సిపిఎం ఉచిత మెడికల్‌ క్యాంపు..

 తూర్పుగోదావరి జిల్లా చింతూరులో గిరిజన సంఘం, జన విజ్ఞాన వేదిక, ఎపిఎంఎస్‌ఆర్‌యు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్యశిబిరానికి విశేష స్పందన లభిస్తోంది. మన్యంలో మలేరియా కేసులు లేవని ప్రభుత్వం చెబుతోంది. వైద్య శిబిరంలో బ్రెయిన్‌ మలేరియా కేసులు అధికంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. చింతూరులో ఈనెల 23న ప్రారంభమైన వైద్య శిబిరం అక్టోబర్‌ 22 వరకు కొనసాగనుంది. బుధవారం 43 గ్రామాల నుంచి రోగులు తరలివచ్చారు. 109 మందికి పరీక్షించగా, 22 మంది జ్వరపీడితులు ఉన్నారు. వీరిలో ఆరు బ్రెయిన్‌ మలేరియా పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయని  సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు  మిడియం బాబూరావు చెప్పారు. గురువారం 50 మంది రోగులను పరీక్షించగా, వారిలో 13 మంది జ్వరపీడితులున్నారు. ఆరుగురు బ్రెయిన్‌ మలేరియాతో బాధపడుతున్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఏజెన్సీ ప్రాంతంలో మలేరియా జ్వరాలు అధికంగా ఉండటంతో గిరిజన సంఘం, జనవిజ్ఞానవేదిక, ఎపిఎంఎస్‌ఆర్‌యు ఆధ్వర్యంలో చింతూరు మండల కేంద్రంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అక్టోబర్‌ 22వ తేదీ వరకు శిబిరం కొనసాగుంది.