మున్సిపల్‌ కార్మికుల ధర్నా

మున్సిపల్‌ కార్మికుల పొట్టగొట్టే 279 జీవోను రద్దుచేయాలని కోరుతూ కనిగిరి నగర పంచాయతీ కార్మికులు శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం నుంచి నగర పంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిఐటియు కనిగిరి డివిజన్‌ కార్యదర్శి పీసీ కేశవరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త ఉద్యోలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారని అందులో పేర్కొన్నారు. ఇందులో భాగంగా హౌసింగ్‌, ఉపాధి హామి సిబ్బంది తొలగించారని, ఆరోగ్య మిత్ర, అంగన్‌వాడీల మెడమీద కత్తిపెట్టారని ఆన్నారు. మున్సిపల్‌ కార్మికుల తొలగింపునకు జీవో జారిచేయటం దారుణమన్నారు. ఇప్పటికైనా ఉద్యోగాల తొలగింపు చర్యలు మానుకోవాలని లేకుంటే పోరాటాలు తీవ్రతరం చేస్తామన్నారు. ధర్నా అనంతరం మున్సిపల్‌ కమిషనర్‌ కెవి పద్మావతికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఏ నారాయణ, వి కాశయ్య, మున్సిపల్‌ కార్మిక సంఘ నాయకులు ఓబయ్య, ప్రసాద్‌, మార్కు, దానియేలు, చార్లెస్‌, శేషయ్య, లక్ష్మయ్య, శేషగిరి, లక్ష్మి, బాలమ్మ, రమణయ్య, ప్రభాకరు పాల్గొన్నారు.