District News

 ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతోనే వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే పాటూరు రామయ్య పేర్కొన్నారు.కర్నూలులోని సిపిఎం జిల్లా కమిటీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలను ద్దేశించి పాటూరు మాట్లాడుతూ, రైతాంగం, శ్రమ జీవుల కష్టాలు, నిరుద్యోగ సమస్య తీరాలంటే ప్రత్యేక హోదా తప్పనిసరని తెలిపారు. ప్రత్యేక హోదాతో పరిశ్రమలు, ఉద్యోగాలు వస్తాయని భావిస్తే ఉన్న ఉద్యోగాలు పోయాయన్నారు. విడిపోయే సందర్భంలోనే రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడ్డ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు కావాలని తాము కోరామని, ఈ విషయం గురించి ప్రధాని ఏమీ మాట్లాడడంలేదని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్షాలు, కలిసొచ్చే అన్ని పార్టీలనూ కలుపుకొని కేంద్రంపై...

 ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కర్నూలులో సీపీఎం రీలే నిరహార దీక్షలు చేపట్టింది. రాష్ర్ట విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చడం లేదని సీపీఎం రాష్ర్ట కార్యదర్శివర్గ సభ్యులు  ఎంఏ గఫూర్ విమర్శించారు.  ఇప్పటికైనా కేంద్రం స్పందించకపోతే ఈనెల 15న అన్ని జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయాల ఎదుట ధర్నా చేపడుతామని ఆయన హెచ్చరించారు. రాయలసీమలో కరువుతో ప్రజలు అల్లాడుతున్నారని, లక్షలాది మంది వలసలు వెళ్లారన్నారు. రాయలసీమ ప్రాంతం యొక్క సమస్యలను పరిష్కరించడానికి లక్ష కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని గఫూర్ డిమాండ్ చేశారు. 

రాయలసీమ అభివృద్ధికి రూ. 50 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ, ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె ప్రభాకర్‌ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కర్నూలు జిల్లాలో చేపట్టిన సిపిఎం జీపుజాతా బుధవారం నంద్యాల, గాజులపల్లె, మహానంది, వెలుగోడు, ఆత్మకూరు, పాములపాడు మండలాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్‌లో బిజెపి అగ్రనాయకులు వెంకయ్యనాయుడు ఎపికి పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక ప్రత్యేకహోదా గురించి పట్టించుకోవడం లేదన్నారు. కర్నూలు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు. శ్రీశైలం డ్యాంలో 854 అడుగుల నీటిమట్టం చేరుకున్న...

ప్రభుత్వం చేనేత పార్కులను ఏర్పాటు చేసి చేనేత కార్మి కులకు ఉపాధి కల్పించాలని ఎపి చేతి వృత్తిదారుల సంఘం రాష్ట్ర కన్వీనర్‌ పి జమలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట ఎపి చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో నేత కార్మికులు ధర్నా చేశారు. కర్నూలు జిల్లా కార్యదర్శి జెఎన్‌ శేషయ్య అధ్యక్షత జరిగిన ధర్నాలో జమలయ్యతోపాటు, కార్మికుల ఆందోళనకు మద్దతు పలుకు తూ సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు షడ్రక్‌ కూడా మాట్లా డారు. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. జిల్లాలో 15 వేలకు మందికిపైగా చేనేత వృత్తిపై ఆధారపడ్డారని తెలిపారు. వీవర్స్‌ క్రెడిట్‌ కార్డ్సు పథ కం ద్వారా 2013-14లో వంద మందికి, 2014-15లో 900 మంది...

జిల్లాలో వర్షాభావ పరి స్థితుల వల్ల వ్యవసాయం దెబ్బ తిందని, ఉపాధి కూలీలకు పనులు దొరకడం లేదని, ఈ నేపథ్యంలో కర్నూలును కరువు జిల్లాగా ప్రకటించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక సుదర్శనవర్మ స్మారక భవనంలో సిపిఎం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం లో కరువు పరిస్థితి నెలకొంటే ముఖ్య మంత్రి విదేశీ పర్యటలకు ఎక్కువ సమయం కేటాయి స్తున్నారని అన్నారు. వేల, కోట్ల రూపాయలు ప్రజా ధనాన్ని వెచ్చించి చేపట్టిన హంద్రీనీవా పనుల్లో మామూళ్ల కోసం నాణ్యతను పట్టించు కోకుండా నాసిరకంగా నిర్మాణం చేపటా ్టరన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగుల నీరు ఉంచాలని, జిల్లాలోని...

