పాల‌కుల దాడిని తిప్పికొట్ట‌గ‌లిగేవి ప్రజాపోరాటాలే. పి.దివాకర్‌ వర్ధంతి సభలో సిపిఎం కృష్ణా జిల్లా కార్యదర్శి ఆర్‌.రఘు

పాల‌కులు అన్ని వైపుల నుండి ప్రజల‌పైన ముప్పేట దాడి చేస్తున్న నేటి తరుణంలో ప్రజల‌ను కదిలించి పోరాటాలు చేయడం ద్వారానే వాటిని ఎదుర్కొనగల‌మని సిపిఎం కృష్ణాజిల్లా కార్యదర్శి ఆర్‌.రఘు అన్నారు. ఈ రోజు ఉదయం పాల‌ఫ్యాక్టరీ వద్ద గల‌ ఆఫీసులో కార్మికనేత సిపిఎం సీనియర్‌ నాయకు కామ్రేడ్‌ పి. దివాకర్‌ గారి 12వ వర్ధంతి సభలో ఆయన మాట్లాడుతూ రైతు నుండి బవంతంగా భూము గుంజుకుంటున్నారు. కార్మిక హక్కును కారాస్తున్నారు.  పట్టణాల్లో ప్రజపై భారాలు పెంచుతున్నారు. వీటికి వ్యతిరేకంగా ప్రజు సంఘటితం కాకుండా చీల్చ‌డానికి కుంపట్లు రగిలిస్తున్నారు.  ఇలాంటి పాల‌కులు ప్రజపై చేస్తున్న దాడుల‌ను ఎదుర్కొల‌నాంటే ప్రజను సమీకరించి పోరాటం చేయడం మినహా మరో మార్గం లేదన్నారు. గతంలో ఇటువంటి అనేక పరిస్థితును ఎదుర్కొని ఎర్రజెండాను  సమూన్నతంగా నిబెట్టిన కామ్రేడ్‌ దివాకర్‌ లాంటి వారు చూపిన మార్గం మనకు దారి చూసిస్తుందని అన్నారు. బిజెపి నాయకత్వంలో  నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజాస్వామ్య వాతావరణం తగ్గి  అసహనం పెరుగుతున్నది. ప్రజాపోరాటాల‌పై ఉక్కుపాదం మోపుతున్నారు. కార్మిక ఉద్యమాను నిర్భంధాతో అచాల‌ని చూస్తున్నారు. హేతువాద ఉద్యమ నాయకును హత్యు చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజాభిప్రాయాన్ని ప్రక్కన పెట్టి విదేశీ కార్పొరేట్‌ సంస్ధకు మన వనరుల‌ను కట్టబెట్టడానికి చూస్తున్నారు. ప్రశ్నించిన వారిని అరెస్టు చేస్తున్నారు. ఇటువంటి ప్రస్తుత తరుణంలో ప్రజాసమస్యపైన ప్రజను సమీకరించడం, సంఘాల నిర్మించడం పాకు విధానాకు వ్యతిరేకంగా పోరాటం చేయడమే సరైన మార్గం అన్నారు.