పార్టీ రాష్ట్ర ఆఫీసుల్లో పార్టీ జెండాను మున్సిపల్‌ అధికారులు అర్థరాత్రి పీకివేసి జెండా దిమ్మెలకు రంగులు పూయటం గురించి...

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 19 మార్చి, 2024.

శ్రీయుత జిల్లా కలెక్టర్‌ మరియు జిల్లా ఎన్నికల అధికారి,

ఎన్‌టిఆర్‌ జిల్లా,

విజయవాడ.

 

విషయం : పార్టీ రాష్ట్ర ఆఫీసుల్లో పార్టీ జెండాను మున్సిపల్‌ అధికారులు అర్థరాత్రి పీకివేసి జెండా దిమ్మెలకు రంగులు పూయటం గురించి...

అయ్యా!

తేది 17.03.2024 అర్థరాత్రి రాఘవయ్య పార్కువద్ద నున్న పార్టీ రాష్ట్ర కమిటీ ఆఫీసుల్లో మున్సిపల్‌ అధికారులు పార్టీ జెండాను పీకివేశారు. పార్టీ ఆఫీసు గోడకానుకుని ఉన్న మాపార్టీ ప్రణాళిక ఫ్లెక్సీని తీసుకెళ్ళారు. జెండా దిమ్మకు తెల్లరంగులు పూశారు. పార్టీ రాష్ట్ర ఆఫీసులో ఈ విధమైన చర్యలకు పూనుకోవడం చట్ట విరుద్దం. ఎన్నికల మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్టుకు విరుద్దం. దీనిపై మీరు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.

తేది. 19.03.2024 మున్సిపల్‌ లోకల్‌ ప్లానింగ్‌ ఆఫీసరు వచ్చి పార్టీ ఆఫీసు గోడపైనున్న పార్టీ పేరును కూడా తొలగించాలి లేదా మూసివేయాలని హెచ్చరించారు. ఇటువంటి చర్యలు ఎన్నికల కోడ్‌లో ఎక్కడా పేర్కొనలేదు. పబ్లిక్‌ ప్రాపర్టీ స్థలంలో ఎన్నికల ప్రచారం చేయకూడదు తప్ప రాష్ట్ర కమిటీ ఆఫీసులో కూడా జెండాలు పీకడం చట్ట విరుద్దం.

దీనిపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.

అభివందనములతో...

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి

కాపీటు :

చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌,

ఎలక్షన్‌ కమీషన్‌ ఆఫ్‌ ఇండియా,

వెలగపూడి,

ఆంధ్రప్రదేశ్‌.