట్ర కమిటీ

 

రిజర్వుబ్యాంకు ప్రాంతీయ కార్యాలయం విశాఖలో ఏర్పాటు చేయడానికి 2022లో నిర్ణయం జరిగినా తాత్సారం చేసిన ఆర్‌బిఐ ఇప్పుడు తాజాగా రాజధాని ఎక్కడో తేల్చాకే నిర్ణయిస్తామని పేర్కొనడం రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడం, అవమానపర్చడమే. ఆంద్రప్రదేశ్‌ రాజధాని అమరావతి అని గతంలోనే కేంద్ర ప్రభుత్వం గెజిట్‌లో నోటిఫై చేయడమే కాక పార్లమెంటులో పలుమార్లు తెలిపింది. అయినా ఆర్‌బిఐ ప్రాంతీయ కార్యాలయ ఏర్పాటుకు దాన్ని ఒక షరతుగా పేర్కొనడం అసంబద్ధం. మూడు రాజధానుల పేరిట వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం చేసిన గందరగోళాన్ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఏనాడు వ్యతిరేకించలేదు. పైపెచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమన్న రీతిలో హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది కూడా. రాజధాని అమరావతికి పిడికెడు మట్టి,చెంబుడు నీళ్లు మోడీ గుమ్మరించి పోయారు. ఆ నాటి నుండి, అస్పష్టత కొనసాగడంతో బిజెపి దొంగనాటకాలు ఆడుతూనే ఉంది. ఇప్పటికైనా వాటికి తెరదించి, రాష్ట్రంలో ఆర్‌బిఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేసేటట్లు చర్యలు తీసుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తోంది.

 

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి