అంగన్వాడిల అక్రమ అరెస్టులకు ఖండన

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 27 డిసెంబర్‌, 2023.

 

అంగన్వాడిల అక్రమ అరెస్టులకు ఖండన

రాష్ట్రవ్యాప్తంగా 16 రోజుల నుండి ప్రశాంతంగా పోరాటం చేస్తున్న అంగన్వాడి కార్యకర్తలను విజయవాడలో అరెస్టు చేయటాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది. విజయవాడ నగర అంగన్‌వాడీలు తమ ఎమ్మెల్యేని కలుసుకొని విన్నవించుకోవడాన్ని పోలీసులు అడ్డుకోవడం, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అమానుషంగా ప్రవర్తించడం గర్హనీయం.

విజయవాడ నగరంలో స్థానిక ఎమ్మెల్యేలకు మెమోరాండాలు ఇవ్వటానికి కూడా అంగన్వాడీలకు అవకాశం కల్పించకపోవటాన్ని తప్పు పట్టింది. సమస్యను చెప్పుకుందామని స్థానిక ఎమ్మెల్యేలను కలుద్దామని ప్రయత్నించిన అంగన్వాడీలను, పోలీసులతో రోడ్లుపై ఈడ్చుకెల్లారు. బస్సుల్లో కుక్కారు. అనేకమంది గాయపడ్డారు. అక్కసుతో ధర్నా శిబిరాన్ని పూర్తిగా ధ్వంసంచేశారు. సంఘాల నాయుకులు కె.శ్రీదేవి, ఎన్‌సిహెచ్‌.సుప్రజ, కమల, గజలక్ష్మి, ఎల్లారాణి, రమ, సిఐటియు నాయకులు ఎ.వెంకటేశ్వరరావు, దుర్గారావు, నారాయణలను అరెస్టు చేశారు. నిర్బంధంతో ఉద్యమాన్ని అణిచివేయాలని ప్రయత్నించటం దారుణం.

లబ్ధిదారుల్లోనూ ప్రజల్లో కూడా అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లకు మద్దతు చేకూరుతున్న అంశాన్ని పరిగణలోకి తీసుకుని సమస్య పరిష్కారానికి సత్వరమే పూనుకోవాలని సిపిఐ(యం) కోరుతున్నది. సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి తగదు. ఏమాత్రం ఆలస్యం కాకుండా జీతాల పెంపుదలతో పాటుగా మిగిలిన సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నది.

అరెస్టు చేసి వివిధ కళ్యాణ మండపాలకు తరలించిన అంగన్వాడీలను పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సి.హెచ్‌.బాబూరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు డి.కాశీనాధ్‌, మరియు జిల్లా, నగర నాయకులు వెళ్లి అంగన్‌వాడీల పోరాటానికి మద్దతుని తెలియజేశారు.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి