పేదలపట్ల వివక్షతా?: బాబురావు

రాజధాని ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సిపిఎం కార్యకర్తలు నిత్యం పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుల సిహెచ్‌.బాబురావు కోరారు. ఉండవల్లి సిపిఎం కార్యాలయంలో సోమవారం జొన్నకూటి వీర్లంకయ్య అధ్యక్షతన సిపిఎం రాజధాని డివిజన్‌ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో బాబురావు మాట్లాడుతూ ప్రభుత్వం పేదల పట్ల ఉద్ధేశ్యపూర్వకంగానే వివక్ష చూపుతుందని విమర్శించారు. అందుకు పేదలకు ఇవ్వవలసిన పింఛన్లు సరిగా ఇవ్వకపోవడమేనని విశ్లేషించారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ ఉదాసీనత రోజురోజుకు పెరుగుతుందని మండిపడ్డారు. లంక గ్రామాల విషయంలో అధికారులు, మంత్రులు పొంతనలేని విధంగా మాట్లాడి గందరగోళం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అసైన్డ్‌, సీలింగ్‌ భూములు, సాగుదారుల పట్ల ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పెద్దఎత్తున పోరాటానికి సిద్ధమవుతుందని చెప్పారు.