సీపీఎం పోటీ చేసే స్థానాలు

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 12 ఏప్రిల్‌, 2024.

సిపిఐ(యం) రాష్ట్ర కమిటి సమావేశం ఈ రోజు ఆన్‌లైన్‌లో కా॥.వై.వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. దీనికి పోలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు హాజరయ్యారు.
రాష్ట్రానికి ద్రోహం చేసిన మతోన్మాద బిజేపీ, దాని మిత్ర పక్షాలను, బిజేపీ కొమ్ముకాస్తున్న నిరంకుశ వైసీపిని ఓడించడానికి ఇండియా వేదిక పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు చేసుకొని ఉమ్మడిగా పోటీ చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ చేసిన నిర్ణయం మేరకు సిపిఐ, కాంగ్రెసు పార్టీలతో చర్చల అనంతరం జరిగిన ఒప్పందం ప్రకారం ఈ కింది స్థానాలలో పోటీ చేయాలని రాష్ట్ర కమిటీ సమావేశం నిర్ణయించింది.

పార్లమెంటు:
1) అరకు

అసెంబ్లీ:
1) రంపచోడవరం
2) కురుపాం
3) గాజువాక
4) విజయవాడ (సెంట్రల్‌)
5) గన్నవరం
6) మంగళగిరి
7) నెల్లూరు టౌన్‌
8) పాణ్యం

రాష్ట్రంలో ప్రధానమైన రెండు పార్టీలు, కూటములు బిజేపీకి లొంగిపోయిన నేపథ్యంలో ప్రధానమైన ఆ రాజకీయ కర్తవ్య నిర్వహణలో ఇండియా వేదిక పార్టీలు ఐక్యంగా సర్దుబాటు చేసుకొని పోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిరది. గతంలో సిపియం పది అసెంబ్లీ స్థానాలు ప్రకటించినప్పటికీ రాజకీయ ఆవశ్యకత రీత్యా కాంగ్రెసుతో పై ఒప్పందం చేసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాపితంగా సిపిఐ(యం) శ్రేణులు ఇండియా వేదిక పార్టీలైన సిపిఐ(యం), సిపిఐ, కాంగ్రెసు అభ్యర్ధుల విజయానికి కృషి చేయాలని, రాష్ట్ర ప్రజానీకం ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి