బినామీ పేర్లతో భూములు స్వాహా..

భూసేకరణకు ప్రభుత్వం సమాయత్తం కావడంతో కృష్ణానది చెంతనే ఉన్న లంక భూముల్లో రాజకీయ నాయకులు రాబందుల్లా వాలిపోతున్నారు. భూయజమానులను నయానో, భయానో బెదిరించి వారి నుంచి బినామీ పేర్లతో వాటిని కొనుగోలు చేస్తున్నారు. తక్కువ డబ్బు ముట్టచెబుతూ సొంతం చేసుకుంటున్నారు. సేకరణకు ఉద్దేశించిన భూముల్లో జరీబు, అసైన్డ్‌ భూములున్నాయి. జరీబు భూములకు రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయి. అసైన్డ్‌ భూములకు బినామీ పేర్లలో పెండింగ్‌ రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. ఈ లావాదేవీల్లో అధికార పార్టీ నాయకులే ఎక్కువగా ఉన్నారు. నోటిఫికేషన్‌ ద్వారా భూ సమీకరణకు ప్రభుత్వ సిద్ధం కావడంతో ఎకరం 5 లక్షల రూపాయల విలువ ఉన్న భూములకు 25 లక్షలు వెచ్చించి సొంతం చేసుకున్నారు. పట్టా భూములను ఎకరం 45 నుంచి 50 లక్షల రూపాయకలు కొనుగోలు చేశారు. భూములు అమ్మిన రైతులు భవిష్యత్‌లో ఎదురు తిరుగుతారేమోన్న అనుమానంతో వీడియో చిత్రీకరణ కూడా చేశారు. అమరావతి ప్రాంతంలో లంక భూములు కొన్న వారిలో మంత్రులు, వారి అనుచరగణం ఉన్నట్టు వినిపిస్తోంది..