సోషలిజం అజేయం.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్‌ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 07 నవంబర్‌, 2023.

 

సోషలిజం అజేయం 

అక్టోబర్‌ విప్లవ వార్షికోత్సవం సందర్భంగా

సిపిఐ(యం) రాష్ట్ర ఆఫీసులో పతాకావిష్కరణ

 

అక్టోబర్‌ విప్లవ 106వ వార్షికోత్సవం సందర్భంగా సిపిఐ(యం) రాష్ట్ర కార్యాలయం (విజయవాడ) వద్ద పార్టీ సీనియర్‌ నాయకులు బి.ఆర్‌.తులసీరావు పతాకావిష్కరణ చేశారు. ఆయన మాట్లాడుతూ సోవియట్‌ రష్యాలో కార్మికులు, కర్షకులు జార్‌ చక్రవర్తిని కూలదోసి కార్మిక రాజ్యాన్ని సాధించారు. అప్పటి వరకు కార్మికులు, పేదలు రాజ్యాన్ని పరిపాలించలేరు, బానిసలు, కూలీలుగానే ఉండమని బోధించేవారని, కానీ అక్టోబర్‌ విప్లవం సాధించాక కార్మికులకు, పేదలకు అండగా ఎర్రజెండా నిలబడిరదని తెలియజేశారు. 

పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ప్రపంచ మానవాళికి మార్గదర్శకులుగా సోషలిజం, కమ్యూనిజం, కార్మికవర్గ రాజ్యంకోసం నిలబడే శక్తులేతప్ప మరోటి కాదని తెలియజేశారు. మాతృభూమికోసం పోరాడుతున్న పాలస్తీనీయులమీద  ఇజ్రాయల్‌ సామ్రాజ్యవాదం దుర్మార్గంగా దాడిచేస్తున్నదని, సామ్రాజ్యవాదం ఉన్నంతకాలం అది ఎక్కడుంటే అక్కడ శాంతి, స్వేచ్చ, ప్రజాస్వామ్యం ఉండదన్నారు. నరేంద్రమోడి ప్రభుత్వం, నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి దేశ ప్రథమ పౌరురాలికి కూడా ఆహ్వానం లేకుండా చేసిందని తెలిపారు.

సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సోషలిజానికి ప్రాధాన్యత లేదని, సోషలిజం ప్రాధాన్యత కోల్పోయిందని, పెట్టుబడిదారులు, పెట్టుబడిదారీ పత్రికవర్గాలు చేసేవన్నీ ఒక విషప్రచారం, దుష్ప్రచారం మాత్రమేనన్నారు. తాత్కాలికంగా సోషలిజానికి కొన్ని ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ సోవియట్‌ విప్లవంయొక్క ఉత్సాహంతో, ప్రపంచవ్యాపితంగా అనేక దేశాల్లో పెట్టుబడిదారీ, భూస్వామ్య వ్యవస్థలను కూల్చివేయబడ్డాయన్నారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని ఒంటరిపాటు చేయాలని కోరారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు జె.జయరాం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సభ్యులు పి.మురళీకృష్ణ, కె.స్వరూపరాణి, య.సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. 

 

(జె.జయరాం)

ఆఫీసు కార్యదర్శి