రాష్ట్ర రాజధాని విషయంలో వైసిపి పిల్లి మొగ్గల్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 13 ఫిబ్రవరి, 2024.

        రాష్ట్ర రాజధాని విషయంలో వైసిపి పిల్లి మొగ్గల్ని సిపిఎం రాష్ట్ర కమిటీ
తీవ్రంగా ఖండిస్తున్నది. వైసిపి అధికార ప్రతినిధి వై.వి. సుబ్బారెడ్డి
ప్రతిపాదించడం దానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంతపాడటం చూస్తుంటే
వైసిపి ఉద్దేశపూర్వకంగానే ప్రజలను గందరగోళానికి గురిచేయడమే కాకుండా
తెలంగాణకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టి తమ వైఫల్యాన్ని కప్పిపెట్టుకునే
ప్రయత్నం చేస్తున్నట్లు అర్థం అవుతున్నది. ఇట్లాంటి చర్చల్ని ఆపేయాలని
కోరుతున్నాము. తెలంగాణ ఎన్నికలకు ముందు నాగార్జునసాగర్‌ వద్ద పోలీసులు
మోహరించి నాటకం ఆడినట్లు ఇప్పుడు మరో కొత్త నాటకానికి తెరలేపింది.
        అంతేగాకుండా అమరావతి రాజధానిగా దారి తప్పించే ప్రయత్నం చేస్తున్నది. ఇది
ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఏమాత్రం సమ్మతం కాదు. హైదరాబాదును వదిలేసి పది
ఏండ్లు అయింది. ఇప్పుడు హైదరాబాద్‌ రాజధాని అంటూ కొత్త చర్చను లేవదీసి
మొత్తం ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నది. అమరావతి
రాజధానిగా అంగీకరించి అభివృద్ధి చేయకపోతే వైసిపిని ప్రజలు క్షమించరు.

(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి