December

తాడేపల్లిలో సిపిఎం 26 వ రాష్ట్ర మహాసభలు ప్రారంభం

సిపిఎం 26 వ రాష్ట్ర మహాసభలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభ సూచికగా సీనియర్‌ నేత బిఆర్‌ తులసీరావు జెండా ఆవిష్కరణ చేశారు. పార్టీ నేతలు, మహాసభల ప్రతినిధులంతా అమరవీరులకు నివాళులర్పించారు. చిన్నారులు సాంస్కృతిక కళలతో అలరించారు. మహిళలు కోలాటంతో సంబరాలు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. వివిధ వర్గాలు, ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆయా ప్రాంతాల్లో ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తున్న సిపిఎం కార్యకర్తలు మూడు రోజుల పాటు జరిగే ఈ మహాసభల్లో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చలు నిర్వహించబోతున్నారు.

ఆస్తిపన్ను పెంపు, చెత్తపన్ను విధింపుకు వ్యతిరేకంగా

ఆస్తిపన్ను పెంపు, చెత్తపన్ను విధింపుకు వ్యతిరేకంగా విజయవాడ మున్సిపల్ కార్యాలయం వద్ద సీపీఎం నిరసన.. కౌన్సిల్ సమావేశం సందర్భంగా కార్పొరేషన్ కార్యాలయం ముట్టడి..కేంద్రం రాష్ట్రం మీద ఆదేశించటం, రాష్ట్ర ప్ర‌భుత్వం కార్పొరేషన్ ను ఆదేశించడంతో 1200 కోట్లరూపాయ‌ల ప‌న్నుల భారం పెంచారు - పన్నులు పెంచడం తప్ప అభివృద్ధి లేదు. అధికార‌పార్టీ కార్ప‌రేట‌ర్లు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారని ఆగ్రహం వ్యక్తం చేసిన సిపిఎం నాయకులు..

Pages

Subscribe to RSS - December