విద్యకు మలాలా ప్రతీక:AIDWA

 'నా రెక్కలు విరవని నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు' అని చెప్పిన స్వేచ్ఛాజీవి, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌ జారు మహిళా విద్యకు, ప్రపంచశాంతికి ప్రతీక అని వక్తలు పేర్కొన్నారు. మలాలాను, ఆమె తల్లిదండ్రులను ప్రతి ఒక్కరూ స్పూర్తిగా తీసుకోవాలన్నారు. స్థానిక వింజనంపాడులోని కిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాల, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) సంయుక్తంగా కళాశాలలో శుక్రవారం మలాలా స్వీయ గాధను తెలియచేస్తూ ' నేను మలాలా' పేరుతో ముద్రించిన పుస్తకాన్ని వేలాది మంది విద్యార్థులు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు కళాశాల చైర్మన్‌ కోయ సుబ్బారావు అధ్యక్షత వహించారు. సభలో ప్రముఖ సాహితీ వేత్త, నాగార్జునా విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్‌ రావెల సాంబశివరావు పుస్తక పరిచయం చేశారు.