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా విజయవాడలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది కార్మికులు ముందు రథం సెంటర్‌కు చేరుకు న్నారు. అక్కడి నుంచి ర్యాలీలో కార్మికులు చీమల దండులా కదిలారు. దీంతో బెడవాడ ఎర్రబారింది. ప్రజానాట్య మండలి కళాకారుల పాటలు, డప్పు కళాకారుల వాయిద్యాలు కార్మికులను ఉత్సాహపరి చాయి. ఫ్లైఓవర్‌ మీదుగా సాగిన ర్యాలీ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వరకు కొనసాగింది. సిఐటియు, ఏఐటి యుసి, ఐఎప్‌టి యు, టియుసిసి, వైఎస్‌ఆర్‌టియుసి, ఐఎన్‌టియుసి, ఏఐసిసిటియుసి, ఐఎఫ్‌టియు తదితర కార్మిక సంఘాల రాష్ట్ర నాయకులు ఈ ర్యాలీకి అగ్రభాగాన ఉండి నడిపించారు. సిపిఎం, సిపిఐ...

 ప్రభుత్వం నిత్యవసర ధరలు తగ్గిం చాలని కర్నూలు సిపిఎం జిల్లా కార్యదర్శి కె ప్రభాకర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.  రాష్ట్రానికి, దేశానికి ఉల్లిని సరఫరా చేసే కర్నూలులోని బహిరంగ మార్కెట్‌లో ధర రూ.50లు పలుకుతుందని, కందిపప్పు కిలో రూ.100లకు దాటిపోయిందని, కూరగాయలు కొనలేని పరిస్థితిల్లో సామాన్యులు ఉన్నారని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాలని సిపిఎం నగర కార్యదర్శి డి.గౌస్‌ దేశారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గౌస్‌దేశారు మాట్లాడుతూ, ఎన్నికల ముందు బిజెపి నాయకులు ఇచ్చిన హామీలు అమలు చేయాని కోరారు. బిజెపి, టిడిపి కుమ్మ క్కై ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఎన్నిక లకు ముందు ప్రత్యేకహోదాపై గగ్గోలు పెట్టి ఇప్పుడు పలకడం లేదని అన్నారు. కేంద్రంపై ఒత్తిడి తేవడానికి అన్ని రాజకీయ పార్టీలనూ ఏకం చేసి పోరాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందన్నారు. రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

 

కర్నూలు:కోడుమూరు మండలం అమడగుంట్ల బీసీ హాస్టల్‌లో విషాహారం తిన్న 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. హాస్టల్‌ అస్వస్థతకు కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

భారతదేశం గుర్తించిన రెండవ అధికార భాష అయిన ఉర్దూను అభివృద్ధి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచంలో ఇంగ్లీషు తర్వాత ఎక్కువమంది మాట్లాడే భాష ఉర్దూ. కావున ఉర్దూనే మరింత అభివృద్ధి చేయాలి. అయితే ఉర్దూ భాష ఎక్కువగా ముస్లింలకే అనే ముద్రపడింది. కానీ ఉర్దూ అంతర్జాతీయ భాష. ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం జపనీస్‌ భాషను కోర్సుగా పెట్టి నేర్పించాలని ప్రయత్నిస్తున్నది. కానీ ఇప్పటికే వాడుకలో ఉన్న ఉర్దూ అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడం సరైంది కాదు. గతంలో ఉర్దూ ఒక సబ్జెక్టుగా ఉండేది. కానీ నేడు ముస్లిం సమాజం ఎక్కువగా నివసించే ప్రాంతాలలో ఉర్దూ పాఠశాలలు అధికంగా ఏర్పాటు చేశారు. కానీ ప్రభుత్వ ఉర్దూ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులు...

Pages